Home Entertainment 4 కోట్లు పెట్టి కొన్నారు..వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే మెంటలెక్కిపోతారు!

4 కోట్లు పెట్టి కొన్నారు..వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే మెంటలెక్కిపోతారు!

0 second read
0
0
304

తమిళ హీరో కార్తీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల పొన్నియన్ సెల్వన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీ తాజాగా సర్ధార్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. పొన్నియన్ సెల్వన్ తర్వాత కార్తీ క్రేజ్ పెరగడంతో సర్ధార్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విశాల్‌తో అభిమన్యుడు వంటి చిత్రాన్ని తెరకెక్కించిన పి.యస్.మిత్రన్ తెరకెక్కించిన ఈ సినిమాకు తొలిరోజే పాటిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే బాగుందని ప్రశంసలు వచ్చాయి. తొలిసారి కార్తీ ఈ మూవీలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభియం చేశాడు. ఈ చిత్రానికి తెలుగులో కంటే తమిళంలో మంచి వసూళ్లు వస్తున్నాయి. ఈ మూవీలో మాస్ ఆడియన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించేలా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయనే టాక్ వచ్చింది.

సర్ధార్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను చూసుకుంటే ఏపీ, తెలంగాణలో రూ.5.5 కోట్లకు విక్రయించినట్లు సమాచారం అందుతోంది. నాలుగు రోజుల వసూళ్లను పరిశీలిస్తే ఈ మూవీ రూ.4.5 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా రూ.కోటి వసూలు చేస్తే బ్రేక్ ఈవెన్‌కు చేరుతుంది. ఏరియాల వారీగా నైజాంలో నాలుగు రోజులకు రూ.2 కోట్లు, సీడెడ్‌లో రూ.47 లక్షలు, ఆంధ్రాలో రూ.2.03 కోట్ల వసూళ్లను సర్ధార్ వసూలు చేసింది. తొలిరోజు రూ.95 లక్షలు మాత్రమే రాబట్టిన ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి పుంజుకుంది. రెండో రోజు రూ.1.05 కోట్లు, మూడో రోజు రూ.1.48 కోట్లు, నాలుగో రోజు రూ.రూ.1.02 కోట్లు రాబట్టింది. సర్ధార్ సినిమాలో కార్తీ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. ఒకప్పటి హీరోయిన్ లైలా ఈ మూవీలో కీలక పాత్ర పోషించింది. మహారాజా రాథోడ్ పాత్రలో చంకీ పాండే అలరించాడు. వాటర్ మాఫియా గురించి దర్శకుడు ఈ సినిమాలో బాగా చూపించాడని ప్రశంసలు వస్తున్నాయి. సర్ధార్‌గా, ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాష్‌గా తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో కార్తీ అలరించాడని.. అతడి బెస్ట్ పర్ఫార్మెన్స్‌లలో సర్ధార్ కూడా ఒకటిగా నిలుస్తుందని రివ్యూలలో పేర్కొన్నారు.

కాగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలో ఇటీవల కాలంలో మూడు నెలల్లో మూడు సినిమాలను విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ఏకైక హీరో కార్తీ మాత్రమే. అతడు హీరో గా నటించిన విరుమాన్ చిత్రం ఆగస్టు 12న విడుదలై తమిళనాడు బాక్స్ ఆఫీస్‌ను ఒక ఊపు ఊపి రూ.100 కోట్లు వసూలు చేసింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సెప్టెంబర్ 30న విడుదల కాగా ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు అక్టోబర్‌లో సర్ధార్ సినిమాతో మరోసారి కార్తీ తన సత్తా చాటుకున్నాడు. ఈ సినిమా తెలుగు హక్కులను అక్కినేని నాగార్జున కొనుగోలు చేసి అన్నపూర్ణ బ్యానర్‌పై విడుదల చేశాడు. తొలి నాలుగు రోజుల్లోనే 4.5 కోట్లు రాబట్టిన ఈ మూవీ 90 శాతం రికవరీని సాధించింది. దీపావళి పూర్తయ్యేలోగా ఈ మూవీ లాభాల బాట పట్టనుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…