Home Entertainment 30 ఏళ్ళ తర్వాత కూడా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్న ఘరానా మొగుడు చిత్రం

30 ఏళ్ళ తర్వాత కూడా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్న ఘరానా మొగుడు చిత్రం

0 second read
0
0
440

మెగాస్టార్ చిరంజీవి కి తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఉండే స్థానం ని ఎవ్వరు రీ ప్లేస్ చెయ్యలేరు అనేది వాస్తవం..తెలుగు కమర్షియల్ సినిమా అంటే చిరంజీవి శకం కి ముందు చిరంజీవి శకం కి తర్వాత అని విభజించవచ్చు..ఆ స్థాయిలో ఆయన కోట్లాది మంది అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం ని ఏర్పాటు చేసుకున్నారు..ఆయన వచ్చిన తర్వాతనే సినిమాల్లో డాన్స్ స్టైల్ మారింది..ఫైట్ స్టైల్ మారింది..కామెడీ అనే జానర్ కూడా చిరంజీవే మన తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం చేసాడు అని చెప్పడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు..అలా ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ రూపు రేకలు మార్చడం అంటే మాములు విషయం కాదు..అది కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా..ఇంకా ఆయన గురించి..ఆయన సాధించిన విజయాల గురించి చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు సరిపోదు..అవన్నీ కాసేపు పక్కన పెడితే 30 ఏళ్ళ క్రితం విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు చిత్రం ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే.

ఇప్పుడు అదే సినిమాని ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్స్ లో స్పెషల్ షోస్ ని ఏర్పాటు చేసారు..తొలుత పాత సినిమా కదా..దీనికి ఎవరు వస్తారు..ఇంద్ర సినిమా వేసుకొని ఉంటె బాగుండేది అని సోషల్ మీడియా లో ఉండే మెగా అభిమానులు నిరాశకి గురైయ్యారు..పుట్టిన రోజు నాడు హౌస్ ఫుల్స్ పడకుండా చిరంజీవి గారికి అవమానకరంగా మిగులుద్దేమో అని కంగారు పడ్డారు..కానీ అక్కడ ఉన్నది మెగాస్టార్ చిరంజీవి..30 ఏళ్ళ క్రితం సినిమా కాదు..చిరంజీవి కెరీర్ ప్రారంభం లో వచ్చిన సినిమాలను స్పెషల్ షో వేసిన హౌస్ ఫుల్ చేసే అభిమానులు ఆయన సొంతం..అలాగే ఘరానా మొగుడు స్పెషల్ షోస్ కూడా అభిమానుల అంచనాలను మించి హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అందరి మతి పోగొట్టేలా చేసారు మెగా ఫాన్స్..హైదరాబాద్ లో నిన్న ఈరోజు ఈ సినిమాకి సంబంధించి వేసిన ప్రతి షో హౌస్ ఫుల్ అయ్యింది..ప్రసాద్ మల్టీప్లెక్స్ లో నేరుగా థియేటర్ యజమాని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఘరానా మొగుడు రన్ అవుతుంది అని ట్వీట్ వెయ్యడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఆ తర్వాత వైజాగ్ , విజయవాడ , తిరుపతి , కడప మరియు అనంతపూర్ వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి..నేటి తరం యువకులు పెద్దగా ఆసక్తి చూపని సినిమానే అయ్యినప్పటికీ కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ రావడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి..మెగాస్టార్ క్రేజ్ కి ఇదొక్క నిదర్శనం..మొత్తం మీద ఈ సినిమా అన్ని షోస్ కి కలిపి దాదాపుగా 50 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..వాస్తవానికి మెగా ఫాన్స్ అనుకున్నట్టు ఇంద్ర సినిమా ప్రింట్ దొరికి ఉంటె ఆల్ టైం రికార్డు పెట్టేవారు..కానీ వైజయంతి మూవీస్ వారు సమయానికి ప్రింట్ అందచెయ్యలేకపోవడం తో ఘరానా మొగుడు సినిమాని ప్లాన్ చేసుకున్నారు అభిమానులు..ఇప్పటి వరుకు స్పెషల్ షోస్ ద్వారా అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా పోకిరి చిత్రం సరికొత్త చరిత్ర సృష్టించింది..ఈ సినిమాకి దాదాపుగా కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..మరి ఈ రికార్డు ని సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ ఫాన్స్ జల్సా స్పెషల్ షోస్ తో బద్దలు కొడుతారో లేదో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…