Home Entertainment 20 రోజులకు ముందే 100 షోలు..పోకిరి రికార్డు ని చిత్తూ చేసిన జల్సా

20 రోజులకు ముందే 100 షోలు..పోకిరి రికార్డు ని చిత్తూ చేసిన జల్సా

0 second read
0
0
1,005

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆయనకీ సంబంధించిన ఏ చిన్న విషయాన్ని అయినా ఒక పండగ లాగ చేస్తుంటారు అభిమానులు..సెప్టెంబర్ 2 వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అనే విషయం అందరికి తెలిసిందే..ఆరోజు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా జల్సా సినిమా స్పెషల్ షోస్ ని ఘనంగా ప్లాన్ చేస్తున్నారు..2007 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక ప్రభంజనం సృష్టించింది..ఓపెనింగ్స్ లో జల్సా సినిమా ఒక విస్ఫోటనం అనే చెప్పాలి..ఆరోజుల్లో జల్సా సినిమా టికెట్స్ క్యూలు కిలోమీటర్స్ ఉండేవి..వారం , రెండు వారాలకుగాను హౌస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగిపోయేవి..పడవ తరగతి పరీక్షలు జరుగుతున్నా సమయం లో ఈ సినిమా విడుదల అయ్యింది..పరీక్షలు అయిపోగానే పిల్లలందరూ జల్సా సినిమా థియేటర్స్ కి పరుగులు తీసేవారు..అప్పట్లో ఈ సినిమాకి ఉన్న క్రేజ్ అలాంటిది.

అయితే మితిమీరిన అంచనాల వల్ల ఈ సినిమాకి మొదట్లో నెగటివ్ టాక్ బాగా వచ్చింది..ఆ టాక్ మీదనే ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 2 మూవీ గా నిలిచింది..కానీ టాక్ పెద్దగా లేకపోవడం తో ఈ సినిమా పోకిరి రికార్డ్స్ కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలవలేకపోయింది..అయితే ఈ సినిమా టీవీ లో ప్రసారం చేసిన తర్వాత చాలా మంది కనెక్ట్ అయ్యారు..థియేటర్స్ లో కంటే టీవీ లో చాలా పెద్ద హిట్..నేటి తరం ప్రేక్షకులు అయితే ఈ సినిమాని థియేటర్స్ లో చూడలేకపోయినందుకు ఇప్పటికి ఫీల్ అవుతూ ఉంటారు..అలాంటి ప్రేక్షకులు మరియు అభిమానులు ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు ఈ సినిమా స్పెషల్ షోస్ సుమారు 500 కి పైగా ఉంటుందని అంచనా..అదే కనుక జరిగితే ఇండియాలోనే ఆల్ టైం రికార్డు సృష్టించిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది ఈ చిత్రం.

ఆగష్టు 9 వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పోకిరి సినిమా స్పెషల్ షోస్ వేసిన సంగతి మన అందరికి తెలిసిందే..సుమారు 375 షోలు ఆరోజు మహేష్ బాబు ఫాన్స్ ఏర్పాటు చేసుకున్నారు..ఈ 375 షోలు కూడా హౌస్ ఫుల్ అయ్యాయి..ఇప్పుడు ఆ రికార్డు ని పవన్ కళ్యాణ్ ఫాన్స్ బ్రేక్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు..ఈ సినిమా నెగేటివ్స్ ని బయటకి తీసి దానిని 4K కి మార్చి నిన్ననే క్యూబ్ లో అప్లోడ్ చేసారు..జల్సా సినిమా థియేటర్స్ లో రీ రీలోడ్ అవ్వబోతుంది..అభిమానులు పండగ చేసుకోవడానికి సిద్ధం అవ్వండి అంటూ ఒక ట్వీట్ వేశారు..అంతే..సోషల్ మీడియా మొత్తం ఎదో సునామి వచ్చినట్టు ఊగిపోయింది..పుట్టిన రోజు కి ఇంకా 20 రోజుల సమయం ఉన్నా కూడా థియేటర్స్ ని ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల బుకింగ్స్ చేసుకోవడం ప్రారంభించేసారు అభిమానులు..ఇప్పటికే 30 థియేటర్స్ కి పైగా బుక్ చేసుకున్నారు అభిమానులు..ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే కనివిని ఎరుగని రేంజ్ లో షోస్ ప్లాన్ చేస్తున్నారు..పోకిరి సినిమా స్పెషల్ షోస్ నుండి దాదాపుగా ఒక కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఇప్పుడు జల్సా సినిమా ఆ రికార్డు ని లేపుతుందో లేదో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…