Home Entertainment 2 కోట్ల రూపాయలకు కొన్నారు..మొదటి రోజు వచ్చిన వసూలు చూస్తే సుధీర్ క్రేజ్ కి దండం పెడుతారు

2 కోట్ల రూపాయలకు కొన్నారు..మొదటి రోజు వచ్చిన వసూలు చూస్తే సుధీర్ క్రేజ్ కి దండం పెడుతారు

0 second read
0
0
516

బుల్లితెర మీద ఎంటర్టైన్మెంట్ షోస్ తో యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కమెడియన్ సుడిగాలి సుధీర్..ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ప్రారంభమైన సుడిగాలి సుధీర్ కెరీర్..సుధీర్ లేకుపోతే షో లేదు అనే రేంజ్ కి ఎదిగిపోయాడు..ఈటీవీ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ అన్నిటికి సుధీర్ ఉండాలిసిందే..ఇక ఈయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆల్ రౌండర్ గా అద్భుతమైన టాలెంట్ ని కనబరిచే సుధీర్ అంటే పది సచ్చిపొయ్యేవాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటుంది..ఆ రేంజ్ క్రేజ్ ని సంపాదించుకున్న సుధీర్ హవా గత కొద్దీ రోజులుగా బుల్లితెర మీద బాగా తగ్గిపోయింది..దానికి కారణం ఆయనకీ వరుసగా సినిమాలలో హీరో అవకాశాలు రావడమే..ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన హీరో గా నటించిన గాలోడు మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..పెద్దగా చెప్పుకోదగిన సినిమాలేమి లేకపోవడం తో గాలోడు మూవీ కి థియేటర్స్ బాగానే దొరికాయి.

ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు యావరేజి టాక్ ని సొంతం చేసుకుంది..కథ మరియు కథనం రొటీన్ గా అనిపించినా కూడా సుధీర్ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో టైం పాస్ అయ్యే కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని మలిచాడనే టాక్ వచ్చింది..ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపుగా రెండు కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది..టీజర్ మరియు ట్రైలర్ నాసిరకంగా ఉండేలోపు ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఏమి వస్తాయిలే అని అనుకున్నారు ట్రేడ్ పండితులు..కానీ మొదటి ఆట నుండి ఈ సినిమాకి వచ్చిన ఆక్యుపెన్సీలు చూసి ట్రేడ్ పండితుల మైండ్ బ్లాక్ అయ్యింది..ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో మార్నింగ్ షోస్ నుండే దుమ్ము లేపే ఓపెనింగ్ ని దక్కించుకుంది ఈ చిత్రం..మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాకి వచ్చిన రేంజ్ ఓపెనింగ్స్ ఇటీవల విడుదలైన అక్కినేని మరియు మంచు కుటుంబ హీరోలకు కూడా రాలేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఉత్తాంధ్ర ప్రాంతం లో ఈ సినిమాకి మొదటి రోజు దాదాపుగా 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..ఇది నిజంగా ఎవ్వరు ఊహించలేకపోయారు..సీడెడ్ , గుంటూరు , కృష్ణ మరియు నైజం ప్రాంతాలలో కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మొదటి రోజు షేర్ కోటి రూపాయిలు వచ్చినట్టు సమాచారం..టాక్ లేకుండా ఈ స్థాయి వసూళ్లు అంటే అది సుడిగాలి సుధీర్ క్రేజ్ కి నిదర్శనం లాంటిది అని చెప్పొచ్చు..బుల్లితెర ఆర్టిస్టుల క్రేజ్ బుల్లితెర కి మాత్రమే పరిమితం, వెండితెర కి పనికిరారు అని మాట్లాడే వాళ్ళ నోర్లను మూయించాడు సుడిగాలి సుధీర్..ఆయన క్రేజ్ కి తగట్టుగా మంచి స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటే కచ్చితంగా 20 కోట్ల రూపాయిల మార్కెట్ కి చేరుకునే రేంజ్ కి ఎదుగుతాడని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన హార్డ్ వర్క్ ని నమ్ముకొని ఇండస్ట్రీ కి వచ్చిన సుధీర్ కి తగిన ఫలితం దొరికినందుకు ఆయన ఫాన్స్ సంతోషపడుతున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…