Home Entertainment 2 కోట్లు పెట్టి కొన్నారు..వచ్చిన వసూళ్లు ఎంతో తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి

2 కోట్లు పెట్టి కొన్నారు..వచ్చిన వసూళ్లు ఎంతో తెలిస్తే మీ ఫ్యూజులు ఎగిరిపోతాయి

0 second read
0
0
2,293

ఇటీవల కాలం లో విడుదల అవుతున్న సినిమాలలో తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి వందల కోట్ల రూపాయిలు వసూలు చేసిన సినిమాలు ఎక్కువ అయిపోయాయి..రీసెంట్ ఉదాహరణ కాంతారా చిత్రం..కేవలం 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం 400 కోట్ల రూపాయిలు వసూలు చేసింది..ఓపెనింగ్స్ కూడా కేవలం రెండు కోట్లు మాత్రమే ఈ సినిమాకి వచ్చాయి..రెండు కోట్ల రూపాయలతో ప్రారంభమైన వసూళ్లు 400 కోట్ల రూపాయలకు చేరుకుంది అంటే అది సాధారణమైన విషయం కాదు..ఒక చరిత్ర అని చెప్పాలి..అలాంటి చరిత్రలు అరుదుగా జరుగుతుంటాయని ట్రేడ్ పండితులు చెప్తూ ఉంటారు..కానీ అలాంటి చరిత్ర రెండు నెలలు కూడా పూర్తి అవ్వకుండానే మరో చిన్న సినిమాకి జరిగింది..అదే లవ్ టుడే..తమిళం లో అతి చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం విడుదలై నేటికీ 25 రోజులు పూర్తి అయ్యాయి..ఈ 25 రోజులకు గాను ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.

తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహిస్తూ హీరో గా నటించిన సినిమా ఇది..కేవలం 5 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తీశారు..తమిళ వెర్సన్ నుండి ఇప్పటి వరుకు ఈ సినిమాకి 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇప్పటికి కూడా ఈ సినిమా స్టడీ కలెక్షన్స్ తో ముందుకి దూసుకుపోతుంది..కేవలం తమిళ్ వెర్షన్ నుండే ఈ సినిమాకి ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్న మాట..ఇక తెలుగు లో కూడా ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు..ఈ సినిమాని తొలుత రీమేక్ చేద్దామని రైట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టారు..కానీ ఆ చిత్ర నిర్మాతలు అందుకు ఒప్పుకోలేదు..దాంతో ఈ చిత్రాన్ని తెలుగు లో డబ్ చేసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ లెవెల్ లో రిలీజ్ చేసాడు..కేవలం రెండు కోట్ల రూపాయలకు డబ్బింగ్ రైట్స్ ని కొనుక్కున్న దిల్ రాజు మొదటి రోజే కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.

అలా మొదటి రోజు నుండి నేటి వరుకు ఈ సినిమాకి వీక్ డేస్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి..ఇప్పటి వరుకు తెలుగు లో పది కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రానికి 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి..ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి..ఊరు పేరు తెలియని ఒక హీరో సినిమాకి ఈ స్థాయి వసూళ్లు ఇస్తున్నారంటే నిజంగా తెలుగు ప్రేక్షకులు దేవుళ్ళు అనే చెప్పాలి..లవ్ స్టోరీస్ బాగా రొటీన్ అయిపోతున్న ఈ రోజుల్లో, ఒక సరికొత్త కోణాన్ని ఎంచుకొని దర్శకుడు ప్రదీప్ ఈ చిత్రాన్ని మలచిన తీరు అద్భుతం..ఇలాంటి ప్రతిభ ఉన్న దర్శకులు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఉండడం నిజంగా అదృష్టం అనే చెప్పాలి..రాబొయ్యే రోజుల్లో ఇతను పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద డైరెక్టర్ ఎదుగుతాడని ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…