యంగ్ హీరో నిఖిల్ నటించిన ’18 పేజెస్ ‘ అనే చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు పాపం..’కార్తికేయ 2 ‘ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇదే ఏడాది లో విడుదలైన హీరో నిఖిల్ సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడం శోచనీయం..అందుకే విడుదలకు ముందు ప్రేక్షకులను ఆకర్షించే విధంగా పాటలు, టీజర్ మరియు ట్రైలర్ ఉండాలని ట్రేడ్ పండితులు అంటూ ఉంటారు..ఈ రోజుల్లో అలాంటివి సరిగ్గా లేకపోతే ఇలాంటి ఓపెనింగ్స్ వస్తాయి అనడానికి నిదర్శనం గా నిలిచింది ఈ చిత్రం..కేవలం నిఖిల్ పేరు మీద ఈ చిత్రానికి సిటీస్ లో కాస్త డీసెంట్ ఆక్యుపెన్సీస్ వచ్చాయి కానీ మాస్ సెంటర్స్ లో మాత్రం మొదటి ఆట నుండే వాష్ అవుట్ అయిపోయింది..మరో బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా పబ్లిక్ టాక్ ఏంటో ఎవరికీ తెలియని పరిస్థితి..ఎందుకంటే ఎవరు చూడలేదు కాబట్టి.

ఇక ఆంధ్ర ప్రదేశ్ ఓపెనింగ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది..నైజం ప్రాంతం లో కనీసం కొన్ని A సెంటర్స్ లో అయినా ఓపెనింగ్స్ ని రాబట్టింది..కానీ ఆంధ్ర ప్రాంతం లో మాత్రం 50 శాతం ఆక్యుపెన్సీ ని కూడా రాబట్టలేకపోయింది ఈ సినిమా..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ చిత్రం కేవలం కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అని అంచనా వేస్తున్నారు..ఇక ఓవర్సీస్ లో మాత్రం కాస్త పర్వాలేదు అనే రేంజ్ ఓపెనింగ్ ని దక్కించుకుంది..అక్కడ ఈ చిత్రం ప్రీమియర్స్ మరియు మొదటి రోజు కలిపి లక్ష డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు..ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 22 కోట్ల రూపాయలకు జరిగింది..ఇదే విధమైన వసూళ్లు వస్తే మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి చాలా కష్టం అయిపోతుంది.