
ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద విస్ఫోటనం లాగ పేలిన చిత్రం ‘కార్తికేయ 2′..కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ లో కూడా ఈ చిత్రం దుమ్ము దులిపేసింది..మొత్తం మీద అన్నీ భాషలకు కలుపుకొని సుమారుగా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది ఈ చిత్రం..అంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నిఖిల్ హీరో గా నటించిన చిత్రం ’18 పేజెస్’..అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ సమర్పణ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించాడు..ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథ సమకూర్చగా, ఆయన శిష్యులలో ఒకరు సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు..ఇక నిఖిల్ తో కలిసి కార్తికేయ 2 లో నటించిన అనుపమ పరమేశ్వరన్ నే ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు..టీజర్ మరియు ట్రైలర్ తో కొత్త రకమైన సినిమాని చూడబోతున్నాము అనే అనుభూతిని కలిగించిన ఈ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..మరి ఈ చిత్రం అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా చూడబోతున్నాము.
కథ :
నందిని(అనుపమ పరమేశ్వరన్ ) ఇంటర్నెట్ ప్రపంచం లోకి అడుగుపెట్టకుండా అసలు ఫోన్ ని ఉపయోగించని అమ్మాయి..అలాంటి అమ్మాయి జీవితం లోకి వస్తాడు సిద్దార్థ్ (నిఖిల్)..ఆమెతో ప్రేమలో పడుతాడు..నందిని కూడా అతనితో ప్రేమలో పడుతుంది..అలా వాళ్ళిద్దరి లైఫ్ కొనసాగుతుండగా నందిని కి మెమరీ లాస్ ఉండనే విషయం సిద్దార్థ్ కి తెలుస్తుంది..ఈ విషయం నందిని కి కూడా తెలుసు..అందుకే ప్రతీ రోజు ఆమె తన జీవితం లో చోటు చేసుకునే సంఘటనలు ఒక డైరీ లో రాసుకుంటూ ఉంటుంది..దానిని సిద్దార్థ్ చూస్తాడు..ఆ డైరీ లో 18 వ పేజీ లో నందినీ జీవితం లో చోటు చేసుకున్న ఒక దురదృష్ట సంఘటన ఉంటుంది..ఇంతకీ ఏమిటి ఆ సంఘటన..ఆ సంఘటన వల్ల ఎదురైనా పరిణామాలు ఏమిటి..? సిద్దార్థ్ ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడు అనేది మిగిలిన స్టోరీ..ఆద్యంతం ఉత్కంఠతో ఈ సినిమా కథ సాగిపోతూ ఉంటుంది.
విశ్లేషణ :
సుకుమార్ రచనలో వచ్చిన సినిమా అంటే కచ్చితంగా సినిమాలో కొత్తదనం ఉంటుంది అనే ప్రతీ ఒక్కరు ఆశిస్తారు..సరిగ్గా ఈ సినిమా కూడా వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే కొత్తదనం తో నిండిపోయి ఉంటుంది..ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్ తో గడిచిపోగా..ఇంటర్వెల్ నుండి అసలు సిసలు ట్విస్టు తో సెకండ్ హాఫ్ కి ఆడియన్స్ ని ప్రిపేర్ చేస్తాడు డైరెక్టర్ సూర్య ప్రతాప్..ఊహిచినట్టుగానే సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను కంటి చూపు పక్కకి కూడా తిప్పుకొని విధంగా ఉంటుంది..క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..ఇక సినిమాలో అనుపమ పరమేశ్వరన్ అద్భుతంగా నటించింది..నిఖిల్ కూడా కుమ్మేసాడు..కానీ ఇలాంటి సినిమాలకు సంగీతం సరిగ్గా కుదిరితే వేరే లెవెల్ కి వెళ్తుంది..ఇక్కడ అదే మిస్ అయ్యింది..గోపి సుందర్ అందించిన సంగీతం పెద్దగా ఎవరికీ నచ్చలేదు..బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపించింది..చివరి మాటగా చెప్పేది ఏమిటంటే ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అవ్వద్దు..కొత్తరకం సబ్జక్ట్స్ ని కోరుకునే ఆడియన్స్ కి ఈ సినిమా ఈ వీకెండ్ కి బెస్ట్ ఛాయస్.