
ప్రపంచవ్యాప్తంగా సుమారు 186 కి పైగా బాషలలో అవతార్ 2 చిత్రం ఇటీవలే ఘనంగా విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే..2009 వ సంవత్సరం లో విడుదలైన అవతార్ చిత్రానికి సీక్వెల్ గా సుమారు 12 ఏళ్ళ పాటు ఈ సినిమాని జేమ్స్ కెమరూన్ తెరకెక్కించాడు..12 ఏళ్ళ క్రితం విడుదలైన సినిమా మూడు బిలియన్ డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ లో 24 వేల కోట్ల రూపాయిలు వసూలు చేస్తే, ఇక అవతార్ 2 ఎంత వసూలు చెయ్యాలి..? ఎలాంటి అద్భుతాలు సృష్టించాలి..? అని ప్రేక్షకుల దగ్గర నుండి ట్రేడ్ వర్గాల వరుకు కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు..కానీ ఆ అంచనాలకు తగ్గ ఓపెనింగ్స్ అయితే అసలు రాలేదు..ముఖ్యంగా 2019 లో విడుదలైన ఏవంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం వసూళ్లకు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది ఈ సినిమా..కానీ వీక్ డేస్ లో మాత్రం స్టడీ హోల్డ్ ని చూపించింది ఈ చిత్రం.
ఈ సినిమాకి దర్శకత్వం వహించడం మాత్రమే కాదు..జేమ్స్ కెమరూన్ నిర్మాతగా కూడా వ్యవహరించాడు..సుమారు 2 బిలియన్ డాలర్ల బడ్జెట్ ఈ సినిమా కోసం పెట్టాడు..బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా చాలా రోజులు పట్టేట్టు ఉంది..ఇప్పటి వరుకు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 530 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి..ఇండియా లో వారం రోజులకు కలిపి ఈ చిత్రానికి 250 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు 190 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి..ఇంకా క్రిస్మస్ వీకెండ్ ఉన్నందున ఆరోజు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల వండర్స్ సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు..కేవలం ఆ ఒక్క రోజే 150 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది..తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రానికి ఇప్పటికీ వరుకు 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇక్కడ మొదటి రోజు నుండి అద్భుతమైన వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ చిత్రం.
కానీ తెలుగులో బ్రేక్ ఈవెన్ టార్గెట్ చాలా పెద్దది..సుమారు వంద కోట్ల రూపాయలకు పైగా ఈ సినిమా వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది..అది కూడా గ్రాస్ వసూళ్లు కాదు, షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది..కానీ ఇదే ట్రెండ్ మరో నాలుగు వారాలు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది..కానీ ఓటీటీ రాజ్యం లో అంత దూరం వస్తుందా లేదా అనేదే డౌట్..జేమ్స్ కెమరూన్ సినిమాలకు ఓపెనింగ్స్ కంటే లాంగ్ రన్ ఎక్కువ ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు..వీక్ డేస్ లో హోల్డ్ చూస్తూ ఉంటే అది నిజమే అనిపిస్తుంది..ఒక వేల ఈ సినిమా తెలుగులో వంద కోట్ల రూపాయిల షేర్ ని రాబడితే మాత్రం అది ఒక్క అద్భుతం అనే చెప్పొచ్చు..చూడాలి మరి జేమ్స్ కెమరూన్ మరోసారి మేజిక్ చేస్తాడా లేదా అనేది..ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 వేల కోట్ల రూపాయిలు ఉండగా, ఇప్పటి వరుకు ఈ చిత్ర 5 వేల కోట్లు వసూలు చేసింది.