
కోట్ల రూపాయిల బడ్జెట్ తో సినిమాలను నిర్మించాల్సిన అవసరం లేదు, భారీ తారాగణం ఉండాల్సిన అవసరం అసలుకే లేదు.మంచి కంటెంట్ ని ఇవ్వండి, నెత్తిన పెట్టుకుంటామని ప్రేక్షకులు అంటున్నారు.కానీ నాలుగు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తే, పది అట్టర్ ఫ్లాప్ సినిమాలు వస్తున్నాయి.రీసెంట్ గానే కన్నడ చలన చిత్ర పరిశ్రమ నుండి KGF సిరీస్ మరియు కాంతారా వంటి బాక్స్ ఆఫీస్ ప్రభంజనాలు వచ్చాయి.ఈ రెండు సినిమాలకు పెద్ద ఖర్చు పెట్టింది లేదు, తక్కువ బడ్జెట్ తోనే తీసేసారు,కానీ కంటెంట్ పవర్ అమోఘం, అందుకే అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.నేడు KGF చాప్టర్ 2 సినిమా ఇండియా లోనే టాప్ 3 మూవీస్ లో ఒకటి.అలా వరుస హిట్స్ తో మంచి ఊపు మీదున్న కన్నడ సినీ పరిశ్రమ నుండి వచ్చిన మరో ప్రెస్టీజియస్ మూవీ ‘కబ్జా’.
ఉపేంద్ర , సుదీప్ మరియు శివ రాజ్ కుమార్ ఇలా భారీ తారాగణం తో తెరకెక్కిన ఈ సినిమాని సుమారుగా 120 కోట్ల రూపాయిలు ఖర్చు చేసి తీశారు.KGF చిత్రాన్ని ఎంత దరిద్రంగా రీమేక్ చెయ్యాలో, అంత దరిద్రం గా ఈ సినిమాని రీమేక్ చేసారు.హంగులు ఆర్భాటాలు మొత్తం దరిద్రమైన టేకింగ్ కారణంగా , సినిమా మధ్యలోనే లేచి వెళ్ళిపొయ్యే ఫీలింగ్ సగటు ప్రేక్షకుడికి కలుగుతుంది.120 కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టి తీస్తే మొదటి రోజు కనీసం 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అయినా రావాలి, కానీ ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి వచ్చింది ఎంతో తెలుసా..కేవలం 13 కోట్ల రూపాయిలు.ఈ మాత్రం ఓపెనింగ్ రావడానికి సత్తా లేని కంటెంట్ కి 120 కోట్లు ఖర్చు చెయ్యడం ఎందుకు.పోనీ రెండవ రోజు నుండైనా పుంజుకుందా అంటే అదీ లేదు.మొదటి రోజు వచ్చిన వసూళ్ళలో సగం రాబట్టింది రెండవ రోజు.
అందుతున్న ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండవ రోజు కేవలం 6 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చాయట.అలా రెండు రోజులకు కలిపి 20 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో 50 కోట్ల రూపాయిలను అయినా రాబడుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.మొదటి రెండు రోజుల్లో రావాల్సిన వసూళ్లు ఫుల్ రన్ లో కూడా డౌట్ అని అంటున్నారంటే ఈ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు.ఇకనైనా హంగులు , ఆర్భాటాలకు పోకుండా కంటెంట్ మీద శ్రద్ద పెట్టండి రా బాబు అని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.