Home Entertainment 100 కోట్లు పెట్టి కొన్నారు..4 రోజుల్లో వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే మెంటలెక్కిపోతారు

100 కోట్లు పెట్టి కొన్నారు..4 రోజుల్లో వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే మెంటలెక్కిపోతారు

0 second read
0
1
4,020

ఖైదీ నెంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద మరో సారి తన పూర్తి స్థాయి స్టార్ స్టేటస్ కి తగ్గ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది రీసెంట్ గా విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తోనే..బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ప్రస్తుతం సృష్టిస్తున్న వసూళ్ల సునామి గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది..గత రెండు సినిమాల ఫలితాలు చూసి మెగాస్టార్ స్టార్ స్టేటస్ ని తక్కువ చేసి మాట్లాడిన ప్రతీ ఒక్కరిని పరుగులు తీయించి మరీ కొట్టాడు ఈ సినిమాతో..మొదటి రోజు నుండి నేటి వరకు ఈ సినిమా టికెట్స్ కోసం ప్రేక్షకులు యుద్ధాలే చేస్తున్నారు..ఓటీటీ రాజ్యం ఏలుతున్న ఈ రోజుల్లో ఒక సినిమా కోసం థియేటర్స్ లో ప్రేక్షకులు ఇంతలా కొట్టుకోవడం చూసి చాలా కాలమే అయ్యింది..అది కూడా మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి సినిమాతోనే ఆ అరుదైన దృశ్యం చూడడం అభిమానులకు మామూలు కిక్ ని ఇవ్వలేదు.

ఇక ఈ సినిమా మూడు రోజుల వసూళ్లు ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది..మొదటి రోజు 30 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం మూడు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..రెండు వరుస ఫ్లాప్స్ తర్వాత కూడా ఈ రేంజ్ వసూళ్లు అంటే మెగాస్టార్ స్టార్ స్టేటస్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు అనే విషయం అర్థం అవుతుంది..ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు నేటి తరం స్టార్ హీరోలకు కూడా రావడం లేదనే చెప్పాలి..మొదటి రోజు ప్రీమియర్స్ తో కలిపి 1 మిలియన్ డాలర్స్ ని వసూలు చేసిన ఈ చిత్రం, ఇప్పుడు మూడు రోజుల్లోనే 17 లక్షల డాలర్స్ ని వసూలు చెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది..ఈ సినిమా ఊపు చూస్తూ ఉంటే అమెరికా లో ఫుల్ రన్ 3 మిలియన్ కి రీచ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

ఇక నాల్గవ రోజు అంటే కనుమ రోజు కూడా ‘వాల్తేరు వీరయ్య’ జోరు మామూలు రేంజ్ లో లేదు..ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కనీవినీ ఎరుగని నంబర్స్ ని పెడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి..నాల్గవ రోజు కూడా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడుతుందని చెప్తున్నారు ట్రేడ్ పండితులు..ఇదే జోరు రాబొయ్యే రోజుల్లో కూడా చూపిస్తే కచ్చితంగా ఈ చిత్రం ఆల్ టైం నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని చెప్తున్నారు..చూడాలి మరి ఆ రేంజ్ కి ఈ సినిమా వెళ్తుందో లేదా అనేది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…