Home Entertainment 10 రోజుల కలెక్షన్స్ లో ఎవరిదీ పై చెయ్యి??..KGF ఎంత వసూలు చేసిందో తెలుసా!

10 రోజుల కలెక్షన్స్ లో ఎవరిదీ పై చెయ్యి??..KGF ఎంత వసూలు చేసిందో తెలుసా!

8 second read
0
0
2,409

ఇండియన్ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర KGF చాప్టర్ 2 సృష్టించిన ఓపెనింగ్స్ ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..కన్నడ చలన చిత్ర పరిశ్రమ మొత్తం గర్వం తో తలెత్తుకునేలా చేసింది ఈ సినిమా..ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఈ మూవీ వసూళ్ల ప్రభంజనం ఇంకా ఆగలేదు…వీక్ డేస్ లో కూడా డబల్ డిజిట్ నంబర్స్ వసూలు చేస్తూ బాలీవుడ్ లో కొత్త బెంచ్ మార్క్స్ ని సృష్టిస్తుంది ఈ చిత్రం..ఫుల్ రన్ లో కేవలం బాలీవుడ్ నుండే 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసే అవకాశం ఉంది అని బాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనా..వందేళ్ల బాలీవుడ్ సినీ పరిశ్రమ హిస్టరీ లో హిందీ లో దుబ్ అయినా తెలుగు సినిమాలు ప్రభంజనం సృష్టించడం చూసాం..తమిళ్ సినిమాలు ప్రభంజనం సృష్టించడం చూసాం..కానీ ఒక్క కన్నడ సినిమా బాలీవుడ్ సినిమాని శాసించే స్థాయి లో రికార్డ్స్ ని నెలకొల్పడం ఇదే తొలిసారి చూస్తున్నాం..విడుదల అయ్యి పది రోజూ గడుస్తున్నా ఈ సినిమా ఇప్పటి వరుకు ఎంత వసూలు చేసింది.. 10 రోజుల్లో KGF సాదిసీమ్హిన వసూళ్లు ఎంత..?? #RRR మరియు బాహుబలి 2 సాధించిన వసూళ్లు ఎంత…ఈ రెండు సినిమాలలో ఒక్క సినిమాని అయినా KGF దాటిందా?? ఈ అంశాలు అన్నీ ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

బాహుబలి పార్ట్ 2 సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఒక్క చరిత్ర అని చెప్పొచ్చు..ఈ సినిమా కేవలం పది రోజుల వ్యవధి లోనే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకొని సరికొత్త ప్రభంజనం సృష్టించింది..ఈ వసూళ్లను మళ్ళీ రాజమౌళి సినిమా కూడా బ్రేక్ చెయ్యలేకపోయింది..ఆయన లేటెస్ట్ మూవీ #RRR పది రోజులకు గాను 860 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..బాహుబలి రికార్డు ని టచ్ చెయ్యలేకపొయ్యినప్పటికీ #RRR కూడా అద్భుతమైన వసూళ్లనే సాధించింది..ఇక KGF చాప్టర్ 2 కి వచ్చిన ఓపెనింగ్స్ వసూళ్లు చూసి కచ్చితంగా ఈ సినిమా బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొడుతోంది అని అనుకున్నారు..కానీ 10 రోజులు పూర్తి అయ్యేసరికి బాహుబలి 2 కి కాదు కదా..కనీసం #RRR ని కూడా ముట్టుకోలేకపోయింది ఈ సినిమా..పై రోజులకు గాను ఈ సినిమా 820 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది..బాలీవుడ్ , శాండిల్ వుడ్ మరియు కోలీవుడ్ లలో ఈ సినిమా ఇప్పటికి మంచి వసూళ్లను రాబడుతున్నప్పటికీ మన టాలీవుడ్ లో మాత్రం వీక్ డేస్ లో బాగా డౌన్ అయిపోయింది.

మొదటి రోజు ఇక్కడ స్టార్ హీరో రేంజ్ ఓపెనింగ్ ని సొంతం చేసుకున్న KGF చాప్టర్ 2 , అదే ఊపు ని వీకెండ్ వరుకు కొనసాగించి కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 55 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంది..కానీ ఆ తర్వాత నుండి వీక్ డేస్ డౌన్ అవుతూ వచ్చి రెండవ వీకెండ్ లో కూడా పూర్ అడ్వాన్స్ బుకింగ్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం..టాక్ అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ సినిమా కలెక్షన్లు ఈ స్థాయి లో డౌన్ అవ్వడానికి కారణం ఫామిలీ ఆడియన్స్ సపోర్ట్ లేకపోవడమే..కరోనా కాలం తర్వాత మన తెలుగు ఆడియన్స్ సినిమా థియేటర్ కి వచ్చి చూడాలి అంటే చాలా కష్టం అయ్యిపోయింది..యూత్ ఆడియన్స్ ఇప్పటికి థియేటర్స్ లోనే ఎగబడి చూస్తుండగా..ఫామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చే చూడడం బాగా తగ్గిపోయింది..వాళ్ళు థియేటర్స్ కి రావాలి అంటే ఎమోషన్స్ తో కూడిన తో వచ్చే సినిమాలు, లేదా అద్భుతమైన గ్రాఫిక్స్ తో కూడిన సినిమాలు రావాలి..అప్పుడే వాళ్ళు థియేటర్స్ కి వచ్చి చూస్తారు..లేకపోతే OTT లో వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అనే ఫీలింగ్ లో ఉండిపోతారు..KGF కి జరిగింది అదే..కానీ #RRR మాత్రం ఏ ప్రతికూల పరిస్థితులను అన్నీ ఎదుర్కొని ఇప్పటికి థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…