
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆయనకీ సంబంధించి ఏ చిన్న పాజిటివ్ న్యూస్ ని అయినా అభిమానులు ఒక రేంజ్ లో సంబరాలు చేసుకుంటారు..వచ్చే నెల 2వ తారీఖున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు అనే విషయం మన అందరికి తెలిసిందే..ప్రతి ఏడాది ఆయన పుట్టిన రోజు వేడుకలను కనివిని ఎరుగని రీతిలో జరుపుతూ ఉంటారు అభిమానులు..రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎదో ఉత్సవం నడుస్తుంది అనే రేంజ్ ని తలపిస్తారు..ఈసారి ఆయన పుట్టిన రోజు వేడుకలు చరిత్ర లో చిరస్థాయిగా గుర్తుండిపోయ్యే రేంజ్ లో ప్లాన్ చెయ్యబోతున్నారు ఫాన్స్..పవన్ కళ్యాణ్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా జల్సా సినిమాని సెప్టెంబర్ 2 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో స్పెషల్ షోస్ వెయ్యబోతున్నట్టు సమాచారం..ఈ షోస్ సంఖ్య 500 కి పైగా ఉంటుందని అంచనా..మహేష్ బాబు పుట్టిన రోజు నాడు పోకిరి స్పెషల్ షోస్ ప్రపంచవ్యాప్తంగా 300 కి పైగా వేశారు..ఇప్పుడు ఆ రికార్డుని బద్దలు కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు ఫాన్స్.
అతి త్వరలోనే ఈ సినిమా ప్రాంతాల వారీగా డిస్ట్రిబ్యూటర్స్ వివరాలు బయటకి రాబోతున్నాయి..డిస్ట్రిబ్యూటర్స్ వివరాలు రాగానే ఈ సినిమా స్పెషల్ షోస్ ఏర్పాట్లు చకచకా ప్రారంభం అయిపోతాయి..ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆస్ట్రేలియా లో ఓపెన్ చేసారు..మెల్బోర్న్ లో ఈ V మాక్స్ అనే భారీ సీటింగ్ కెపాసిటీ ఉన్న థియేటర్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు..టికెట్ రేట్స్ అయితే ఏకంగా 28 డాలర్స్ ఉన్నాయి..ఈ రేంజ్ రేట్స్ కేవలం కొత్త సినిమాలకు మాత్రమే పెడుతూ ఉంటారు..కానీ జల్సా సినిమాకి ఆ రేంజ్ రేట్స్ పెట్టిన కూడా టిక్కెట్లు హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి..ఇప్పటికే ఈ సినిమా ఆ ఒక్క థియేటర్ నుండి 5000 ఆస్ట్రేలియన్ డాలర్లు వసూలు చేసింది..గతం లో సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమా ఆస్ట్రేలియా లో అన్ని షోస్ కి కలిపి కేవలం 3000 డాలర్లు మాత్రమే వసూలు చేసింది..కానీ జల్సా సినిమా స్పెషల్ షో కి 15 రోజుల ముందే పోకిరి రికార్డుని భారీ మార్జిన్ తో కొట్టడం ని చూస్తుంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో అర్థం అవుతుంది.
ఆస్ట్రేలియా లోనే పరిస్థితి ఇలా ఉంటె..ఇక ఇండియా లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు..పోకిరి సినిమా స్పెషల్ షోస్ కి ఓవర్సీస్ మొత్తం కలిపి 20 వేల డాలర్లు వచ్చాయి..కానీ జల్సా సినిమాకి కేవలం ఆస్ట్రేలియా నుండే 20 వేల డాలర్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..ఇదే కనుక జరిగితే పవర్ స్టార్ ఫాన్స్ ఆల్ టైం రికార్డు సృష్టించారని చెప్పొచ్చు..వాస్తవానికి జల్సా సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో కేవలం ఒక మంచి సూపర్ హిట్ సినిమా మాత్రమే..పోకిరి రేంజ్ లో కల్ట్ స్టేటస్ ఉన్న సినిమా అయితే కాదు..కానీ అలాంటి సినిమాకి ఈ రేంజ్ క్రేజ్ వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ కి ఫాలోయింగ్ వల్లే అని చెప్పొచ్చు..15 రోజుల ముందే ఇలాంటి రికార్డు ని సృష్టిస్తే ఇక స్పెషల్ షోస్ కి దగ్గరపడే కొద్దీ ఐకియా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు..పోకిరి స్పెషల్ షోస్ ద్వారా కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..కానీ జల్సా సినిమాకి ఉన్న ఊపుని చూస్తూనే ఈ గ్రాస్ మొత్తాన్ని కేవలం ఓవర్సీస్ ప్రాంతం నుండే వసూలు చేసేలా అనిపిస్తుంది..అదే కనుక జరిగితే టాలీవుడ్ లో ఆ రికార్డు ని ఇప్పట్లో ఎవ్వరు బ్రేక్ చెయ్యలేరు అనే చెప్పొచ్చు.