
కొంతమంది హీరోలు కేవలం ఒక్కే ఒక్క సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్స్ గా మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు,ఇలాంటి ప్రస్తావన వస్తే ముందుగా మనం శేఖర్ కమ్ముల హీరోల గురించి మాట్లాడుకోవాలి,ఈయన తన కెరీర్ లో ఎక్కువ శాతం కొత్త హీరోలతోనే సినిమాలు తీసి పెద్ద హిట్లు కొట్టాడు, ఈయన సినిమాలో హీరో గా మరియు హీరోయిన్లు గా చేసిన వాళ్ళు ఇప్పుడు టాలీవుడ్ లో తో మోస్ట్ స్థానం లో కొనసాగుతున్నారు, ముఖ్యంగా ఈయన తీసిన హ్యాపీ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి, ఈ సినిమాలో నటించిన వరుణ్ సందేశ్,నిఖిల్, తమన్నా, హరి దాస్ అందరికి అద్భుతమైన గుర్తింపు లభించింది, వరుణ్ సందేశ్ అప్పట్లో ఈ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ తో వరుసగా సినిమాలు చేసి హిట్లు కొట్టి యూత్ లో ప్రత్యేకమైన ఇమేజి ని సొంతం చేసుకున్నాడు, కానీ స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో అవగాహనా లోపం ఉండడం వల్ల ఆయన ఆ ఇమేజి ని కొనసాగించలేక ఎంత తొందరగా అయితే ఎదిగాడో, అంతే తొందరగా క్రిందకి పడిపోయాడు, ఇక ఈ సినిమా ద్వారానే సౌత్ లో నేడు టాప్ మోస్ట్ హీరోయిన్ గా చలామణి అవుతున్న తమ్మన్న లైం లైట్ లోకి వచ్చింది, ఇప్పుడు ఆమె ఎంత క్రేజ్ ఉన్న హీరోయిన్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక ఈ సినిమాలో రాజేష్ అనే పాత్ర ద్వారా యూత్ ని విశేషంగా ఆకట్టుకున్న నిఖిల్ కూడా ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కెరీర్ లో మంచి మంచి హిట్స్ కొడుతూ, యూత్ లో తనకంటూ ఒక్క ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని సంపాదించుకొని, టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోస్ లో ఒక్కడిగా మారాడు, ఇక మనం ఇప్పుడు ప్రత్యేకంగా మాటాడుకోవాల్సింది హ్యాపీ డేస్ సినిమా లో టైసన్ పాత్రలో నటించిన రాహుల్ హరిదాస్ గురించి,విచిత్రమైన మాట తీరుతో ,అమాయకం గా చేసిన టైసన్ పాత్రకి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది,ఈ సినిమా తర్వాత రాహుల్ హరి దాస్ మంచి స్థాయికి వెళ్తాడు అనే అందరూ అనుకున్నారు, అవకాశాలు కూడా బాగానే వచ్చాయి, కానీ టైసన్ పాత్ర ఛత్రం లో ఇర్రుక్కుని పోయిన రాహుల్ హరిదాస్ ఆ పాత్ర లో తప్ప మరో పాత్ర లో ప్రేక్షకులు ఊహించుకోలేక పొయ్యారు అనే చెప్పాలి,అందుకే హ్యాపీ డేస్ తర్వాత ఆయన నటించిన సినిమాలు ఎప్పుడు వచ్చాయో,ఎప్పుడు వెళ్ళాయో కూడా ఎవ్వరికి తెలియదు.
ఇక రాహుల్ హరిదాస్ 2017 వ సంవత్సరం లో ప్రతిష్టాత్మికంగా తీసుకొని నటించిన చిత్రం వెంకటాపురం, ఈ సినిమా పైన ఆయన భారీగానే ఆశలు పెట్టుకున్నాడు, కానీ అది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడం తో రాహుల్ హరిదాస్ ఆ తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు, ఎలా అయినా మంచి హిట్ కొట్టి ఇండస్ట్రీ లో స్థిరపడాలి అనే కసి తో ఆయన కొత్త సినిమా కోసం తన రూపు రేఖలే మార్చేసుకున్నాడు,సిక్స్ ప్యాక్ బాడీ తో ఇటీవల ఇతగాడు తన సోషల్ మీడియా లో పెట్టిన ఒక్క పోస్ట్ తెగ వైరల్ గా మారింది, ఈ ఫొటోని చూసిన ప్రతి ఒక్కరు మేము హ్యాపీ డేస్ లో చేపూసింది ఇతనినేనా అని ఆశ్చర్యపోయ్యేంతలా ఆయన మారిపోయాడు, ఇక అసలు విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం ఆయన హీరో గా 100 కోట్లు అనే సినిమా ని చేస్తున్నాడు, లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పైనే ఆయన కోటి ఆశలు పెట్టుకున్నాడు, మరి ఈ సినిమా తో అయినా ఆయన కెరీర్ లో విజయం అందుకుంటాడా లేదో చూడాలి.