
బుల్లితెర మీద దాదాపుగా పదేళ్ల నుండి విరామం లేకుండా ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో నుండి ఎంత మంది కమెడియన్స్ టాలీవుడ్ కి పరిచయం అయ్యి ఈరోజు టాప్ స్థానం లో కొనసాగుతున్నారో మన అందరికి తెలిసిందే..వారిలో ముఖ్యంగా మనం హైపర్ అది గురించి చెప్పుకోవాలి..సినిమాల మీద మక్కువ తో తానూ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం కూడా వదిలేసి అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగిన హైపర్..జబర్డస్త్ షో లో అదిరే అభి టీం లో చనున్న జూనియర్ ఆర్టిస్టు గా పరిచయం అయ్యి..తన కామెడీ టైమింగ్ తో అంచలంచలుగా ఎదుగుతూ టీం లీడర్ గా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ కమెడియన్స్ లో ఒక్కరిగా మారిపోయాడు..ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు హైపర్ ఆది లేనిదే జబర్దస్త్ షో లేదు..ఆయన మరియు సుడిగాలి సుధీర్ ఇద్దరు గత కొంత కాలం నుండి జబర్దస్త్ షో లో కనిపించక పోవడం తో ఆ షో TRP రేటింగ్స్ ఇప్పుడు అతి దారుణంగా పడిపోయాయి అంటే వీళ్ళకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
సుడిగాలి సుధీర్ ప్రస్తుతం ఈటీవీ లో ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం లో కూడా కనిపించడం లేదు..ఢీ మరియు జబర్దస్త్ షోస్ ని మానేసిన సుడిగాలి సుధీర్, ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షో మాత్రం చేస్తూ ఉండేవాడు..ఇప్పుడు ఆ షో కూడా మానేసాడు..ఇప్పుడు ఆయన స్థానం లోకి యాంకర్ రష్మీ వచ్చింది..దీనితో ఈటీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ అన్ని హైపర్ ఆది మీదనే భారం వేసాయి..ఇది ఇలా ఉండగా హైపర్ ఆది ఢీ షో లో కూడా టీం లీడర్ గా కొనసాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ షో కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..ఈ ప్రోమో లో హైపర్ ఆది మరియు రవి కాలేజీ స్కిట్ వేస్తారు..ఇందులో స్టూడెంట్స్ గా వీరితో పాటు నవ్య సామి కూడా ఉంటుంది..స్కిట్ సరదాగా సాగుతున్న సమయం లో యాంకర్ ప్రదీప్ అకస్మాత్తుగా వచ్చి హైపర్ ఆది నెత్తి మీద బలంగా తాగుతాడు..అకస్మాతుగా తలా మీద దెబ్బ కొట్టేలోపు హైపర్ ఆది ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యాడు..అఆయన తేరుకోవడానికి ఒక్క నిమిషం సమయం పట్టింది.
తర్వాత నవ్వుతో కవర్ చేసినప్పటికీ కూడా, హైపర్ ఆది అలా కొట్టినందుకు కాస్త ఫీల్ అయినట్టు ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..హైపర్ ఆది మరియు యాంకర్ ప్రదీప్ వ్యక్తిగతంగా మంచి స్నేహితులు అనే విషయం మన అందరికి తెలిసిందే..వీళ్లిద్దరి మధ్య ఇలాంటివి అన్ని సర్వసాధారణం..అయితే అన్ని వేళల ఒక్కేలా ప్రవర్తించడం ఎవరికైనా కష్టమే..సందర్బనానుసారంగా మన రియాక్షన్స్ కూడా మారిపోతూ ఉంటాయి..అలానే హైపర్ ఆది విషయం లో కూడా చోటు చేసుకుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్త..హైపర్ ఆది ఫీల్ అయ్యాడు అని తెలిసి యాంకర్ ప్రదీప్ కూడా సారీ చెప్పినట్టు తెలుస్తుంది..ఇవన్నీ పక్కన పెడితే హైపర్ ఆది ప్రస్తుతం సినిమాల్లో మంచి బిజీ గా గడుపుతున్నాడు..ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి..దీని వాళ్ళ హైపర్ ఆది జబర్దస్త్ షో కి డుమ్మా కొట్టినట్టు సమాచారం..ఢీ షో లో కూడా తదుపరి సీసన్ నుండి ఆయన అందుబాటులో ఉండదు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.