
ఈటీవీ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఢీ మరియు జబర్దస్త్ తర్వాత అంతటి క్రేజ్ ని సంపాదించుకున్న షో శ్రీ దేవి డ్రామా కంపెనీ..ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమయ్యే ఈ ఎంటర్టైన్మెంట్ షో లో కామెడీ స్కిట్స్ తో పాటు కంటెస్టెంట్స్ డాన్స్ మరియు పాటలు అన్నీ ఉంటాయి..గతం లో ఈ షో కి సుడిగాలి సుధీర్ యాంకర్ గా చేసేవాడు..ఆ తర్వాత ఆయన ఈటీవీ వదిలి వెళ్లిపోవడం తో ఆయన స్థానం లోకి రష్మీ వచ్చింది..అయితే ఈ షో మొత్తానికి సుడిగాలి సుధీర్ వెళ్లిపోయిన తర్వాత హైపర్ ఆది మెయిన్ అట్రాక్షన్ గా ఉంటూ వచ్చాడు..ఆయన వేసే పంచులు, చేసే స్కిట్స్ వల్ల షో కి మంచి TRP రేటింగ్స్ వస్తున్నాయి..యూట్యూబ్ లో కూడా శ్రీ దేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్స్ అద్భుతమైన వ్యూస్ వస్తున్నాయి..ఇక ఈ వారం జరగబొయ్యే ఎపిసోడ్ కి సంబంధించిన ఒక ప్రోమో ని విడుదల చెయ్యగా అది ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఈ ఎపిసోడ్ లో హైపర్ ఆది కి ఘోరమైన అవమానం జరిగింది..ఇక అసలు విషయానికి వస్తే టాస్కులో భాగంగా రష్మీ అక్కడ ఉన్న కమెడియన్స్ కి ఒక ఫన్నీ గేమ్ ని నిర్వహిస్తుంది..స్క్రీన్ మీద కొన్ని అంకెలు ఉంటాయి..ఆ అంకెలలో ఎదో ఒకటి ఎంచుకోవాలి..ఎంచుకున్న తర్వాత ఆ అంకె వెనుక ఏదైతే ఉంటుందో ఆ టాస్కు సదరు కమెడియన్ చెయ్యాల్సి వస్తుంది..అలా హైపర్ ఆది ముందుగా 9 వ అంకెని ఎంచుకుంటాడు..ఆ అంకె వెనుక ఇష్టమైన వాళ్ళని 30 సెకన్ల పాటు ముద్దు పెట్టుకోవాలి అని ఉంటుంది..అప్పుడు హైపర్ ఆది తన స్కిట్స్ లో పాల్గొనే ఐశ్వర్య ని పిలుస్తాడు..పొట్టి నరేష్ మధ్యలో దూరి రభస చేసేలోపు అది రద్దు చేసుకొని 11 వ అంకెను ఎంచుకుంటాడు..ఈ అంకె వెనుకాల బోడి గుండు కొట్టించుకోవాలని ఉంటుంది..హైపర్ ఆదికి ఇష్టం లేదంటూ తప్పించుకోడానికి చూస్తే బులెట్ భాస్కర్ టాస్కు అంటే టాస్క్ కచ్చితంగా గుండు కొట్టించుకోవాల్సిందే అంటూ బలవంతం చేస్తాడు.
అప్పుడు న్యాయ నిర్ణేతలలో ఒకరైన ఇంద్రజ గారు మాట్లాడుతూ ‘అతనికి చాలా సినిమాలు మరియు షోస్ కమిట్మెంట్స్ ఉన్నాయి..ఇలాంటివి చెయ్యడం కరెక్ట్ కాదు వదిలేయండి’ అంటూ హైపర్ ఆదికి సపోర్టుగా వస్తుంది..కానీ అక్కడున్న వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోరు..దీనితో హైపర్ ఆదికి స్వయంగా తన తోటి కమెడియన్స్ క్రింద కూర్చోపెట్టి నున్నగా గుండు గీస్తారు..ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఇది నిజంగా గీసారా, లేదా షో కి హైప్ పెంచడానికి అలా చేసారా అనే సందేహాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి..ఒకవేళ అది నిజం అయితే చాలా అన్యాయం మేము ఊరుకోము అంటూ హైపర్ ఆది ఫాన్స్ సోషల్ మీడియా లో విరుచుకుపడుతున్నారు..హైపర్ ఆది లేకపోతే ఈటీవీ లో ఎంటర్టైన్మెంట్ షోస్ అసలు నడవవు అని..అలాంటి కంటెస్టెంట్ ని ఇలా అవమానిస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు..మరి ప్రోమో లో చూపించినట్టు హైపర్ ఆది కి నిజంగానే గుండు కొట్టారా లేదా అనేది తెలియాలంటే ఈ ఆదివారం వరుకు వేచి చూడాల్సిందే.