Home Entertainment హైపర్ ఆది అరెస్ట్..షాక్ లో టాలీవుడ్

హైపర్ ఆది అరెస్ట్..షాక్ లో టాలీవుడ్

0 second read
0
0
891

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్‌లు లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఈ జాబితాలో హైపర్ ఆది కూడా ఉంటాడు. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ బుల్లితెరపైకి దూసుకొచ్చిన హైపర్ ఆది జబర్దస్త్ కమెడియన్‌గా స్టార్ స్టేటస్ అందుకున్నాడు. అతడి స్కిట్లకు మంచి క్రేజ్ ఉంది. హైపర్ ఆది స్కిట్లలో పంచ్‌లు పేలుతూనే ఉంటాయి. అయితే అప్పుడప్పుడు అతి చేయడం వల్ల హైపర్ ఆది చిక్కుల్లో పడ్డ దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా అతడు మరో వివాదంలో ఇరుక్కున్నాడు. హైపర్ ఆదిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ షో జరుగుతుండగానే ఆ షోను ఆపి మరీ ఆదిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు. యాక్సిడెంట్‌ చేసినందుకు ఏకంగా షోలోనే ఆదిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అసలు వివరాలను పరిశీలిస్తే.. ఉదయం పూట శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని కారుతో గుద్ది పట్టించుకోకుండా హైపర్ ఆది వచ్చాడని.. ఆ అమ్మాయి ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఉందని తెలుపుతూ ఆదిని అరెస్ట్ చేస్తున్నామని స్టేజీపై పోలీసులు రచ్చ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇదంతా ప్రమోషన్ కోసం అని తెలియడంతో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోను ఇలా కట్ చేశారని కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రోమోలో మొదటి నుంచి వినోదాన్ని పంచిన ఆదికి ట్విస్ట్ ఇస్తున్నట్లు చివరకు పోలీసులు రంగప్రవేశం చేయడం.. అతడిని అరెస్ట్ చేస్తున్నామంటూ గోల చేయడం లాంటివి చూపించి ఈ షోపై ఆసక్తి పెంచాలని ట్రై చేశారు. ఇక పోలీసులుగా వచ్చినవారు మరింత ఓవర్ యాక్షన్ చేయడం విశేషం. షోలో భాగంగా హైపర్‌ ఆది ఓ అమ్మాయితో కలిసి డాన్సులు వేస్తున్నారు. డ్యూయెట్లు పాడుతూ షోకి జోస్‌ తీసుకొస్తున్నాడు. ఇంతలో షో జరుగుతున్న సెట్‌లోకి పోలీసులు వచ్చారు. ఆది ఎక్కడంటూ షో సిబ్బందిని కాదంటూ లోపలికి వచ్చేశారు పోలీసులు.

దీంతో స్టేజీపై జడ్జిగా వ్యవహరిస్తున్న పూర్ణ, యాంకర్‌ రష్మి, వర్ష, ఇమ్మాన్యుయెల్‌, రాంప్రసాద్‌ ఇలా అందరికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు.అయితే ఇంత చేసినా ఈ ప్రాంక్ అభిమానులపై ఫలించలేదు. ఎందుకంటే ఇక్కడే వారు ఒక లాజిక్ మిస్ అయ్యారు. అస్సలు హైపర్ ఆదికి కారు డ్రైవింగే రాదు. ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు బాహాటంగానే చెప్పుకొచ్చాడు. మరి కారు డ్రైవింగ్ రాని ఆది కారు ఎలా నడిపాడు.. యాక్సిడెంట్ ఎలా చేశాడు..? ఇంత చిన్న లాజిక్ ను అభిమానులు పట్టుకోలేరా అని నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఏదైనా చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. మొన్నటికి మొన్న ఇమ్మానుయేల్ పూర్ణను అసభ్యంగా తాకాడని ఆమె సీరియస్ అవ్వడం, స్టేజిపై కొట్టడం లాంటివి చూపించి రచ్చ చేశారు. ఇక ఈ వారం ఇలా.. ఇదంతా మీ టీఆర్పీ రేటింగ్ ను పెంచుకోవడం కోసమేగా.. ఒక బ్రాండ్ ఉన్న ఛానెల్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం అస్సలు బాగోలేదని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…