
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అల్లు ఫ్యామిలీ కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.స్వర్గీయ శ్రీ అల్లు రామలింగయ్య గారు ఆ రోజుల్లో లెజండరీ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగాడు..ఆ రోజుల్లో అల్లు రామలింగయ్య గారు లేని సినిమా అంటూ లేదని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..స్టార్ హీరోలందరి సినిమాల్లో అల్లు రామలింగయ్య గారు ఉండాల్సిందే..ఆ స్థాయిలో ఆయన కమెడియన్ తన రేంజ్ ని పెంచుకున్నాడు..ఇక ఆయన వారసుడిగా అల్లు అరవింద్ ఇండస్ట్రీ లోకి వచ్చి నేడు టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరిగా కొనసాగుతున్నారు..ఇక ఆయన కుమారుడు అల్లు అర్జున్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఈరోజు నటుడిగా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కీతి ప్రతిష్టలను ఏ రేంజ్ కి తీసుకెళ్లాడో మన అందరికి తెలిసిందే..కానీ ఆలు అరవింద్ రెండవ కుమారుడు అల్లు శిరీష్ మాత్రం ఇండస్ట్రీ లో హీరోగా నిలదొక్కుకోలేక పొయ్యాడు కానీ..గీత ఆర్ట్స్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలను చూసుకుంటూ ఉంటున్నాడు.
ఇది ఇలా ఉండగా అల్లు అరవింద్ ముగ్గురు కుమారులైన అల్లు అర్జున్ , అల్లు శిరీష్ మరియు అల్లు బాబీ కలిసి హైదరాబాద్ లో గండిపేట ప్రాంతం లో పది ఎకరాలను కొనుగోలు చేసి వంద కోట్ల రూపాయిల భారీ వ్యయం తో అల్లు స్టూడియోస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు..అత్యాధునిక టెక్నాలజీ తో సౌత్ ఇండియా లోనే ఎక్కడ లేని రేంజ్ లో ఈ స్టూడియో ని నిర్మించడానికి పూనుకున్నారు..రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ స్టూడియోస్ ఇప్పుడు నిర్మాణం ని పూర్తి చేసుకుంది..అక్టోబర్ 1 వ తేదీన ఈ స్టూడియోస్ ని అల్లు రామలింగయ్య గారి జయంతి ని పురస్కరించుకొని ప్రారంభించబోతున్నారు..ఈ ప్రారంభ మహోత్సవానికి అల్లు ఫామిలీ తో పాటు మెగా ఫామిలీ సభ్యులు కూడా హాజరు కాబోతున్నారట..భారీ లెవెల్ లో ప్లాన్ చేసిన ఈ ప్రారంభోత్సవ వేడుక కోసం మెగా మరియు అల్లు అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.
ఈ స్టూడియో లో ఇక నుండి ఆహా మీడియా కి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయట..అంతే కాకుండా ఇతర సినిమాల షూటింగ్స్ కూడా ఇక్కడ జరగబోతున్నాయట..త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకి రానున్నాయి..హైదరాబాద్ లో ఫిలిం స్టూడియోస్ అంటే మనకి వెంటనే గుర్తుకు వచ్చేవి అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోస్ మరియు రామోజీ ఫిలిం సిటీ నే గుర్తుకు వస్తాయి..సీరియల్స్ మరియు టీవీ షోస్ దగ్గర నుండి పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ వరుకు ప్రతి ఒక్కటి ఈ మూడు స్టూడియోస్ లోనే జరుగుతూ ఉంటాయి..ఇప్పుడు అల్లు స్టూడియోస్ ని వాటికి దీటుగా తయారు అయ్యేలా ఈ అల్లు బ్రదర్స్ చేస్తారో లేదో చూడాలి..ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా సక్సెస్ జోష్ ని ఎంజాయ్ చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అతి త్వరలోనే ఆయన పుష్ప పార్ట్ 2 షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు.