
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది..ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు మరియు కృష్ణం రాజు లతో పాటు సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా మన అందరిని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు..ఇండస్ట్రీ లో సాహసానికి మారుపేరు లాగ నిలిచినా కృష్ణ గారు లేకపోతే మనకి 70 ఏం ఏం సినిమా ఉండేది కాదు..కౌ బాయ్ జానర్ లో సినిమాలు ఉండవు కాదు..డిటెక్టివ్ జానర్ లో సినిమాలు రావాలంటే దశాబ్దాలు పట్టేవి..ఒక్కే మూసలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ కి కృష్ణ గారి ఇవన్నీ పరిచయం చేసి తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిన దిగ్గజం ఆయన..ఆరోజుల్లో కృష్ణ గారికి ఉన్నంత మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ టాలీవుడ్ లో ఏ హీరో కి కూడా లేదనడం లో ఎలాంటి సందేహం లేదు..ఆయన సినిమాకి వచ్చేంత ఓపెనింగ్స్ ఎన్టీఆర్ కి కూడా వచ్చేది కాదట..ముఖ్యంగా బీ , సి సెంటర్స్ లో కృష్ణ లాంటి మాస్ హీరో మళ్ళీ పుట్టడు అని ఆయన క్రేజ్ ని చూసినవారు చెప్తుంటారు.
అలా కృష్ణ గారు తనకంటూ ఇండస్ట్రీ లో వేసుకున్న మార్కుని అందుకోవడం ఏ హీరోకి అయినా అనితర సాధ్యమనే చెప్పాలి..అలాంటి వ్యక్తి ఇక మన మధ్య లేరు అనే వార్తని జీర్ణించుకోవడం కష్టమే..నిన్న ఉదయం తెల్లవారుజామున తన తుది శ్వాసని విడిచిన కృష్ణ గారికి టాలీవుడ్ కి చెందిన ప్రతిఒక్కరు అశ్రు నివాళులు అర్పించారు..ఆ తర్వాత అభిమానుల సందర్శనార్థం కృష్ణ గారి భౌతిక కాయాన్ని ఆయన ఇంటి వద్దే ఉంచారు..ఇక ఆ తర్వాత ఈరోజు ఉదయం పద్మాలయ స్టూడియోస్ కి తరలించారు..అక్కడ అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరుకు భౌతిక కాయాన్ని ఉంచారు..కృష్ణ గారిని కడసారి చూసుకోవడానికి పద్మాలయ స్టూడియోస్ మొత్తం వేలాది మంది అభిమానులతో కిక్కిరిసిపోయింది..ఇక ఆ తర్వాత అంత్యక్రియలు జరిపించడానికి మహాప్రస్థానం కి తీసుకెళ్లారు..తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కృష్ణ గారికి అంతిమ సంస్కారాలను జరిపించారు..అలా కృష్ణ గారు ఈ భూమి మీద తన చివరి రోజు ని ముగించుకొని స్వర్గానికి పయనించారు.
ఇక కృష్ణ గారి కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అంతిమ కార్యక్రమాలన్నీ బాధ్యతగా నిర్వహించారు..ఎప్పుడు నవ్వుతు సరదాగా ఉండే మహేష్ బాబు ని అంత బాధలో చూడడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు..అంత్యక్రియలు చేస్తునంతసేపు ఆయన ఏడుస్తూనే ఉన్నారు..ఒకే ఏడాది లో తన కుటుంబం లో ఇష్టమైన వాళ్ళందరూ చనిపోవడం మహేష్ బాబు కి తీరని శోకం లాంటిది..ఈ బాధ నుండి ఆయన ఎప్పుడు కోలుకుంటాడో పాపం..పగవాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అంటూ అభిమానులు సోషల్ మీడియా లో పోస్టింగులు చేస్తున్నారు..ఈరోజు కృష్ణ గారి భౌతిక కాయాన్ని నందమూరి బాలకృష్ణ , అల్లు అరవింద్ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ సందర్శించుకొని నివాళులు అర్పించి మహేష్ ని మరియు అతని కుటుంబాన్ని ఓదార్చారు..మహేష్ గారి కుటుంబానికి ఈ బాధని మోసే శక్తి ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ కృష్ణ గారి ఆత్మకి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము .