
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గత కొద్దీ దశాబ్దాల నుంచి హీరోగా, విల్లన్ గా అద్భుతమైన చిత్రాల్లో నటించిన నటుడు శ్రీకాంత్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ముఖ్యం గా కుటుంబ కథ చిత్రాల్లో నటిస్తూ ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ ని సంపాదించుకున్న నటుడు శ్రీకాంత్. హీరోగానే కాదు విల్లన్ పాత్రలో నటించారు విల్లన్ గా నటిస్తున్న సమయం లో హీరో గా కూడా అవకాశాలు అందుకుని ప్రేక్షకులను ఏంటో సందడి చేసారు. కుటుంబ కథ చిత్రాల్లో నటించిన శ్రీకాంత్ కి ఆడియన్స్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే అనే చెప్పాలి, ఇక ప్రస్తుతం ఇండస్ట్రీ లో మరోసారి విల్లన్ పాత్ర ద్వారా శ్రీకాంత్ ప్రేక్షకులను బయపెడుతున్నాడు. ఇలా ఇండస్ట్రీ లో హీరో గా విల్లన్ గా ప్రేక్షకులను సందడి చేసిన శ్రీకాంత్ చిన్నపుడు చేరువులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని భావించారట.
ఈ విషయాన్ని స్వయం గా వెంకటేష్ అలీ తో సరదాగా కారిక్రమం లో పాలుగొనపుడు శ్రీకాంత్ బయటపెట్టాడు, ఈ విష్యం గురించి అలీ ప్రశ్నించగా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుని అసలా విషయాన్ని తెలియ చేసారు. శ్రీకాంత్ తన చిన్నపుడు ఏదొక విషయం లో అల్లరి చేయడం, తప్పు చేయడం వలన తన తండ్రి మేకా పరమేశ్వరరావు గారు శ్రీకాంత్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఇంటికి రమ్మని పిలిచారు. తన తండ్రి వార్నింగ్ ని చూసి ఇంటికి వెళ్లిన తరువాత శ్రీకాంత్ ని బాగా కొడతారని అర్ధం అయ్యింది అందుకే ఇంటికి వెళ్లిన తరువాత నన్ను కొడితే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటా అంటూ తన తండ్రి మేకా పరమేశ్వరరావు గారికి శ్రీకాంత్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు అలీ తో సరదాగా షో లో శ్రీకాంత్ తెలిపారు. ఈ విధంగా శ్రీకాంత్ తన చిన్నపటి విషయాలు అలీ తో ఈ ప్రోగ్రాం ద్వారా తెలియ చేసారు.
ఇక శ్రీకాంత్ వ్యక్తిగత విషయానికి వస్తే అతను కర్ణాటకలో జన్మించాడు, అతని తండ్రి పరమేశ్వర్ రావు కృష్ణ జిల్లా మేకవారిపాలెం నుండి వలస వచ్చిన ఒక సంపన్న భూస్వామి, అతను కర్ణాటక ధార్వాడ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టభద్రుడయ్యాడు మరియు సినిమాల్లో వృత్తిని కొనసాగించడానికి చెన్నైకి వెళ్లారు. అతను 1997లో ఊహాను వివాహం చేసుకున్నాడు మరియు ఇద్దరు కుమారులు, రోషన్ మరియు రోహన్ మరియు ఒక కుమార్తె, మేధా, కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తుంది.1990లో శ్రీకాంత్ హైదరాబాదులోని మధు ఫిల్మ్ అండ్ టీవీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యాక్టింగ్‌లో చేరాడు మరియు నటనలో ఒక సంవత్సరం పాటు పూర్తి చేసాడు, అతని మొదటి సినిమా పీపుల్ ఎన్‌కౌంటర్ 1991లో విడుదలైంది. శ్రీకాంత్ తన కెరీర్ ప్రారంభంలో విలన్‌గా మరియు సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా చిన్న పాత్రలు పోషించాడు.
వన్ బై టూ సినిమాతో లీడ్ యాక్టర్ అయ్యాడు. దాదాపు 100కు పైగా తెలుగు చిత్రాలలో ఆయన కథానాయకుడిగా నటించారు. ప్రధాన నటుడిగా అతని మొదటి హిట్ చిత్రం తాజ్ మహల్. ఇప్పటికే తన పెద్ద కుమారుడు రోషన్ కూడా తెలుగు ఇండస్ట్రీ లో నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే రోషన్ రెండు సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు, శ్రీకాంత్ కూతురు కూడా సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి రెడీ గా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీకాంత్ పలు చిత్రాల్లో కీలకమైన పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో అఖండ సినిమాలో ప్రేక్షకులను బాగా అక్కటుకున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ తెలుగు లో సన్ అఫ్ ఇండియా అలాగే ఆరాట్టు మలయాళం మరియు జేమ్స్ అనే కన్నడ సినిమాలో నటిస్తున్నాడు.