Home Entertainment హీరో శ్రీకాంత్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ప్రముఖ నటి అనితా చౌదరి

హీరో శ్రీకాంత్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ప్రముఖ నటి అనితా చౌదరి

0 second read
0
0
7,433

బుల్లితెర మీద యాంకర్ గా మంచి పాపులారిటీ ని తెచ్చుకున్న వారిలో ఒకరు అనిత చౌదరి..ఈమె పేరు చెప్పగానే ఇప్పటి యువతకి అనిత చౌదరీనా..?? ఆమె ఎవరు అని కాసేపు ఆలోచించొచ్చు..కానీ ఛత్రపతి సినిమాలో ‘సూరీడూ..ఓ సూరీడూ..అవతల బస్సు కి యాల అవుతుందిరా’ అనే ఎమోషనల్ సన్నివేశం లో నటించిన ఆర్టిస్టు అంటే కచ్చితంగా అందరికి గుర్తుకు వచ్చేస్తుంది..అంతే కాకుండా చిన్నతనం లో మన ఎగబడి చూసి నాన్న, ఋతురాగాలు, కస్తూరి మరియు అమృతం వంటి బ్లాక్ బస్టర్ సీరియల్స్ అన్నిటిలో ఈమె నటించింది..దాదాపుగా 20 సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం అటు సినిమాల్లో ఇటు బుల్లితెర మీద కనిపించడం లేదు..ప్రశాంతంగా తన భర్త కృష్ణ చైతన్య తో దాంపత్య జీవితం ని కొనసాగిస్తుంది..అయితే చాలా కాలం తర్వాత ఆమె ఇటీవలే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది..ఈ ఇంటర్వ్యూ లో ఆమెకి తన జీవితం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలను పంచుకోగా అవి ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

తన భర్త కృష్ణ చైతన్య తో తన పెళ్లి ఎలా జరిగింది అనేది చెప్పుకొచ్చింది అనితా గారు..ఆమె మాట్లాడుతూ ‘నా చిన్న తనం లోనే నా తండ్రి నన్ను వదిలి వెళ్ళిపోయాడు..ఆ తర్వాత కుటంబ బాధ్యత మొత్తం నా మీదనే పడిపోవడం తో నా బాల్యాన్ని మొత్తం కోల్పోయాను ..నా తండ్రి చేసిన ఆ పనికి పెళ్లి అంటేనే నాకు విరక్తి కలిగింది..జీవితం లో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను..కానీ ఎప్పుడైతే నా జీవితం లోకి కృష్ణ చైతన్య వచ్చాడో..ఎప్పుడైతే అతనితో స్నేహం మొదలు పెట్టానో..పెళ్లి మీద నాకు ఉన్న అభిప్రాయం మారి..పెళ్లి చేసుకోవాలని అనిపించింది..అతనికి కూడా నేను అంటే ఎంతో ఇష్టం..అయితే కృష్ణ చైతన్య పెళ్లి చేసుకున్నాక అమెరికా కి వెళ్ళిపోతాడు..నువ్వు కూడా అతనితో పాటు అమెరికా కి వెళ్ళిపోవాలి అని ఆయన తల్లితండ్రులు చెప్పడం తో నేను ఒప్పుకోలేదు..నా కుటుంబం నా మీదనే ఆధారపడి ఉంది..వారిని ఒంటరిగా వదిలి దేశం కానీ దేశం లో బ్రతకలేను’ అని చెప్పిందట.

ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నేను నో చెప్పిన తర్వాత కూడా కృష్ణ చైతన్య నన్ను వదలలేదు..ఇంట్లో వారితో రోజు నన్ను ఒప్పించడానికి ఫోన్లు చేసేవారు..హీరో శ్రీకాంత్ గారు కృష్ణ చైతన్య కి కజిన్ అవుతాడట..శ్రీకాంత్ కూడా డైలీ నాకు ఫోన్లు చేసి మావాడిని పెళ్లి చేసుకోమని టార్చర్ పెట్టేవాడు..వీళ్ళ టార్చర్ తట్టుకోలేక నెంబర్ మార్చేసి మూడు సంవత్సరాల వరుకు కృష్ణ చైతన్య తో మాట్లాడలేదు..మూడు సంవత్సరాల తర్వాత ఆయనే నేరుగా ఇంటికి వచ్చి నా ఇష్టాన్ని అంగీకరించడం తో పెళ్లి చేసుకున్నాను..ఇప్పుడు అతనితో ఎంతో సంతోషంగా దాంపత్య జీవితం కొనసాగిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది అనిత ..కృష్ణ చైతన్య సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ కి సంబంధించిన మనిషి..తెలుగు సినిమా ఇండస్ట్రీ తో అతనికి ఎలాంటి సంబంధం లేదు..మీడియా ముందు కూడా ఇతను కనిపించిన సందర్భాలు ఏమి లేవని..సోషల్ మీడియా కి కూడా అతను దూరంగా ఉంటాడు అంటూ చెప్పుకొచ్చింది అనిత..ఈమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో విజయ్ దేవరకొండ పెళ్లి..వైరల్ అవుతున్న ఫోటోలు

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు చాలా క్రేజ్ ఉంది. ఇటీవల లైగర్ సినిమాతో బాలీవుడ్‌లోనూ ప…