Home Entertainment హీరో శర్వానంద్ పెళ్లి ఫిక్స్..పెళ్లి కూతురు ఎవరో మీరే చూడండి

హీరో శర్వానంద్ పెళ్లి ఫిక్స్..పెళ్లి కూతురు ఎవరో మీరే చూడండి

0 second read
0
0
199

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్స్‌లో ప్ర‌స్తుతం ఇద్ద‌రు హీరోల పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తాయి. ఒక‌రు ప్ర‌భాస్ అయితే.. మ‌రొక‌రు శ‌ర్వానంద్‌. ఇద్ద‌రినీ పెళ్లి ఎప్పుడు అని అడ‌గ‌ని ఇంట‌ర్వ్యూనే ఉండ‌దంటే అతిశయోక్తి కాదు. వీరి పెళ్లి విషయంపై సోష‌ల్ మీడియాలో వార్త‌ల‌కు కొద‌వే ఉండ‌దు. ప్రభాస్ సంగతి పక్కనపెడితే త్వరలో శర్వానంద్ పెళ్లికొడుకు కాబోతున్నాడంటూ ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అమ్మాయి ఎవరు అంటూ చాలా మంది వెతికేస్తున్నారు. శర్వానంద్ పెళ్లిచేసుకునేది సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను. ఆమె అమెరికాలో పనిచేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే శర్వానంద్‌ది పెద్దలు కుదిర్చిన వివాహం మాత్రమే కాదని, తాను ప్రేమించిన అమ్మాయినే ఇలా అరెంజ్డ్‌ మ్యారెజ్‌గా సెట్ చేశాడని తెలుస్తోంది. ఈ అమ్మాయిని శర్వానంద్ ప్రేమించినట్లు తెలుస్తోంది. కోవిడ్ సమయంలో సదరు యువతి వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం హైదరాబాద్ రాగా శర్వానంద్ ఆమెను చూసి ప్రేమలో పడినట్లు అతడి సన్నిహితులు చెప్తున్నారు.

తెలంగాణకు చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని శర్వానంద్ పెళ్లిచేసుకోబోతున్నాడు. అమ్మాయి ఎవరు? పేరేంటి? పెళ్లి ఎప్పుడు అనే విషయాలను శర్వానంద్ త్వరలోనే ప్రకటిస్తాడని తెలుస్తోంది. రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ సైతం రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారినే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు శర్వానంద్ కూడా వాళ్ల దారిలోనే పయనిస్తున్నాడని అర్ధమవుతోంది. సినిమాల విషయానికి వస్తే శర్వానంద్‌కు గత ఏడాది మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఒక సినిమా ఫ్లాప్ కాగా మరో సినిమా హిట్ అందుకుంది. ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేదు ఫలితాన్ని అందించంగా ఒకే ఒక జీవితం మాత్రం శర్వానంద్‌కు హిట్ అందించింది. రీసెంట్‌గా బాల‌య్య హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే సీజ‌న్ 2కు శ‌ర్వానంద్ గెస్ట్‌గా వ‌చ్చాడు. అప్పుడు బాల‌య్య త‌న పెళ్లి గురించి ప్ర‌స్తావిస్తే ప్ర‌భాస్ చేసుకున్న త‌ర్వాత అని అనేశాడు. ప్ర‌భాస్ ఏమో తనకు ఇంకా పెళ్లి రాత రాసి పెట్ట‌లేదు అని చెప్పేశాడు. అయితే ప్రభాస్ చేసుకోకముందే ఇప్పుడు శర్వానంద్ పెళ్లికి సిద్ధమవుతున్నాడు.

ప్రభాస్ పెళ్లి తర్వాతే తన పెళ్లి అని ఇన్నాళ్లూ చెప్పుకుంటూ వచ్చిన శర్వానంద్ సడెన్‌గా తన పెళ్లికి లగ్గం పెట్టేయడంతో టాలీవుడ్‌తో మిగతా బ్యాచ్‌లర్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏప్రిల్ నెలలో శర్వానంద్ పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 38 ఏళ్ల శర్వానంద్ దాదాపు పదేళ్లుగా సినిమా రంగంలో ఉన్నాడు. మంచి స్థితిమంతుల కుటుంబానికి చెందిన శర్వానంద్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. యువ నటుల్లో మంచి నటన కనబర్చే నటుడిగా పేరు ఉంది. శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో చిన్నపాత్ర ద్వారా మంచి పేరు సంపాదించాడు. ఈ సినిమా తర్వాత మెగా ఫ్యామిలీతో శ‌ర్వానంద్‌కు మంచి అనుబంధం ఉంది. శ‌ర్వా త‌మ ఇంట్లోనే పెరిగాడ‌ని ప‌లు సంద‌ర్భాల్లో చిరంజీవి సైతం చెప్పాడు. రామ్ చ‌ర‌ణ్‌, శ‌ర్వానంద్ మ‌ధ్య స్నేహం కూడా చిన్న‌ప్ప‌టి నుంచే ఉంది. రీసెంట్‌గా న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌ను సైతం శ‌ర్వానంద్‌ మెగాస్టార్ చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకున్నాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…