
తమిళంలో ప్రస్తుతం ఉన్న అగ్రహీరోల్లో ఇళయ దళపతి విజయ్ ఒకడు. తమిళనాడులో విజయ్‌కు భీకరమైన ఫాలోయింగ్ ఉంటుంది. తెలుగులో పవన్ కళ్యాణ్ మాదిరి క్రేజ్ తమిళంలో విజయ్ సొంతమనే చెప్పాలి. అతడు తన డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాడు. ఒకప్పుడు తెలుగు సినిమాలను రీమేక్ చేసే హీరో అని విజయ్‌కు ముద్ర పడింది. కానీ ఇప్పుడు విజయ్ నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యే స్థాయికి ఎదిగాడు. తుపాకీ, సర్కార్, పోలీసోడు, విజిల్, అదిరింది, మాస్టర్, బీస్ట్ సినిమాలతో టాలీవుడ్‌లోనూ విజయ్ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పాటు చేసుకున్నాడు. దిల్ రాజు బ్యానర్‌లో విజయ్ ప్రస్తుతం నటిస్తున్న వారసుడు మూవీ వచ్చే సంక్రాంతికి తెలుగు, తమిళంలో విడుదల కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. అయితే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. విజయ్ కుమారుడు కూడా త్వరలో హీరోగా రాబోతున్నాడు.
విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఇప్పటికే భైరవ అనే సినిమాలో తన తండ్రి విజయ్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు. సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి జాసన్ ఎంతో ఆసక్తిగా ఉన్నాడని.. అతడి లాంచింగ్ ప్రాజెక్ట్ కోసం విజయ్ ఇప్పటికే స్క్రిప్టులు వింటున్నాడని తమిళ మీడియా సర్కిళ్లలో వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే తనయుడి డెబ్యూ మూవీలో గెస్ట్ రోల్ చేయడానికి కూడా విజయ్ రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జాసన్‌కు ఇష్టం ఉంటేనే సినిమాల్లోకి వచ్చేలా చేస్తానని.. తన కుమారుడు సినిమాలే చేయాలని తాను అనుకోనని.. ఈ విషయంలో కుమారుడిపై తానెప్పుడూ ఒత్తిడి చేయనని విజయ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. జాసన్‌కు తనకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛను తాను ఇస్తానని స్పష్టం చేశాడు. కచ్చితంగా తనకు సపోర్ట్ చేస్తానని విజయ్ తెలిపాడు.
అయితే తెలుగులో ఘనవిజయం సాధించిన ఉప్పెన సినిమాను తమిళంలో విజయ్ కుమారుడు జాసన్ హీరోగా రీమేక్ చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. ఇప్పుడు జాసన్ కోసం విజయ్ ప్రత్యేకంగా కథలు వింటున్నాడని.. అందులో బెస్ట్ స్టోరీని సెలక్ట్ చేసి జాసన్‌ను లాంచింగ్ చేస్తారంటూ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇళయ దళపతి అభిమానులు జాసన్ అరంగేట్రం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. తండ్రి పోలికలకు దగ్గరగా ఉండే సంజయ్ కూడా అభిమానులు మెప్పిస్తాడనే నమ్మకాన్ని విజయ్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సంజయ్ తన తండ్రి నటించిన సూపర్ డూపర్ హిట్ సాంగ్ వాతి కమింగ్‌కు డాన్స్ చేస్తూ అందరికీ ఆకట్టుకున్నాడు. జాసన్‌కు ప్రస్తుతం 21 ఏళ్లు నిండాయి. అతడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. జాసన్ ప్రస్తుతం కెనడాలోని ఓ యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తున్నాడు. ఈ కోర్సు తర్వాత జాసన్ సంజయ్ కోలీవుడ్ ఎంట్రీ పక్కా కానుందని సమాచారం అందుతోంది.
1
2
3
4
5
6
7