Home Entertainment హీరో రానా ఎమోషనల్ గా మాట్లాడిన ఈ మాటలు వింటే కన్నీళ్లు ఆపుకోలేరు

హీరో రానా ఎమోషనల్ గా మాట్లాడిన ఈ మాటలు వింటే కన్నీళ్లు ఆపుకోలేరు

0 second read
0
0
23,040

తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫామిలీ నుండి ఇండస్ట్రీ కి వచ్చినప్పటికీ సొంత కష్టం తో తన తండ్రులు బాబాయిలు పడిన హార్డ్ వర్క్ ని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయినా నేటి తరం హీరోలు ఎంతో మంది ఉన్నారు..అలాంటి హీరోలలో ఒకడు దగ్గుపాటి రానా..రామానాయుడు మనవడిగా, విక్టరీ వెంకటేష్ గారి అబ్బాయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రానా తన తోలి సినిమా లీడర్ తోనే బ్లాక్ బస్టర్ హట్ ని అందుకున్నాడు..ఆ తర్వాత కూడా రానా ఎంచుకున్న సినిమాలు చూస్తే రొటీన్ కి బిన్నంగా కొత్తదనం తో ఉంటాయి..కేవలం సినిమాలు మాత్రమే కాదు..ఆయన ఎంచుకునే పాత్రలు కూడా చాలా కొత్తగా మరియు వైవిధ్యంగా ఉంటాయి..వరుసగా హీరో గా నటిస్తున్న సమయం లోనే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ద్వారా విలన్ గా నటించి పాన్ ఇండియా లెవెల్ లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు.

ఆ సినిమా తర్వాత ఆయన హిందీ లో ఘాజి అనే సినిమా చేసాడు..అక్కడ పెద్ద హిట్ అయ్యింది..ఇక తెలుగు లో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమాలో హీరో గా నటించాడు..ఇది కూడా పెద్ద హిట్ అయ్యింది..అలా కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ అయిపోతాడు అని దగ్గుపాటి అభిమానులు భావించారు..కానీ ఆ తర్వాత రానా కి ఆరోగ్య సమస్యలు ఎదురు అవ్వడం వల్ల సినిమాలకు కొంత కాలం దూరం గా ఉన్నాడు..అడపాదడపా కొన్ని సినిమాలలో ముఖ్య పాత్రలు పోషించినప్పటికీ హీరో గా మాత్రం ఒక్క సినిమా కూడా చెయ్యలేదు..అయితే బాహుబలి సినిమా తర్వాత ఆయనకీ మంచి క్రేజ్ ని తెచ్చిపెట్టిన సినిమా ఈ ఏడాది విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ చిత్రం..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి దీటైన పాత్ర పోషించి మంచి మార్కులే కొట్టేసాడు..ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాలో రానా కి వచ్చిన పేరు తో పోలిస్తే బాహుబలి సినిమాలో వచ్చింది తక్కువలాగా అనిపిస్తది..అంతలా ఆయన పవన్ కళ్యాణ్ తో పోటీ పడి ఈ సినిమాలో నటించాడు.

ఇక ఈ సినిమా నుండైనా రానా పూర్తి స్థాయి హీరో గా ఇండస్ట్రీ లో హిట్స్ కొడుతూ గొప్ప స్థాయికి చేరుకుంటాడని దగ్గుపాటి అభిమానులు భావించారు..కానీ భీమ్లా నాయక్ సినిమా తర్వాత ఆయన హీరో గా నటించిన విరాట పర్వం అనే సినిమా విడుదలైంది..ఇందులో రానా కంటే హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి పాత్రకి ఎక్కువ బలం ఉండడం..ఆమెకే ఎక్కువ మార్కులు రావడం తో దగ్గుపాటి అభిమానులు మరోసారి ఫీల్ అయ్యారు..అయితే సోషల్ మీడియా లో ఫాన్స్ తరుపున నుండి వస్తున్నా కామెంట్స్ ని గమనించిన రానా ఇక నుండి ప్రయోగాత్మక సినిమాలు చెయ్యను..మీకు నాచే విధమైన సినిమాలు తీస్తాను అని హామీ ఇవ్వడం తో ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు..అయితే రానా తక్కువ సినిమాలు చెయ్యడానికి కూడా కారణం లేకపోలేదు..గతం లో సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించిన సామ్ జామ్ ప్రోగ్రాం లో రానా మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు ఆపుకోలేరు..తనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని..డాక్టర్లు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయితే ప్రాణాలకే ప్రమాదమని చెప్పడం తో చాలా కాలం సినిమాలకు గాప్ ఇచ్చాడు రానా..కెరీర్ పీక్స్ కి పోతున్న సమయం లో నాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటూ రానా చేసిన ఆ కామెంట్స్ వింటే కన్నీళ్లు ఆపుకోలేరు..అయితే ఇప్పుడు సర్జరీ విజయవంతంగా పూర్తి అవ్వడం..డాక్టర్లు ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పడం తో రానా పెళ్లి చేసుకొని సినిమాలు చేసుకుంటున్నాడు..మరి అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం రానా తన మాటని భవిష్యత్తులో నిలబెట్టుకుంటాడో లేదో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…