
మన టాలీవుడ్ లో కొంతమంది హీరోలకు వయస్సు అయిపోయిన వాళ్ళ క్రేజ్ మొత్తం పోయిన కూడా వాళ్ళకంటూ ఏర్పర్చుకునేం బ్రాండ్ ఇమేజి మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది,ఆ లాంటి బ్రాండ్ ఇమేజి ఉన్న హీరో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజా శేఖర్ గారు,ఒక్కప్పుడు టాలీవుడ్ లో ఈయన చిరంజీవి మరియు బాలకృష్ణ తో సరిసమానమైన మాస్ ఇమేజి ని సంపాదించి, అంకుశం సినిమా మన టాలీవుడ్ లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, రాజశేఖర్ పేరు ఎత్తితే ముందు అంకుశం సినిమా గుర్తుకు వస్తుంది , నేటి తరం యువకులు కూడా ఆయనని అంకుశం రాజశేఖర్ అనే పిలుస్తారు, అంతతి బ్రాండ్ ఇమేజిని ఆ సినిమా ఆయనకీ తీసుకొచ్చింది, ఈ సినిమా తర్వాత అయన కెరీర్ లో అంకుశం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి, ఇక కేవలం హీరో గా మాత్రమే కాదు డాక్టర్ గా రాజశేఖర్ ఎన్నో సేవలు అందించారు,ముక్కు సూటితనం తో అవతల మనిషి ఎంత పెద్ద వ్యక్తి అయినా మొహమాటం లేకుండా మనసులో ఏది దాచుకోకుండ మాట్లాడే అతి తక్కువ మంది హీరోలలో రాజశేఖర్ గారు కూడా ఒక్కరు.
ఇది ఇలా ఉండగా రాజశేఖర్ గారి కుటంబం లో ఈరోజు తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది, రాజశేఖర్ గారి తండ్రి వరద రాజన్ ఈరోజు కన్నుమూశారు, కొన్ని రోజల నుండి తీవ్రమైన అస్వస్థత వల్ల చికిత్స తీసుకుంటున్న వరద రాజన్ ఈరోజు చికిత్స పొందుతూ తన తుది శ్వాసని వదిలారు, వరద రాజన్ తమిళనాడు లో డీసీపీ గా పని చేసిన వ్యక్తి , రిటైర్ అయ్యాక ఆయన తన కొడుకు రాజశేఖర్ వద్దనే ఉన్నాడు, వరద రాజన్ గారికి 5 మంది సంతానం, వారిలో ముగ్గురు కొడుకులు కాగా మరో ఇద్దరు కుమార్తెలు, హీరో రాజా శేఖర్ వరద రాజన్ గారికి రెండవ సంతానం,ఇక నిన్న రాత్రి కన్నుమూసిన వరద రాజన్ గారి పార్థివ దేహం ని ఈరోజు ఉదయం 6 గంటలకు ఫ్లైట్ లో చెన్నై కే తరలించారు, ఆయన అంత్యక్రియలు చెన్నలోనే జరగనున్నాయి,తన తండ్రి అంటే హీరో రాజశేఖర్ గారికి ఎంతో ఇష్టం, అస్వస్థకు గురి అయ్యినప్పుడు కూడా రాజశేఖర్ గారే స్వయంగా తన తండ్రికి అవసరం అయ్యినవి అన్ని దగ్గ్గర ఉంది చూసుకున్నాడుఇక ఈరోజు అకస్మాత్తుగా ఆయన మరణించడం రాజశేఖర్ గారి కుటుంబంమొతాన్ని శోక సంద్రం లో ముంచేసింది, ఆయన ఆత్మా ఎక్కడ ఉన్న శాంతి చేకూరాలని ఆమన్స్పూర్తిగా కోరుకుంటూ నివాళులు అర్పిస్తున్నాము.
ఇక రాజ్ శేఖర్ ఇప్పటికి కూడా హీరో గా కొనసాగుతూనే ఉన్నాడు, వాస్తవానికి హీరో గా ఆయన మార్కెట్ ఎప్పుడో పూర్తిగా పొయ్యింది, తన తోటి హీరోలు అయినా జగపతి బాబు మరియు శ్రీకాంత్ వంటి వారు కూడా క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మరియు విలన్ రోల్స్ తో రాణిస్తున్నారు, కానీ రాజశేఖర్ మాత్రం ఇప్పటికి తనకి మార్కెట్ లేకపోయినా హీరోగానే కొనసాగుతున్నాడు, అయితే తనకి విలన్ రోల్స్ చెయ్యాలి అని ఎప్పటి నుండో ఉంది అని, కానీ మంచి పాత్రలు అసలు దొరకట్లేదు అని సరైన పవర్ ఫుల్ విలన్ రోల్ కోసం చూస్తునాను అని ఇది వరుకు ఆయన పలు ఇంటర్వూస్ లో తెలిపాడు,అయితే ఆ రోజు ఆయనకీ వచ్చింది అనే చెప్పుకోవాలి, ప్రముఖ హీరో గోపీచంద్ మరియు శ్రీవాస్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న మూవీ లో రాజశేఖర్ విలన్ గా నటించనున్నాడు, ఈ సినిమా ఆయనకీ లెజెండ్ సినిమా జగపతి బాబు కి ఎలా సహాయపడిందో నాకు కూడా అదే రేంజ్ సినిమా అవుతుంది అని రాజశేఖర్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు అట, మరి ఆయన కూడ అజగపతి బాబు లాగ సౌత్ లో టాప్ విలన్ గా కొనసాగుతదో లేదో చూడాలి.