Home Entertainment హీరో రవితేజ కి భారీ యాక్సిడెంట్..ఆందోళనలో అభిమానులు

హీరో రవితేజ కి భారీ యాక్సిడెంట్..ఆందోళనలో అభిమానులు

0 second read
0
0
14,720

క్రాక్ వంటి సెన్సషనల్ హిట్ తర్వాత మాస మహారాజ రవితేజ ఈ ఏడాది మన ముంది ఖిలాడీ అనే సినిమా ద్వారా వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంకెన్ల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది..దీనితో రవితేజ తన తదుపరి సినిమాల పై ప్రత్యేక ద్రుష్టి సారించి స్క్రిప్ట్ పరంగా చాలా గట్టిగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు..అందులో భాగంగానే టీజర్ మహేశ్వర రావు అనే సినిమాని ఒప్పుకొని చేస్తున్నాడు..టైగర్ నాగేశ్వర రావు అనే స్టువర్ట్ పురం దొంగ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రవితేజ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు..ఎప్పుడు నూతన దర్సకులను ఇండస్ట్రీ కి పరిచయం చేసే అలవాటు ఉన్న రవితేజ ఈ సినిమా ద్వారా వంశి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు..శెరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించిన ఒక్క వార్త సోషల్ మీడియా ప్రచారం అవుతూ రవితేజ అభిమానులను కంగారు పెడుతుంది..ఇంతకీ ఆ వార్త ఏమిటో ఇప్పుడు మనం చూద్దాము.

ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా కి సంబంధించిన ఒక్క భారీ యాక్షన్ సన్నివేశం ని ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ సారథ్యం లో తెరకెక్కిస్తున్నారు..ఈ సన్నివేశం సినిమాకి పెద్ద హైలైట్ గా నిలవబోతుందట..అయితే ఈ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయం లో రవితేజ రోప్స్ తెగిపోయి క్రిందపడి తీవ్రమైన గాయాలు అయ్యాయట..వెంటనే ఆయనని ఆకుపత్రికి తరలించడంతో దాదాపుగా ఆయనకీ తగిలిన దెబ్బలకు 12 కుట్లు పడ్డాయట..డాక్టర్లు రెండు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని రవితేజ చాలా గట్టిగా చెప్పారట..కానీ రవితేజ తనకి చికిత్స జరిగిన రెండు రోజులకే షూటింగ్ సెట్స్ లో దర్శనమిచ్చాడు..ఎందుకంటే ఈ సన్నివేశం ని తెరకెక్కించడం కోసం నిర్మాత భారీ స్థాయిలో డబ్బును ఖర్చు చేసాడట..ఇప్పుడు రవితేజ రెండు నెలలు బెడ్ రెస్ట్ తీసుకుంటే ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ డేట్స్ పోతాయి..దీనివల్ల నిర్మాతకి తీవ్రమైన నష్టాలు వస్తాయని గ్రహించిన రవితేజ తనని నమ్ముకున్న నిర్మాత అన్యాయం కాకూడదని శరీరం సహకరించకపోయినా కూడా షూటింగ్ లో పాల్గొని ఆ యాక్షన్ సన్నివేశం ని పూర్తి చేస్తున్నాడు..నిర్మాత బాగోగులు గురించి రవితేజ ఇంత రిస్క్ చెయ్యడం చూసి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది.

రవితేజ ఈ సినిమా తో పాటుగా రావణాసుర అనే సినిమాలో కూడా నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇందులో అక్కినేని హీరో సుశాంత్ కూడా ఒక్క ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ ని కూడా టైగర్ నాగేశ్వరరావు తో కలిపి సమాంతరం గా పూర్తి చేస్తున్నాడు రవితేజ..ఇది ఇలా ఉండగా జానీ సినిమా తర్వాత సినిమాలకు పూర్తి గా దూరమైనా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ రెండు సినిమాల తర్వాత రవితేజ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో నటించబోతున్నాడు..డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రవితేజ చిరంజీవి కి తమ్ముడిగా నటిస్తున్నాడు..అన్నయ్య సినిమా తర్వాత మళ్ళీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం తో అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి..ఆ అంచనాలను ఈ కాంబినేషన్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…