
న్యాచురల్ స్టార్ నాని తన కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న చిత్రం దసరా..సుమారు 65 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని పాన్ ఇండియన్ లెవెల్ లో అన్ని బాషలలో తెరకెక్కిస్తున్నారు ఆ చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల..కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..గతం లో నాని మరియు కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన నేను లోకల్ అనే సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కడం తో మరో బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని నాని అభిమానులు భావిస్తున్నారు..ఈ సినిమా లో నాని లుక్ కూడా ఇంతకు ముందు సినిమాలతో పోలిస్తే చాలా డిఫరెంట్ గా ఉంది..ఇటీవలే విడుదల చేసిన టీజర్ కూడా అదిరిపోయింది..బొగ్గు గనుల నేపథ్యం లో సాగే ఈ సినిమా స్టోరీ నాని కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది అని మూవీ టీం గట్టి నమ్మకం తో ఉంది.
నాని ఈ సినిమా కోసం ఎన్నో రిస్కీ షాట్స్ లో కూడా నటించాడు..ఇటీవలే చిత్రీకరించిన ఒక షాట్ ఆయన ప్రాణాల మీదకి కూడా తీసుకొచ్చింది..ఇక అసలు విషయానికి వస్తే ఒక షాట్ లో నాని మీద బొగ్గు మొత్తం పడిపోతుంది..చాలాసేపటి వరుకు ఆయన ఆ బొగ్గులో ఇర్రుక్కుపొయ్యి ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది..మూవీ టీం ఎంతో కస్టపడి నాని ని కాపాడారు..అయితే అదృష్టం కొద్దీ నాని కి పెద్దగా దెబ్బలు ఏమి తగలలేదు..స్వల్ప గాయలతోనే ఆయన బయటపడ్డారు..కానీ నాని ప్రమాదం జరిగింది అని న్యూస్ రావడం తో సోషల్ మీడియా లో నాని అభిమానులు తీవ్రమైన ఆందోళనకు గురైయ్యారు..ఇక ఆ తర్వాత మూవీ యూనిట్ అభిమానులు భయపడాల్సిన అవసరం లేదు..నాని కి చాలా సురక్షితంగా ఉన్నాడు అని అధికారిక ప్రకటన చెయ్యడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..శేరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
ఈ ఏడాది నాని హీరో గా నటించిన అంటే సుందరానికి మూవీ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే రేంజ్ హిట్ అయ్యింది..ఈ సినిమాకి విడుదల రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా ఎందుకో వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు..కానీ నైజం ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో ఈ సినిమా బాగా ఆడింది..అంతే కాకుండా ఇటీవలే OTT లో విడుదల అవ్వగా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంది ఈ సినిమా..అయితే కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయింది అనేదే అభిమానుల నిరాశ..ఇప్పుడు వాళ్లంతా దసరా సినిమా భారీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు..వాళ్ళ కోరికకు తగ్గట్టే ఈ సినిమాకి ఔట్పుట్ అదిరిపోయింది అట..నాని కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుంది అట..భలే భలే మొగాడివోయ్ సినిమా నాని కెరీర్ ని ఎలా అయితే మలుపు తిప్పిందో దసరా సినిమా కూడా అదే రేంజ్ లో మలుపు తిప్పి నాని కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.