
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అందం తో పాటుగా అద్భుతమైన నటన కనబర్చి ఇండస్ట్రీ ని ఏలిన హీరోయిన్స్ లో ఒకరు సౌందర్య.స్వర్గీయ మహానటి సావిత్రి తర్వాత మళ్ళీ అలాంటి హీరోయిన్ ని చూడలేము ఏమో అని అనుకున్న వాళ్లందరికీ సమాధానమే సౌందర్య.ఆమె నటన ఎంత సహజం గా ఉంటుంది అంటే, మన రోజువారీ జీవితం లో చూస్తున్న వారు ఎలా అయితే ఉంటారో అంత సహజత్వం గా ఉంటుంది.సౌత్ ఇండియా లో ఈమె దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించింది.అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న ఈమె దుర్మరణం పొందడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.2004 వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈమె బీజేపీ పార్టీ కి ఎన్నికల ప్రచారం చెయ్యడానికి బయలుదేరినప్పుడు హెలికాప్టర్ క్రాష్ అయ్యి దుర్మరణం చెందింది.పెళ్ళైన సరిగ్గా ఏడాదికి ఇలాంటి సంఘటన జరగడం శోచనీయం.
అయితే ఆమె చనిపోకముందే ఒక బిడ్డకి జన్మనిచ్చింది అని,ఇప్పుడు ఆ బిడ్డ సౌందర్య భర్తతోనే ఉందని ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో అప్పట్లో ప్రచారం అయ్యేవి.కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదని సౌందర్య తల్లితండ్రులు ఎన్నోసార్లు ఇంటర్వ్యూ లో తెలిపారు.ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లోని ఇంస్టాగ్రామ్ లో అచ్చు గుద్దినట్టు సౌందర్య పోలికలతో ఉన్న ఒక అమ్మాయి, ప్రతీ రోజు రీల్స్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది.ఆమె ఫోటోలను చూస్తే అసలు సౌందర్య కాదు,ఆమె పోలికలతో ఉన్న అమ్మాయి అని ఎవ్వరూ నమ్మలేరు.మనిషిని పోలిన మనుషులు ఉంటారు అనడానికి సరైన ఉదాహరణ ఇదే.ఆమెని చూసిన వెంటనే సడన్ గా ఈమె సౌందర్య కూతురు అంటే నమ్మినా నమ్మేస్తారు జనం.కానీ ఆమె సౌదర్యం కూతురు కాదు, కేవలం ఆమె పోలికలతో ఉన్న ఒక అమ్మాయి మాత్రమే.
ఈ అమ్మాయి పేరు చిత్ర..ఈమె మలేసియా లో ఒక NRI కుటుంబానికి చెందిన అమ్మాయి.ఇంస్టాగ్రామ్ లో అచ్చం సౌందర్య లాగ రెడీ అయ్యి ఆమె పాత సినిమాల్లోని పాటలు మరియు డైలాగ్స్ తో రీల్స్ చేస్తూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది.చిత్రకి ఇంస్టాగ్రామ్ లో ఉన్న ఫాలోయింగ్ మామూలు రేంజ్ కాదు, ఆమె ఏ రీల్ అప్లోడ్ చేసిన లక్షల్లోనే వ్యూస్ వస్తూ ఉంటాయి.సౌందర్య లేని లోటు ని ఎవ్వరు పూడవలేరు అని చెప్పుకునే టాలీవుడ్ ఇండస్ట్రీ, అచ్చు గుద్దినట్టు ఆమె పోలికలతో ఉన్న ఈమెని ఇండస్ట్రీ కి తీసుకొస్తారా లేదా అనేది చూడాలి.