
అలనాటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో దాదాపుగా స్టార్ హీరోలందరి సరసన సిమ్రాన్ నటించింది. తొలుత బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఆ తరువాత వరుస సినిమాలు చేసినప్పటికీ సరైన గుర్తింపు అక్కడ రాలేదు. కన్నడ, మలయాళంలో కూడా నటించింది. ఆఖరిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 1997లో వీఐపీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సిమ్రాన్ మెగాస్టార్ చిరంజీవితో మృగరాజు, బాలయ్యతో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సీమ సింహం, గొప్పింటి అల్లుడు, నాగార్జుతో నువ్వు వస్తావని, వెంకటేష్‌తో కలిసుందాం రా, ప్రేమతో రా వంటి పలు చిత్రాల్లో సిమ్రాన్ నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకుంది. 2003లో నందమూరి హరికృష్ణతో నటించిన సీతయ్య సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుంది.
స్టార్ హీరోయిన్‌గా, సీరియల్ యాక్టర్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకకులను అలరించింది. ఒకానోక దశలో విలన్ పాత్రను కూడా పోషించేందుకు వెనకడుగు వేయలేదు. కథ నచ్చితే ఏ స్థాయి సినిమాలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉండేది. అలాగే గ్లామర్ ఒలకబోస్తూ పలు చిత్రాల్లో సిమ్రాన్ స్పెషల్ అపియరెన్స్ కూడా ఇచ్చింది. 2003లో తన స్నేహితుడైన దీపక్ బగ్గాను వివాహం చేసేుకుంది. అప్పటి నుంచి కాస్తా సినిమాల జోరు తగ్గించింది. కానీ దూరంగా మాత్రం ఉండలేకపోయింది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ పవర్ ఫుల్ పాత్రల్లో నటిస్తూ తన మార్క్ చూపిస్తోంది. 2007లో బాలయ్య నటించిన ఒక్కమగాడు సినిమాలో ముసలి పాత్రలో నటించి ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కృష్ణ భగవాన్‌తో జాన్ అప్పారావ్ 40 ప్లస్ అనే సినిమాలో నటించింది. అయితే టాలీవుడ్‌కు దూరంగా ఉన్నా ప్రస్తుతం తమిళంలో పలు సినిమాలలో సిమ్రాన్ నటిస్తోంది. ఇటీవల మాధవన్ హీరోగా నటించిన రాకెట్రీ అనే సినిమాలో సిమ్రాన్ కీలక పాత్ర పోషించింది.
ఇటీవల సిమ్రాన్తన భర్త దీపక్ బగ్గాతో కలిసి సొంతం వ్యాపారం స్టార్ట్ చేసింది. సిమ్రాన్ అండ్ సన్స్ అనే బ్రాండ్ పేరుతో ప్రొడక్షన్ స్టూడియోస్ ప్రారంభించింది. ఈ సంస్థ నిర్వహణ బాధ్యతలను మాత్రం తన భర్తకు అప్పజెప్పింది. బిజినెస్ పేరిట అదనపు బాధ్యతలు స్వీకరించి సిమ్రాన్ తన కెరీర్‌కు ఇబ్బంది కలిగించే తప్పు మాత్రం చేయలేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అటు వ్యాపారంతో పాటు ఇటు సినిమాల్లోనూ సిమ్రాన్ దూసుకెళ్తోంది. సిమ్రాన్, దీపక్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరూ కూడా మగపిల్లలే కావడం విశేషం. పెద్దకుమారుడు అదీప్ ఓడో, చిన్నకుమారుడు ఆదిత్ వీర్. పెద్ద కుమారుడు 2005లో జన్మించగా చిన్న కుమారుడు మాత్రం 2011లో పుట్టాడు. పెద్దకుమారుడికి ప్రస్తుతం 17 ఏళ్లు. అతడికి సినిమాల్లో నటించడం అంటే ఇష్టమట. దీంతో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. త్వరలో అదీప్ సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా సిమ్రాన్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ గుల్మోహార్ మూవీలో నటిస్తోంది.
1
2