
చాలా మంది హీరోయిన్స్ కి అందం ఉంటె నటన ఉండదు..నటన ఉంటె అందం ఉండదు..అందం మరియు నటన రెండు ఉన్న హీరోయిన్స్ లో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిస్టరీ లోనే చాలా తక్కువ మంది ఉన్నారు..ఆ అతి తక్కువ మందిలో ఒకరే రంభ..విజయవాడ కి చెందిన ఈ తెలుగు అమ్మాయి..టాలీవుడ్ , కోలీవుడ్ మరియు బాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్ లో అప్పట్లో ప్రతి స్టార్ హీరో సరసన నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది..అప్పట్లో ఈమె కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు మాత్రమే కాకుండా హీరోలు కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉండేవారు..అందం మరియు అభినయం తో పాటుగా రంభ కి ఉన్న మరో అద్భుతమైన క్వాలిటీ ఏమిటి అంటే డాన్స్ చెయ్యడం..ఈమె తో డాన్స్ చెయ్యడానికి మెగాస్టార్ చిరంజీవి వంటి వారికి కూడా కష్టమైన సందర్భాలు ఉన్నాయి..ఎంత కఠినతరమైన స్టెప్ అయినా కూడా అలవోకగా వెయ్యడం రంభ కి ఉన్న స్పెషలిటీ..అయితే ఈమె గత కొంత కాలం నుండి ఇండస్ట్రీ కి మరియు మీడియా కి దూరం గా ఉంటూ వస్తుంది..ఇక తర్వాత ఈమె 2010 వ సంవత్సరం లో ఇంద్ర కుమార్ అనే ప్రముఖ తమిళ పారిశ్రామికవేత్త ని పెళ్ళాడి సినిమాలకు పూర్తిగా గుడ్బై చెప్పేసింది.
రంభ అసలు పేరు విజయ లక్ష్మి..ఈమెని ప్రముఖ దర్శకుడు EVV సత్యనారాయణ ఆ ఒక్కటి అడక్కు అనే సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు..అయితే ఈ సినిమా పూర్తి అయ్యే సమయానికి EVV గారు నీ పేరు రంభ గా మార్చుకోమని సూచించారట..ఈ పేరు చాలా ట్రెండీ గా ఉందని..హీరోయిన్ గా స్క్రీన్ నేమ్ కి ఈ పేరు అద్భుతంగా సరిపోతుందని EVV గారు ప్రోత్సహించడం తో రంభగా తన పేరు ని మాచుకుంది..తోలి సినిమా తోనే నటన కి ప్రాధాన్యం ఇస్తూ అందాల ఆరబోత కూడా అదే స్థాయిలో చెయ్యడం తో ఎవరో ఈ అమ్మాయి కొత్తగా ఉంది..అద్భుతంగా ఉంది అంటూ ఈమె పై సినిమా అవకాశాల వెల్లువ కురిపించారు..అలా అనతి కాలం లోనే ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది..ఇక ఈమె చివరిగా తెలుగు వెండితెర మీద కనిపించిన సినిమాలు అల్లు అర్జున్ నటించిన దేశ ముదురు సినిమాలో ఐటెం సాంగ్ ..మరియు ఎన్టీఆర్ హీరో గా నటించిన యమదొంగ సినిమాలో ఐటెం సాంగ్..ఈ రెండు సినిమాల తర్వాత ఆమె పెళ్లి చేసుకొని శాశ్వతంగా సినిమాలకు దూరం అయిపోయింది..ఇది ఇలా ఉండగా ఎంతో అందం గా కనిపించే రంభ లేటెస్ట్ లుక్స్ చూసి ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు..ఒక్కసారి ఆమె లేటెస్ట్ లుక్స్ ఎలా ఉందొ మీరు కూడా ఒక లుక్ వేసుకోండి.
1
2
3
4
5
6
7
8
9