
టాలీవుడ్‌లో ఒకప్పుడు అగ్ర తారగా పేరు తెచ్చుకున్న హీరోయిన్‌లలో మీనా కూడా ఉంటారు. మీనా తెలుగులో దాదాపుగా అగ్రహీరోలందరి సరసన నటించింది. చిరంజీవితో ముఠామేస్త్రి, బాలయ్యతో బొబ్బిలి సింహం, నాగార్జునతో ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అల్లరి అల్లుడు, వెంకటేష్‌తో అబ్బాయిగారు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు సహా దక్షిణాది సినిమాలలో నటించి మంచి హీరోయిన్‌గా స్థిరపడిన మీనా ఆఫర్లు తగ్గుతున్న సమయంలోనే వివాహం చేసుకుని లైఫ్‌లో సెటిలైపోయింది. 2009లో బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విద్యాసాగర్‌ను మీనా పెళ్లి చేసుకుంది. వివాహం తరువాత మీనా భర్త ఉద్యోగం మానేసి వ్యాపారాలు చేస్తూ మంచి వ్యాపారవేత్తగా ఎదిగారు. మీనా-విద్యాసాగర్ దంపతులకు కూతురు జన్మించిన తర్వాత మీనా రీ ఎంట్రీ ఇచ్చి అడపాదడపా సినిమాల్లో కనిపిస్తోంది.
అయితే మీనా భర్త ఇటీవల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో మృతి చెందాడు. అతడి మరణానికి గల కారణాలు తెలిస్తే షాకవ్వడం ఖాయం. ఎవరికైనా పావురాలను చూస్తే ముచ్చట వేస్తుంది. కానీ పావురాల వల్ల మనిషి చనిపోతాడని మీకు తెలుసా.. మీనా భర్త మరణానికి పావురాలే కారణమని ప్రచారం జరుగుతుంది. చెన్నైలోని మీనా కుటుంబం నివసించే ఇంటికి అతి చేరువలో పావురాలు పెద్ద సంఖ్యలో ఉంటాయని.. వాటి వల్లే ఇన్‌ఫెక్షన్‌కు గురై విద్యాసాగర్ అనారోగ్యం పాలయ్యారని తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే విద్యాసాగర్‌కు శ్వాసకోస సమస్యలు వచ్చాయని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఈ ఏడాది ఆరంభంలో ఆయనకు కరోనా రావడంతో సమస్య తీవ్రంగా మారిందని.. దీంతో వైద్యులు ఊపిరితిత్తుల మార్పిడి చేయించాలని సూచించినా దాతలు దొరక్కపోవడంతో విద్యాసాగర్ మృతి చెందినట్లు తమిళ మీడియా వివరిస్తోంది. పావురాల రెట్ట నుంచి రెప్పల వరకు శరీరం మొత్తం రకరకాల వైరస్‌లకు ఆవాసంగా ఉంటుందని.. వీటి నుంచి పదుల సంఖ్యలో వైరస్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాగా విద్యాసాగర్, మీనా దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది. నైనికా ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ కూడా ఇచ్చింది. ఐదేళ్ల వయసులోనే ఇళయ దళపతి విజయ్ నటించిన తేరీ సినిమాలో నైనికా నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో పోలీస్ పేరుతో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో విజయ్ కుమార్తెగా నైనిక నటించింది. అంతేకాకుండా అరవింద్ స్వామి నటించిన భాస్కర్ ఓరు రాస్కెల్ అనే సినిమాలోనూ నైనిక కనిపించింది. 2018లో నిమిర్ అనే మూవీలోనూ నటించింది. నైనిక త్వరలోనే హీరోయిన్‌గా అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నైనిక వయసు 11 ఏళ్లు మాత్రమే. నైనిక జనవరి 1, 2011లో జన్మించింది. కాగా మీనా భర్త విద్యాసాగర్ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం చెన్నైలోని బీసెంట్ నగర్‌లో జరిగాయి. విద్యాసాగర్ భౌతిక కాయం వద్ద తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నివాళులర్పించారు. తన భర్త విద్యాసాగర్ అంత్యక్రియలను మీనా అన్నీ తానై నిర్వహించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
1
2
3