
టాలీవుడ్ లో ఇప్పుడు సంవత్సరానికి ఒక్క హీరోయిన్ పుట్టుకొస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఒక్కప్పటి హీరోయిన్లకు హీరోలతో పాటు సమానంగా ఇమేజ్ ఉండేది, అప్పటి హీరోయిన్ల నటన కూడా ఎంతో అద్భుతంగా ఉండేవి, కానీ ఇప్పుడు వస్తున్నా హీరోయిన్లు అధిక శాతం పాటలకు మరియు గ్లామర్ ఎక్సపోసింగ్ కి మాత్రమే సరిపోతున్నారు,అలనాటి మహానటి సావిత్రి గారి తర్వాత ఎంత మంది నటనకి ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన హీరోయిన్లు ఉన్న కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ అద్భుతమైన నటన తో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తూ ఉంటారు , వారిలో ఒక్కరు భాను ప్రియా గారు, ఈమె అప్పట్లో ఎంత పెద్ద స్టార్ హీరోయినో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, చిరంజీవి ,బాలకృష్ణ ,నాగార్జున మరియు వెంకటేష్ ఇలా అప్పటి స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది, ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ ద్వారా ఇప్పటికి మంచి డిమాండ్ తో కొనసాగుతున్న భ్యానుప్రియ గారి గురించి మీకెవ్వరికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం చూడబోతున్నాము.
భానుప్రియ వాస్తవానికి ఒక్క గొప్ప కూచూపుడి నృత్య కళాకారిణి, ఈమె సినిమాల్లోకి రాకముందు ఎన్నో నృత్య ప్రదర్శనలు కూడా చేసింది, అలా ఆమె మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి అప్పటి తమిళ టాప్ డైరెక్టర్ భారతి వాసు గారి దృష్టిలో పడింది, ఆయన భాను ప్రియని చూసి ఎంతో ఆకర్షితులు అయ్యి అప్పట్లో తానూ తియ్యబోయ్యే మెల్ల పేసుంగల్ అనే తమిళ సినిమా లో హీరోయిన్ గా చేసే అవకాశం ఇచ్చాడు, తోలి సినిమాతోనే తన నటనతో అద్భుతంగా ఆకట్టుకున్న భాను ప్రియ కి వరుసగా సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి, తమిళ్ లో నాలుగు సంవత్సరాల పాటు ఒక్క ఊపు ఊపి భాను ప్రియ తెలుగు లో విక్టరీ వెంకటేష్ హీరో గా వచ్చిన స్వర్ణకమలం అనే సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయం అయ్యింది, ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఈ సినిమా తర్వాత భాను ప్రియ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు, 1983 వ సంవత్సరం నుండి 1996 వ సంవత్సరం వరుకు భాను ప్రియ హీరోయిన్ గా తెలుగు లో ఒక్క వెలుగు వెలిగింది అనే చెప్పాలి.
ఇక భాను ప్రియ వ్యక్తిగత విషయానికి వస్తే 1998 వ సంవత్సరం లో ఆదర్శ్ కౌశల్ అనే గ్రాఫిక్స్ డిసైనర్ ని పెళ్లి చేసుకుంది, వీళ్లిద్దరికీ 2003 వ సంవత్సరం లో అభినయ అనే కూతరు కూడా పుట్టింది, వీళ్ళ ఫోటోలను మీరు క్రింద ఎక్సక్లూసివ్ గా చూడవచ్చు ,ఈ తరం హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని భాను ప్రియ కూతురు ని చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే, ఇది ఇలా ఉండగా భానుప్రియ కౌశల్ కి ఏర్పడ్డ కొన్ని విభేదాల కారణంగా 2005 వ సంవత్సరం లో విడిపోవాల్సి వచ్చింది, అతనితో విడిపోయిన తర్వాత కూడా భాను ప్రియ సింగల్ గానే కొనసాగుతుంది, పెళ్లి తర్వాత కొంత కాలం సినిమాలకు దూరం అయినా భాను ప్రియ ఆదర్శ్ తో విడిపోయిన తర్వాత మళ్ళీ సినిమాలు చెయ్యడం ప్రారంబించింది, ప్రస్తుతం ఈమె సినిమాల్లోనూ సీరియల్స్ లోను ముఖ్య పాత్రలు పోషిస్తూ బిజీ గా గడుపుతుంది.