Home Entertainment హీరోయిన్ పూర్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్

హీరోయిన్ పూర్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానుయేల్

1 second read
0
0
938

బుల్లితెర మీద ఎంటర్టైన్మెంట్ షోస్ కి నిలయం ఈటీవీ ఛానల్ అనే సంగతి మన అందరికి తెలిసిందే..జబర్దస్త్ అనే షో ద్వారా ప్రారంభం అయిన ఈటీవీ ప్రభంజనం నేడు శ్రీదేవి డ్రామా కంపెనీ వరుకు కొనసాగింది..ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది..కొత్త సినిమాలు ఏవి కూడా ఈటీవీ వారు ప్రసారం చెయ్యకపోయినప్పటికీ కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారానే బుల్లితెర మీద TRP రేటింగ్స్ విషయం లో ఇప్పటికి టాప్ 1 స్థానం లో కొనసాగుతూనే ఉంది..ఇప్పటి వరుకు ఈటీవీ లో ప్రసారం అయిన ఎంటర్టైన్మెంట్ షోస్ అన్ని మంచి హిట్ అయినవే ఉన్నాయి..ఇక ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే శ్రీ దేవి డ్రామా కంపెనీ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరించిన ఈ షో కి మంచి రెస్పాన్స్ వచ్చింది..కానీ గత రెండు వారాల నుండి సుడిగాలి సుధీర్ శ్రీ దేవి డ్రామా కంపెనీ షో లో మాత్రమే కాదు..జబర్దస్త్ నుండి కూడా తప్పకున్నాడు..దానికి కారణం ఆయన సినిమాల్లో ఫుల్ బిజీ అవ్వడమే అని తెలుస్తుంది.

ఇక సుడిగాలి సుధీర్ ఈ షో నుండి తప్పుకోవడం తో ఆయన స్థానం లోకి యాంకర్ రష్మీ ని తీసుకున్నారు..గత వారం ఎపిసోడ్ మొత్తం సుడిగాలి సుహాదీర్ లేకపోయినప్పటికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ తోనే షో సాగింది..అయితే మధ్యలో కమెడియన్ ఇమ్మానుయేల్ మరియు జడ్జి పూర్ణ మధ్య చోటు చేసుకున్న సంఘటన అందరిని షాక్ కి గురి చేసింది..పూర్ణ స్టేజి మీదకి ఎక్కి మాట్లాడుతున్న సమయం లో ఇమ్మానుయేల్ ఆమె భుజం మీద చెయ్యి వెయ్యడం తో ఒక్కసారిగా కట్టలు తెంచుకున్న ఆవేశం తో పూర్ణ ఇమ్మానుయేల్ ని తిట్టడం ప్రారంబించింది..ఎప్పుడు సరదాగా ఉండే పూర్ణ మేడం సడన్ గా అలా కోపగించుకోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు..అయితే ఇది TRP రేటింగ్స్ కోసం చేసిన చర్యనా..లేకపోతే నిజంగా పూర్ణ కి కోపం వచ్చిందా అనే అంశం పై సోషల్ మీడియా లో చర్చ నడుస్తుంది..ఎందుకంటే గతం లో కూడా ఇలాంటి సంఘటనే ఇమ్మానుయేల్ మరియు వర్ష మధ్య చోటు చేసుకుంది..ఇమ్మానుయేల్ అప్పట్లో వర్ష ని మగ అబ్బాయి ఫేస్ అంటూ ట్రోల్ చెయ్యడం తో వర్ష కాస్త కంట్రోల్ తప్పి ఆయన మీద అరిచింది..ఇప్పుడు పూర్ణ విషయం లో కూడా అదే జరిగింది అంటూ ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

అయితే ఇటీవల ఒక్క ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఇమ్మానుయేల్ ని పూర్ణ తో జరిగిన గొడవ గురించి అడగగా..అది కేవలం డైరెక్టర్ చెప్పిన విధంగానే చేసాము అని..ఇదంతా కేవలం స్కిట్ లో ఒక్క భాగం మాత్రమే అని చెప్పుకొచ్చాడు..స్కిట్స్ లో అప్పుడప్పుడు జరిగే గొడవలు కొన్ని నిజంగానే జరిగినప్పటికీ..కొన్ని మాత్రం పూర్తిగా స్కిట్స్ లో భాగమే అని చెప్పుకొచ్చాడు ఇమ్మానుయేల్..ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఇక ఈ ఆదివారం ప్రసారం అవ్వబొయ్యే శ్రీ దేవి డ్రామా కంపెనీ షో కి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చెయ్యగా దానికి కూడా వైరల్ రీచ్ వచ్చేసింది..హైపర్ ఆది మరియు రామ్ ప్రసాద్ ని యాసిడెంట్ కేసు లో పోలీసులు పట్టుకొని పోతున్నట్టు చూపించిన ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..మరి వచ్చే వారం ఎపిసోడ్ లో అది నిజామా లేదా స్కిట్ లో భాగం అనేది చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…