
మన టాలీవుడ్ లో ఏడాది కి ఎంత మంది హీరోయిన్లు పుట్టుకొస్తున్న కూడా మనం చిన్నతనం నుండి చూస్తూ పెరిగిన కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఎప్పటికి మరచిపోలేము..అలా మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హీరోయిన్స్ లో ఒక్కరు జెనీలియా..బొమ్మరిల్లు సినిమాతో ఈ అమ్మాయి రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరి ఇంటి అమ్మాయి అయ్యిపోయింది..బాయ్స్ సినిమాతో కెరీర్ ని ప్రారంభించిన ఈమె తెలుగు , తమిళం మరియు హిందీ బాషలలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది..మన టాలీవుడ్ లో ఈమె చేసిన సై, బొమ్మరిల్లు, రెడీ మరియు ఢీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అంత తేలికగా మరచిపోలేము..బాలీవుడ్ లోకి వెళ్లి స్థిరపడిన తర్వాత ప్రముఖ హీరో రితేష్ దేశముఖ్ ని ప్రేమించి పెళ్లాడిన జెనీలియా సినిమాలకి టాటా చెప్పేసి సుఖవంతమైన సంసారం జీవితం ని గడుపుతుంది..ఈమెకి ఇద్దరు కొడుకులు మరియు ఒక్క కూతురు కూడా ఉన్నారు..ఇది ఇలా ఉండగా ఈమె గురించి అప్పట్లో జరిగిన ఒక్క సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
అసలు విషయానికి వస్తే రితీష్ దేశముఖ్ తో పెళ్లి కాకముందు జెనీలియా ఒక్క ప్రముఖ టాప్ హీరో కొడుకు తో ప్రేమాయణం నడిపింది అని..పెళ్లి పీటలు దాకా వెళ్లిన తర్వాత అతను మోసం చేసాడు అని ఇలా పలు రకాల వార్తలు అప్పట్లో మీడియా లో వచ్చి పెను దుమారమే రేపింది..దీని పై ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో యాంకర్ ప్రస్తావించగా..అలాంటిదేమి లేదు అని..నేను అతనిని ఒక్క మంచి స్నేహితుడిగా మాత్రమే చూసాను అని, కానీ అతను అది గుర్తించకుండా నాతో హద్దులు మీరు ప్రవర్తించాడు అని, అందుకే అతని చెంప చెళ్లుమనిపించాను అని చెప్పుకొచ్చింది జెనీలియా..ఇంతకీ అతను ఎవరు ఏమిటి అనేది బహిరంగంగా బయటపెట్టకపోయిన అప్పట్లో ఆమె అతని పై ఎంత కోపం గా ఉండేదో ఆమె మాటల్లోనే తెలిసిపోతుంది..అయితే అతను టాలీవుడ్ కి చెందిన హీరో అయితే కాదు అనే క్లారిటీ ఇచ్చింది జెనీలియా.
ఇది ఇలా ఉండగా సినిమాలకి బ్రేక్ ఇచ్చి దాదాపుగా దశాబ్దం కి పైగా దాటినా జెనీలియా సినీ ప్రస్థానం ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది..ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు రాజకీయ నాయకులూ గాలి జనార్ధన్ రెడ్డి కొడుకు హీరో గా చెయ్యబోతున్న ఒక్క సినిమా లో జెనీలియా ఒక్క ముఖ్య పాత్ర పోషించబోతుంది..అంతే కాకుండా హీరో రామ్ పోతినేని తదుపరి చిత్రం లో కూడా జెనీలియా ఒక్క ముఖ్యమైన పాత్ర పోషించబోతుంది అట..గతం లో వీళ్లిద్దరు కలిసి రెడీ అనే సినిమాలో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే.. ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించి ఇద్దరి కెరీర్ లో కూడా మైలు రాయిగా నిలిచిపోయింది..మళ్ళీ ఈ కాంబినేషన్ అలాంటి మేజిక్ ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి..సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె హీరోయిన్ పాత్రలకు కాకుండా నటనకి ప్రాధాన్యం ఉన్న ఛాలెంజింగ్ రోల్స్ చెయ్యడానికి ఆసక్తి చూపిస్తుంది..చూడాలి మరి రీ ఎంట్రీ తర్వాత దర్శకులు ఆమెకి ఎలాంటి క్యారెక్టర్స్ ఇస్తారు అనేది.