
అడవి శేష్ హీరో గా ప్రముఖ హీరో న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కించిన ‘హిట్ 2 ‘ చిత్రం ఇటీవలే విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే..మొదటి రోజు ఓపెనింగ్ అడవి శేష్ కెరీర్ లోనే టాప్ 2 చిత్రాలలో ఒకటిగా నిలిచింది..ఇక ఓవర్సీస్ లో అయితే ఈ సినిమాకి ప్రీమియర్స్ నుండే స్టార్ హీరో రేంజ్ వసూళ్లను రాబడుతూ ట్రేడ్ వర్గాలను షాక్ కి గురి చేస్తుంది..దీనిని బట్టి చూస్తుంటే గత కొద్దీ సంవత్సరాలలోనే అడవి శేష్ హీరో గా తన మార్కెట్ ని ఏ రేంజ్ లో పెంచుకున్నాడు అనేది అర్థం అవుతుంది..అమెరికా లో ఈ సినిమా రెండు రోజులు కూడా పూర్తి కాకముందే 5 లక్షలకు పైగా డాలర్స్ ని వసూలు చేసి మీడియం రేంజ్ హీరోల మూవీస్ లో సరికొత్త రికార్డు ని నెలకొల్పింది.
ఒక కేవలం శనివారం రోజు ఈ సినిమా అమెరికా లో రెండు లక్షలకు పైగా డాలర్స్ ని వసూలు చేసింది..బ్రేక్ ఈవెన్ మార్కు ని మొదటి రోజే దాటేసిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 1 మిలియన్ మార్కు కి దగ్గర్లోకి వెళ్లిన సినిమాగా నిలిచింది..మేజర్ తర్వాత అడవి శేష్ కి అలాంటి కలెక్షన్స్ రావడం విశేషం..ఇక ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కూడా ఈ సినిమా మొదటి రోజు ఎంత వసూళ్లను రాబట్టిందో..రెండవ రోజు అందులో 90 శాతం కలెక్షన్స్ ని హోల్డ్ చెయ్యడం లో సఫలం అయ్యింది..మొదటి రెండు రాష్ట్రాల నుండి నాలుగు కోట్ల 3 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం..రెండవ రోజు మూడు కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..అలా కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా 8 కోట్ల రూపాయిల షేర్ మార్కుకి దగ్గర్లోకి వచ్చేసింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 15 కోట్ల రూపాయలకు జరగగా రెండు రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని ఒకసారి చూసుకుంటే సుమారుగా 12 కోట్ల రూపాయిల వరుకు షేర్ ని రాబట్టేసింది..అంటే ఈ సినిమాకి డబ్బులు పెట్టిన ప్రతిఒక్కరికి కేవలం రెండు రోజుల్లోపే తిరిగి వచ్చేసింది అన్నమాట..మూడవ రోజు నుండే లాభాల్లోకి అడుగుపెట్టే అరుదైన అదృష్టం..సాధారణంగా ఇలాంటి అరుదైన ఘట్టాలు ప్రతి హీరో కి ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటుంది..కానీ అడవి శేష్ కి మాత్రం బ్యాక్ 2 బ్యాక్ జరిగింది..క్షణం , గూఢచారి, ఎవరు, మేజర్ మరియు హిట్ 2 ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుతం అడవి శేష్ కెరీర్ లాగ మరో మీడియం రేంజ్ హీరో కెరీర్ సాగట్లేదని చెప్పుకోవచ్చు..పరిస్థితి ఇలాగె కొనసాగితే ఆయన స్టార్ హీరో రేంజ్ కి కూడా ఎదిగే అవకాశం ఉంది..క్యారక్టర్ ఆర్టిస్టుగా అడుగుపెట్టి హీరో గా ఈ రేంజ్ కి వెళ్లడం అంటే మాములు విషయం కాదు.