
అడవి శేష్ హీరో గా నటించిన ‘హిట్ 2’ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది..ఈ ఏడాది లో కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది ఈ చిత్రం..ఇంతకు ముందు DJ టిల్లు, భింబిసారా , సీతారామన్ , కార్తికేయ 2 మరియు గాలోడు వంటి చిత్రాలు ఇలాగే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కు ని సాధించి సూపర్ స్టేటస్ కి చేరుకున్నాయి..ఇక డబ్బింగ్ సినిమాలలో కాంతారా , లవ్ టుడే వంటి చిత్రాలు కూడా ఇదే రేంజ్ ఫీట్ ని రిపీట్ చేసాయి..అయితే పైన చెప్పిన సినిమాలన్నిటికీ లాంగ్ రన్ లో వసూళ్లు బాగా వచ్చాయి..కానీ ‘హిట్ 2 ‘ మాత్రం వీకెండ్ తర్వాత అసలు వసూళ్లను కనీస స్థాయిలో కూడా రాబట్టలేకపోతుంది..దీనితో అడవి శేష్ కెరీర్ లో గేమ్ చేంజర్ గా నిలుస్తుంది అనుకున్న ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
మొదటి మూడు రోజులు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..మూడు రోజుల ట్రెండ్ ని చూసి ఈ సినిమా కచ్చితంగా 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడుతుందని అందరూ అనుకున్నారు..కానీ సోమవారం నుండి ట్రేడ్ వేసిన అంచనాలన్నీ తలక్రిందులు అయ్యాయి..కలెక్షన్స్ బాగా పడిపోయాయి..దీనితో 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేస్తుంది అనుకున్న ఈ చిత్రం 23 కోట్ల రూపాయిల షేర్ మార్కు దగ్గర ముగిసిపొయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు..మొదటి రోజు నుండి అద్భుతమైన పెర్ఫార్మన్స్ ని చూపిస్తున్న నైజాం మరియు ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి వస్తున్నా వసూళ్లు ప్రస్తుతం అంతంత మాత్రమే..సెకండ్ వీకెండ్ మీదనే బయ్యర్లు భారీ అంచనాలు పెట్టుకున్నారు..ఈ సెకండ్ వీకెండ్ లో ఈ సినినిమా మరో 4 కోట్లు వసూలు చేస్తుందా లేదా అనేది చూడాలి..మొత్తం మీద ఇప్పటి వరుకు ఈ సినిమా వారం రోజులకు గాను 18 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది.
నైజాం ప్రాంతం లో ఇప్పటి వరుకు ఈ సినిమా ఆరు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టగా, సీడెడ్ లో కోటి 50 లక్షల రూపాయిలు మరియు ఉత్తరాంధ్ర ప్రాంతం లో కోటి 60 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఉత్తరాంధ్ర లో ఈ చిత్రానికి మొదటి రోజు నుండి ఆశించిన స్థాయి వసూళ్లు అయితే రావడం లేదు..రోజువారీ కలెక్షన్స్ కూడా అంతంత మాత్రమే..ఒక్క నైజం ప్రాంతం లో మాత్రం ఈ సినిమాకి రోజువారీ కలెక్షన్స్ బాగా వస్తున్నాయి..మిగిలిన అన్ని ప్రాంతాలలో కోటి రూపాయిలకంటే తక్కువ షేర్ వసూళ్లే వచ్చాయి..ఇక ఓవర్సీస్ లో ఈ చిత్రం ఇప్పటి వరుకు 8 లక్షల డాలర్స్ కి పైగా వసూళ్లను రాబట్టింది..ఈ వీకెండ్ తో 1 మిలియన్ మార్కుని అందుకుంటుందని అంచనా వేస్తున్నారు..కర్ణాటక వంటి ప్రాంతాలలో కూడా ఈ సినిమాకి కోటి 80 లక్షల రేంజ్ లో వసూళ్లు వచ్చాయి..ఇది డీసెంట్ స్థాయి వసూళ్లు అని చెప్పొచ్చు.