
అడవి శేష్ హీరో గా శైలేష్ దర్శకత్వం లో న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన హిట్ 2 చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే..మేజర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి ఊపు మీదున్న అడవి శేష్ కి వెంటనే హిట్ 2 రూపం లో ఇదే ఏడాది మరో సూపర్ హిట్ తగలడం నిజంగా అతని అదృష్టం..ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 15 కోట్ల రూపాయలకు మాత్రమే జరగడం వల్ల ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంది..కానీ మొదటి మూడు రోజుల కలెక్షన్స్ తర్వాత ఈ సినిమా వసూళ్లు వీక్ డేస్ లో దారుణంగా పడిపోయాయి..కనీసం స్థాయి హోల్డ్ ని కూడా సాధించలేకపోయింది ఈ చిత్రం..మరో రెండు రోజుల్లో అవతార్ 2 విడుదల అవుతుండగా ఇక హిట్ 2 కలెక్షన్స్ క్లోసింగ్ కి వచేసినట్టే అనుకోవచ్చు.
ఇప్పటి వరకు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా కేవలం 21 కోట్ల రూపాయిల వసూళ్లు మాత్రమే వచ్చాయట..మొదటి మూడు రోజుల్లో 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి, ఆ తర్వాత ఫుల్ రన్ లో కేవలం 6 కోట్ల రూపాయిల వసూళ్లు మాత్రమే వచ్చాయి అంటే చాలా అండర్ పెర్ఫార్మన్స్ ఇచ్చినట్టు లెక్క..ఆ జానర్ ని బట్టి మాస్ సెంటర్స్ లో పెద్దగా కలెక్షన్స్ రావు అనేది ఊహించిందే..కానీ సిటీస్ లో కూడా ఈ చిత్రం వర్కింగ్ డేస్ లో హోల్డ్ చెయ్యలేకపోయింది..ఫలితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనుకున్న సినిమా కేవలం హిట్ గా మాత్రమే నిలిచింది..కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం ప్రతిష్టాత్మక 1 మిలియన్ మార్కుని మాత్రం అందుకుంది..ఒక్కసారి ప్రాంతాల వారీగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
విడుదలైన మొదటి రోజు నుండి నేటి వరుకూ ఈ సినిమాకి మెజారిటీ కలెక్షన్స్ వస్తున్న ప్రాంతం నైజాం..ఇక్కడ ఈ చిత్రం ఫుల్ రన్ లో దాదాపుగా 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..కానీ సీడెడ్ ప్రాంతం లో మాత్రం మొదటి రోజు నుండి తక్కువే వస్తున్నాయి..ఇక్కడ ఈ చిత్రానికి కేవలం కోటిన్నర షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి..ఉత్తరాంధ్ర ప్రాంతం పరిస్థితి కూడా ఇంతే..మొదటి రోజు నుండి తక్కువ వసూళ్లను నమోదు చేసుకుంటున్న ఈ సినిమా కి ఇక్కడ కోటి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..అలాగే ఈస్ట్ లో 90 లక్షలు, వెస్ట్ లో 60 లక్షలు ,గుంటూరు లో 93 లక్షలు , కృష్ణ లో 85 లక్షలు మరియు నెల్లూరు జిల్లాలో 52 లక్షల రూపాయిలను వసూలు చేసింది ఈ చిత్రం..ఓవర్ ఆల్ గా ఓవర్సీస్ కలిపి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.