Home Entertainment హిందీ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లైగర్..ఎంత వసూళ్లను రాబట్టిందో తెలిస్తే నోరెళ్లబెడుతారు

హిందీ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లైగర్..ఎంత వసూళ్లను రాబట్టిందో తెలిస్తే నోరెళ్లబెడుతారు

0 second read
0
0
3,431

విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లైగర్ సినిమా ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి మన అందరికి తెలిసిందే..పాపం విజయ్ దేవరకొండ ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు..ఒక పెద్ద స్టార్ హీరో సినిమా విడుదలైతే ఎలాంటి వాతావరణం ఉంటుందో..లైగర్ సినిమా విడుదల సమయం లో అలాంటి వాతావరణమే ఉండింది..ఎక్కడ చూసిన ఈ సినిమా టికెట్స్ గురించే చర్చ సాగేది..ఆ రేంజ్ లో హైప్ తెచ్చుకున్న సినిమా ఇది..నిజంగా ఈ సినిమాకి టాక్ వచ్చి ఉంటె విజయ్ దేవరకొండ నేరుగా స్టార్ హీరోల లీగ్ లోకి వెళ్ళేవాడు..కానీ ఆయన దురదృష్టం..మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది..ఓపెనింగ్ డే మంచి వసూళ్లనే రాబట్టిన కూడా ఆ తర్వాత నుండి వసూళ్లు అతి దారుణంగా పడిపోయాయి..వారం రోజులు కూడా తిరగకముందే థియేటర్స్ నుండి లేపేయాల్సిన దుస్థితి ఏర్పడింది..ఇంత పెద్ద ఫ్లాప్ ని మళ్ళీ ఇప్పట్లో చూడలేం ఏమో.

90 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం..ఫుల్ రన్ లో కనీసం 30 కోట్ల రూపాయిలను కూడా రాబట్టలేకపోయింది..కానీ విజయ్ దేవరకొండ కి మొదటి నుండి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది అని అందరూ అంటూ ఉంటారు..అది కేవలం రూమరేమో అని అనుకునేవారు చాలా మంది ఉండేవారు..కానీ డిజాస్టర్ ఫ్లాప్ టాక్ మీద హిందీ లో లైగర్ సినిమాకి వచ్చిన వసూళ్లు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..ఈ సినిమా కి హిందీ వెర్షన్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 9 కోట్ల రూపాయిల వరుకు జరిగింది..మొదటి రోజు డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా దాదాపుగా 5 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది..ఈ రేంజ్ వసూళ్లు పుష్ప మరియు రాధే శ్యామ్ సినిమాలకు కూడా మొదటి రోజు రాకపోవడం విశేషం..కేవలం ఒక్క రోజు తోనే ఈ సినిమా ఆగిపోలేదు..అక్కడ ఫుల్ రన్ లో ఈ చిత్రానికి దాదాపుగా 25 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.

షేర్స్ లెక్కలోకి వేస్తె దాదాపుగా 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అన్నమాట..అంటే జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి మూడు కోట్ల రూపాయిలు లాభాల్ని తెచ్చిపెట్టింది అన్నమాట ఈ సినిమా..ఇది చాలా రేర్ రికార్డు అని చెప్పొచ్చు..జనాలందరూ గాండ్రించి ఊసిన సినిమాకే ఇంత వసూళ్లు వస్తే..విజయ్ దేవరకొండ సరైన సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తే అక్కడి స్టార్ హీరోలకు కూడా సవాలు విసిరేవాడు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు..ప్రస్తుతం విజయ్ దేవరకొండ నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణం తో ఖుషి అనే సినిమా చేస్తున్నాడు..సమంత ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది..ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ని జరుపుకున్న ఈ చిత్రం తో విజయ్ దేవరకొండ గ్రాండ్ కం బ్యాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు..మరి ఒకే ఒక్క భారీ హిట్ తో పెద్ద హీరోల లిస్ట్ లోకి వెళ్లగలిగే సత్తా ఉన్న విజయ్ దేవరకొండ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

కన్నడతో పాటు పలు భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన నటి వాణీ జయరామ్ ఈరోజు (ఫిబ్రవరి 4) చెన్…