Home Entertainment హిందీ లో దుమ్ములేపేసిన ‘సీతారామం’ కలెక్షన్స్..ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసా..?

హిందీ లో దుమ్ములేపేసిన ‘సీతారామం’ కలెక్షన్స్..ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసా..?

1 second read
0
0
297

ఈ ఏడాది అతి చిన్న సినిమాగా తెలుగు లో విడుదలై సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం సీతారామం..మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరో గా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై 50 రోజులకు దగ్గర్లో ఉన్నా కూడా ఇప్పటికి చాలా ప్రాంతాలలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తూనే ఉంది..గడిచిన 5 ఏళ్లలో ఇలాంటి లాంగ్ రన్ ఉన్న బ్లాక్ బస్టర్ చిత్రం టాలీవుడ్ టాప్ స్టార్ హీరోస్ కి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..కొత్త సినిమాలు వస్తున్నాయి..పోతున్నాయి..కానీ సీత రామం సినిమా మేనియా మాత్రం OTT విడుదలైన తర్వాత కూడా కొనసాగుతూ ఉందంటే ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు..ఇటీవలే ఈ సినిమాని హిందీ లోకి కూడా దబ్ చేసి వదిలారు..అక్కడ కూడా సెన్సషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ చిత్రం.

రోజు రోజు కి ఈ సినిమా హిందీ లో వసూళ్లు చేస్తున్న కలెక్షన్స్ ని చూస్తుంటే ఎలాంటి వాడికైనా మతి పోవాల్సిందే..50 లక్షలు రూపాయిల లోపే నెట్ వసూళ్లను సాధించిన ఈ సినిమా ఇప్పటి వరుకు 8 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టినట్టు తెలుస్తుంది..అంటే దాదాపుగా 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది అన్నమాట..రేపు నేషనల్ సినిమా డే అవ్వడం తో అథియా తక్కువ టికెట్ రేట్లకే ఈ సినిమా హిందీ లో అందుబాటులోకి రానుంది..దీని వల్ల సీత రామం కలెక్షన్స్ రేపు చాలా ఎక్కువగా ఉండే అవకాశం లేకపోలేదు..ఇప్పటికే 8 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో 20 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబడుతుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..ఇక ఈ సినిమాకి సంబంధించిన తెలుగు మరియు మలయాళం వెర్షన్ బిజినెస్ లు క్లోజ్ అయ్యాయి.

తెలుగు మరియు మలయాళం వెర్షన్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమా 42 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసింది..ఇప్పుడు హిందీ కలెక్షన్స్ కూడా తోడు అవ్వడం తో హిందీ వసూళ్లను కూడా కలుపుకొని ఈ చిత్రం 46 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మరియు 96 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..చిన్న సినిమాగా మొదలైన ఒక చిత్రం ఈ స్థాయి ప్రభంజనం సృష్టించడం ఇటీవల కాలం లో ఎప్పుడూ జరగలేదు..ఆ అద్భుతమైన ఘనత ని సీతారామం సినిమానే దక్కించుకుంది..హిందీ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో ఇటీవలే ముంబై లో ఈ సినిమాకి సంబంధించిన విజయోత్సవ వేడుకని కూడా నిర్వహించారు యూనిట్ సభ్యులు..ఈ వేడుకకి హీరో హీరోయిన్ తో పాటు డైరెక్టర్ నిర్మాతలు కూడా పాల్గొన్నారు..అంతే కాకుండా దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన లేటెస్ట్ హిందీ చిత్రం చుప్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది..అలా ఈ మలయాళం హీరో అన్ని బాషలలో సినిమాలు చేస్తూ తిరుగులేని పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా ఎదిగే దిశలో దూసుకుపోతున్నాడు.

 

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…