Home Entertainment హిందీ లో కొనసాగుతున్న ‘గాడ్ ఫాదర్’ ప్రభంజనం..తొలివారం అక్కడ ఎంత వసూలు చేసిందో తెలుసా..?

హిందీ లో కొనసాగుతున్న ‘గాడ్ ఫాదర్’ ప్రభంజనం..తొలివారం అక్కడ ఎంత వసూలు చేసిందో తెలుసా..?

0 second read
0
0
631

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ హిట్ టాక్‌తో రెండో వారంలోకి ప్రవేశించింది. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ మూవీ భారీ స్థాయిలో విడుదలైంది. రీమేక్ చిత్రాల స్పెష‌లిస్ట్ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా ఈ మూవీని తెరకెక్కించాడు. మలయాళం మూవీ లూసీఫర్‌కు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ మూవీ విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. తొలి వారం హిందీలో గాడ్ ఫాదర్ రూ.8 కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్ర పోషించడంతో హిందీ ప్రేక్షకులు ఈ మూవీని ఆదరించినట్లు ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. హీరోయిన్, డ్యూయట్స్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి చేసిన ప్రయోగం ఇది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మూవీలో నేను రాజకీయాలకు దూరమైనా.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ చిరు చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది.

తెలుగు వెర్షన్ కోసం దర్శకుడు మోహన్ రాజా చేసిన మార్పులు, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గాడ్ ఫాదర్ సినిమాకు అదనపు బలంగా నిలిచాయి. తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణలలో తొలి వారం వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి. తొలిరోజు రూ.12.97 కోట్లు, రెండో రోజు రూ.7.73 కోట్లు, మూడో రోజు రూ.5.41 కోట్లు, నాలుగో రోజు రూ.5.62 కోట్లు, ఆరో రోజు రూ.1.51 కోట్లు, ఏడో రోజు రూ.83 లక్షల వసూళ్లను గాడ్ ఫాదర్ సాధించింది. తొలివారం ఈ మూవీ ఏపీ, తెలంగాణలలో రూ.64.8 కోట్ల గ్రాస్, రూ.39.3 కోట్ల షేర్ వసూళ్లను సొంతం చేసుకుంది.

అయితే గాడ్ ఫాదర్ మూవీకి ప్రి రిలీజ్ బిజినెస్ రూ.92 కోట్లు జరిగింది. దీంతో మరో రూ.38 కోట్ల వసూళ్లు వస్తేనే ఈ మూవీ క్లీన్ హిట్‌గా నిలుస్తుంది. రెండో వారంలో టాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ రీతిలో సినిమాలు లేకపోవడం మెగాస్టార్ మూవీకి కలిసొస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సెకండ్ వీక్‌లో గాడ్ ఫాద‌ర్ ఎంత క‌లెక్ట్ చేస్తుంద‌నేది చూడాలి. ఏది ఏమైనా గాడ్ ఫాద‌ర్ బ‌య్య‌ర్లకు లాభాల కంటే న‌ష్టాల్నే మిగిల్చే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. 2019లో మ‌ల‌యాళ‌ంలో పృథ్వీరాజ్, మోహ‌న్ లాల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ లూసీఫ‌ర్ రీమేక్‌గా తెలుగులో గాడ్ ఫాద‌ర్ తెర‌కెక్కింది. ఈ చిత్రాన్ని సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్ అండ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ పై సంయుక్తంగా నిర్మించ‌గా.. ఆర్బీ చౌద‌రి, ఎన్వీ ప్ర‌సాద్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. మంచి టాక్ రావడంతో గాడ్ ఫాదర్ హిందీ వెర్షన్‌కు మరో 600 థియేటర్లను పెంచుతున్నట్టు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ వీడియోను రిలీజ్ చేసారు. మరో వీడియోలో సల్లూభాయ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల – చైతన్య..గుండెలు పగిలేలా ఏడుస్తున్న నాగబాబు

ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.సమంత – నాగ చైతన…