
తెలుగు చలన చిత్ర పరిశ్రమకి మొట్టమొదటి మాస్ హీరో..ఇండస్ట్రీ ని సాంకేతిక పరంగా..జానర్స్ పరంగా ఎవ్వరు ఊహించని రీతిలో వేరే లెవెల్ కి తీసుకెళ్లిన మహామనిషి..మనసున్న మారాజు సూపర్ స్టార్ కృష్ణ గారిని ఇష్టపడని వారంటూ ఎవ్వరు ఉండరు..నిర్మాతల పాలిట బంగారు ఖజానా వంటివాడు సూపర్ స్టార్ కృష్ణ..తన తర్వాత ఇండస్ట్రీ ని మరో లెవెల్ కి తీసుకెళ్లేందుకు మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ని మనకి ఇచ్చాడు..ఆయన 80 ఏళ్ళ జీవితం లో 50 ఏళ్లకు పైగా సినీ జీవితమే ఉంటుంది..అలాంటి మహానుభావుడి మరణ వార్త విని యావత్తు సినీ లోకం శోకసంద్రం లో మునిగిపోయింది..ముఖ్యంగా కృష్ణ గారిని తెలుగు ప్రేక్షకులు ఒక సినిమా హీరోలాగా ఎప్పుడు అనుకోలేదు..తన సొంత కుటుంబ సబ్యుడిగానే చూసారు..అలాంటి వాడు చనిపోయాడు అనే వార్త తెలియగానే గుండెలు బాదుకొనిమరీ ఏడ్చారు ఫాన్స్..పెద్ద వయస్సులో జీవితభాగస్వాములైన విజయ నిర్మల మరియు ఇందిరా దేవి గార్ల మరణం ని చూసి తట్టుకున్న కృష్ణ..మొదటి కొడుకు మరణం ని కూడా కాళ్ళరా చూడాల్సి వచ్చింది.
అలా మనసుకి దగ్గరైన కుటుంబ సభ్యులు ముగ్గురు చనిపోవడం తో కృష్ణ గారు ఎంతో మానసిక క్షోభ కి గురైయ్యారు..సగం అదే ఆయనని ఆరోగ్యం గా కూడా కృంగదీసేలా చేసింది. .కృష్ణ గారు తరుచూ హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్ లోని కాంటినెంటల్ హాస్పిటల్ కి వెళ్తుంటాడు..డాక్టర్లు అంటే కృష్ణ గారికి ఎంతో గౌరవమని..వాళ్ళు చెప్పేవి ఎంత కష్టమైన తూచా తప్పకుండ కృష్ణ గారు ఫాలో అయ్యేవారని కాంటినెంటల్ హాస్పిటల్ మ్యానేజింగ్ డైరెక్టర్ మీడియా కి తెలిపాడు..కృష్ణ గారికి గుండెపోటు వచ్చిన ముందు రోజు కూడా ఇక్కడకి వచ్చి చెకప్ చేయించుకున్నాడని..ఆ సమయం లో ఆయన ఆరోగ్యం నార్మల్ గానే ఉందని..కానీ అకస్మాత్తుగా ఈ గుండెపోటు రావడం అనేది మమల్ని కూడా షాక్ కి గురి చేసిందని చెప్పుకొచ్చారు..కృష్ణ గారు చివరిసారిగా నడుచుకుంటూ హాస్పిటల్ కి వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
ఇక కృష్ణ గారి అంత్యక్రియలు మొన్న ఫిలిం నగర్ లోని మహాప్రస్థానం లో ప్రభుత్వ అధికారుల లాంఛనాలతో ఘనంగా నిర్వహించిన సంగతి మన అందరికి తెలిసిందే..కృష్ణ గారి పార్థివ దేహాన్ని కడసారిగా చూసేందుకు పద్మాలయ స్టూడియోస్ కి అభిమానులు పోటెత్తారు..వాళ్ళని కంట్రోల్ చెయ్యడం పోలీసులకు కూడా సాధ్యపడలేదు..కృష్ణ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూసి నేటి తరం యువ మొత్తం ఆశ్చర్యానికి గురైయ్యారు..కృష్ణ గారి గురించి మన అమ్మానాన్నల్ని మరియు తాతయ్యలను అడిగిన్నప్పుడు వాళ్ళు కృష్ణ గురించి చెప్పిన మాటలు వింటే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి..ఆరోజుల్లో కృష్ణ గారి సినిమా విడుదలైంది అంటే థియేటర్ లు సరిపోక , టికెట్స్ దొరకక గౌడౌన్స్ లో ప్రత్యేకంగా అభిమానుల కోసం స్క్రీనింగ్ వేసేవారట..అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అంతకు ముందు నందమూరి తారకరామారావు గారూ ఉండేవారు..ఆంధ్రులు ఆయనని ఆరాధ్య దైవంలాగా భావించే వారు..ఆయన తర్వాత అంతటి క్షణం ని దక్కించుకుంది కృష్ణ మాత్రమే.