Home Uncategorized హాలీవుడ్ హీరోస్ ని దాటి ఆస్కార్ అవార్డు గెలుచుకోబోతున్న ఎన్టీఆర్

హాలీవుడ్ హీరోస్ ని దాటి ఆస్కార్ అవార్డు గెలుచుకోబోతున్న ఎన్టీఆర్

0 second read
0
1
4,091

రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఇది పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ అయింది. కొన్ని నెలల కిందట జపాన్ లోనూ రిలీజ్ చేసి ప్రత్యేకత చాటుకున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి అనేక వర్గాల నుంచి ప్రశంసలు దక్కాయి. కొందరు ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని అన్నారు. కానీ భారత్ నుంచి ఆర్ఆర్ఆర్ కు బదులు గుజరాత్ మూవీని నామినేట్ చేశారు. అయితే తాజాగా ఈ సినిమాలోని ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ మ్యాగజైన్ ది వెరైటీ ఎన్టీఆర్ కు ఆస్కార్ ఇవ్వొచ్చని పేర్కొంది. ప్రపంచ ప్రఖ్యాత సినీ అవార్డు ఆస్కార్ ను అందుకోవాలని ప్రతి నటుడికి ఉంటుంది. కానీ దానిని చేతిలోకి తీసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అలాంటి అదృష్టం భారతీయ నటులకు తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే దశాబ్దాలుగా ఇండియన్ నటులకు వేళ్లమీద లెక్కపెట్టే అవార్డులు మాత్రమే వచ్చాయి. ఆస్కార్ సినీ అవార్డను సొంతం చేసుకోవాలంటే ప్రపంచాన్ని మెప్పించే సినిమా తీయాలి. మనోళ్లు అంతకుమించి తీశారు. కానీ వివిక్ష కారణంగా కొన్ని భారతీయ అద్బుత చిత్రాలు కనీసం నామినేటేడ్ వరకైనా వెళ్లలేకపోయాయి.

భారత్ కు చెందిన నటుల్లో మొట్టమొదటిసారిగా 1982లో భాను అథియా కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆస్కార్ అవార్డును అందుకున్నారు. ఆ తరువాత బెంగాలీ ఫిలిం మేకర్ సత్యజిత్ రే 1992లో ఆస్కార్ ను దక్కించుకున్నారు. ఇక 2009లో ఏఆర్ రెహమాన్, గుల్జర్, రసూల్ పూకెట్టి స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి అందుకున్నారు. ఆ తరువాత భారతీయ సినిమాలకు ఆస్కార్ అవార్డు దక్కలేదు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ తరువాత చాలా మంది ఈ సినిమాకు ఆస్కార్ వస్తుందని ఆశపడ్డారు. 2022లో రిలీజైన ఇండియన్ సినిమాలలో ది బెస్ట్ మూవీగా ఆర్ఆర్ఆర్ ను పాన్ ఇండియా లెవల్లో గుర్తించారు. స్వాతంత్ర్య పోరులో భాగమైన అల్లూరి సీతారామరాజు, కొమురం భీం జీవిత గాథలు ఇందులో వివరించారు. సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించారు. ఇందులో తెలుగువారే కాకుండా బాలీవుడ్ నుంచి అజయ్ దేవ్ గన్, ఆలియా భట్, తమిళం నుంచి సముద్ర ఖని నటించారు. ఇలా ఆల్ ఓవర్ ఇండియన్ నటులను ఇందులో చేర్చడంతో దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ను గుర్తించారు. దీంతో ఆస్కార్ అవార్డు వస్తుందని ఆశపడ్డారు.

అయితే ఇండియన్ ఫిల్మ్ ఫెడరేషన్ జ్యూరీ సభ్యులు ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్ కు పంపలేదు. ఈ సినిమా ప్లేసులో గుజరాత్ కు చెందిన ది లాస్ట్ ఫిలింను పంపించారు. దీంతో చాలా మంది సినీ ప్రియులు ఆర్ఆర్ఆర్ నుం పంపకపోవడంపై విమర్శలు చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్ కు అరుదైన గౌవరం లభించింది. అమెరికాకుం చెందిన ది వెరైటీ అనే మ్యాగ్జిన్ ఎన్టీఆర్ గురించి రాసుకొచ్చింది. ఇందులో విల్ స్మిత్, హు జాక్ మన్ వంటి హాలీవుడ్ స్టార్స్ తో పాటు ఎన్టీఆర్ కు మ్యాగ్జిన్ ఆస్కార్ ప్రిడిక్షన్ లిస్ట్ లో చోటు సంపాదించారు. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ నామినేషన్స్ లో షార్ట్ లిస్ట్ అయింది. జనవరి 12 నుంచి 17 వరకు షార్ట్ లిస్టులో ఉన్న చిత్రాలకు జ్యూరీ సభ్యులు ఓటు వేస్తారు. అయితే నాటు నాటు సాంగ్ కు ఓట్లు పడితే ది వైరైటీ ఆష్కార్ గెలుచుకునే అవకాశం ఉంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…