
మాములుగా ప్రేమ కి వయసు తో సంబంధం లేదు అది ఏ వయసు వారికీ అయినా పుడుతుంది అంటుంటాం,కానీ ఇప్పుడు పెళ్లి కి కూడా వయసు తో సంబంధం లేదు అంటున్నారు. దానికి ఉదాహరణే నిన్న జరిగిన నరేష్ ,పవిత్రా గార్ల వివాహం.టాలీవుడ్ యాక్టర్ నరేష్, క్యారక్టర్ ఆర్టిస్ట్ అయినా పవిత్రా గార్లు పెళ్లి చేసుకున్నారు.నరేష్ గారు తన రీ ఎంట్రీ తర్వాత మంచి మంచి పాత్రా ల తో ప్రతి సినిమా లో కనిపిస్తూ బిజీ గా ఉన్నారు , ఇక పవిత్రా గారు కూడా హీరో కి అమ్మ గాను ,హీరోయిన్ కి అమ్మ గా ఈ మధ్య రిలీజ్ అయినా చాల సినిమా లో కనిపిస్తూ ఆమె కూడా బిజీ గానే ఉన్నారు.నరేష్ గారు దివంగత విజయ నిర్మల గారి కుమారుడు, నరేష్ గారికి 60 సంవత్సరాలు ,పవిత్ర గారికి 44 సంవత్సరాలు ,వీరి పెళ్లి వీడియోను నరేష్ తన సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. పరిమిత సంఖ్యలో హాజరైన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షం లో జరిగింది.
టాలీవుడ్‌కి చెందిన సీనియర్ నటుడు వి.కె.నరేష్, నటి పవిత్రా లోకేష్ పెళ్లి జరిగింది. సన్నిహితులు, పరిమితమైన కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక పూర్తయ్యింది. ఈవేడుకకి సంబంధించిన వీడియోను నరేష్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇప్పుడు వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వీడియో పాటు ఒక పవిత్ర బంధం, రెండు మనసులు, మూడు ముళ్ళు, ఏడు అడుగులు .. మీ అందరి ఆశీస్సులు కోరుకుంటున్నాం అనే మెసేజ్‌ను నరేష్ పోస్ట్ చేశారు. దీంతో వారిద్దరూ తాము వివాహ బంధంలోకి అడుగు పెట్టినట్లు అధికారంగా ప్రకటించినట్లయ్యింది
నరేష్ నాలుగో పెళ్లి ఇది. పవిత్రా కి ఇది రెండో పెళ్లి. నూతన సంవత్స్రంలో తామిద్దరం పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్నట్లు నరేష్, పవిత్రా ఇది వరకే నూతన సంవత్సరం సందర్భంగా ఓ వీడియో ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే.
చెప్పినట్లే వారిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా నరేష్, పవిత్రా పెళ్లి చేసుకుంటారనే దానిపై నెట్టింట వార్తలు వచ్చాయి .. దానిపై ఇటు నరేష్, అటు పవిత్రా కాదనలేదు. తామిద్దరం రిలేషన్ షిప్‌లో ఉన్నామనే తెలిపారు. దీనిపై వివాదం కూడా కొనసాగుతుంది. నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి నరేష్, పవిత్రా పెళ్లిపై గొడవ చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఇక పోతే నరేష్ ,పవిత్రా తమ హానీమూన్ కోసం దుబాయ్ కి వెళ్తున్నట్టు సమాచారం.దుబాయ్ లోనే 2 వారాలు పాటు ఉండి,తమ హనీమూన్ ని బాగా ఎంజాయ్ చేసి, ఆ తర్వాత హైదరాబాద్ వచ్చాక వారు కమిట్ అయినా సినిమా షూటింగ్ ల లో పాల్గొంటారు అని సమాచారం.