
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’ చిత్రం..ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కి సంబంధించిన రెండవ గ్లిమ్స్ నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..అద్భుతమైన యాక్షన్ కట్స్ తో మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో విడుదల చేసిన ఈ టీజర్ కి అటు అభిమానుల నుండి..ఇటు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..మొదటి నుండి ఈ సినిమా పై అభిమానుల్లో కంగారు ఉండేది..ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరుకు పీరియడ్ సినిమాలలో నటించలేదు..ఎప్పుడు మాస్ , క్లాస్ మరియు ఫామిలీ జానర్ సినిమాలలోనే నటించాడు..దానికి తోడు మన టాలీవుడ్ లో పీరియడ్ సినిమాలను డైరెక్టర్ రాజమౌళి తప్ప ఎవ్వరు మ్యానేజ్ చెయ్యలేరని..ఎవ్వరు అలాంటి సినిమాలు తీసిన బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యారని,..పైగా డైరెక్టర్ క్రిష్ ఇప్పుడు వరుస ఫ్లాప్స్ లో ఉన్నాడు అంటూ భయపడ్డారు.
సోషల్ మీడియా లో అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా ఆగిపోతే బాగుండును అని అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు..అయితే అలాంటి అంచనాలు ఉన్న వారందరి మైండ్ ని మార్చేసింది నిన్న విడుదలైన హరి హర వీరమల్లు మూవీ రెండవ గ్లిమ్స్..పవన్ కళ్యాణ్ లుక్ కూడా అభిమానులకు తెగ నచ్చేసింది..ఈ ఒక్కేఒక్క టీజర్ తో ఈ సినిమా మీద అభిమానుల్లో ఉన్న నెగటివ్ అంచనాలను అన్ని మాయం అయిపొయ్యి కచ్చితంగా భారీ హిట్ కొట్టబోతున్నాము అనే నమ్మకం ని అభిమానుల్లో నింపింది..ఇక ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది..అదేంటి అంటే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ సాంగ్ ని అతి త్వరలోనే విడుదల చెయ్యబోతున్నారు అట..నిన్న విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో లోనే టైటిల్ సాంగ్ కి సంబంధించిన లిరిక్స్ ని మనం విన్నాము..ఎంత అద్భుతంగా వచ్చిందో మనకి తెలిసిందే..ఇప్పుడు ఈ టైటిల్ సాంగ్ కి సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ ని అతి త్వరలోనే విడుదల చేయబోతున్నారట దర్శక నిర్మాతలు.
త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియచేయనున్నారు దర్శక నిర్మాతలు..ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా..ప్రముఖ హాలీవుడ్ టెక్నిషియన్స్ అందరూ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు..సుమారు 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కతున్న ఈ సినిమా ని AM రత్నం గారు మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ పై ఘనంగా నిర్మిస్తున్నారు..ఇప్పటికే 60 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం..త్వరలోనే మిగిలిన భాగం ని కూడా పూర్తి చేసుకొని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు..తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో ఒకేసారి ఈ సినిమా విడుదల కాబోతుంది..పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం గా..పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ ని సృష్టిస్తుందో చూడాలి.