Home Entertainment స్టేజి మీద మహేష్ బాబు ఈ రేంజ్ లో డాన్స్ వెయ్యడం మీరు ఎప్పుడు చూసి ఉండరు

స్టేజి మీద మహేష్ బాబు ఈ రేంజ్ లో డాన్స్ వెయ్యడం మీరు ఎప్పుడు చూసి ఉండరు

1 second read
0
0
975

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమా మొదటి రోజు మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని అద్భుతమైన ఓపెనింగ్స్ ని దక్కించుకుంది..వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తో మంచి ఊపు మీద మహేష్ బాబు ఉన్న సమయం లో వచ్చిన సినిమాకి సాధారణ ప్రేక్షకులు కూడా మొదటి నాలుగు రోజుల్లో భారీగా క్యూ కట్టారు..దాని వల్ల మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపుగా 75 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి నాన్ #RRR రికార్డుగా నిలిచింది..ఇక ఓవర్సీస్ లో అయితే అక్కడి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది ఈ సినిమా వసూళ్లు..మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమా అక్కడ దాదాపుగా 2 మిలియన్ డాలర్ల మార్కుని అందుకొని సరికొత్త రికార్డు ని నెలకొల్పింది..ఇప్పటి వరుకు ఈ ప్రాంతం లో ఇక్కడ 3 రేటింగ్స్ వచ్చిన సినిమాలు మినహా ఒక్కటి కూడా రెండు మిలియన్ డాలర్ల మార్కుని అందుకోలేదు..పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం ఇక్కడ రెండు కంటే తక్కువ రేటింగ్స్ తో రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసింది..ఆ సినిమా తర్వాత మూడు కన్నా తక్కువ రేటింగ్స్ తో రెండు మిలియన్ల డాలర్లు వసూలు చేసిన సినిమా సర్కారు వారి పాట ఒక్కటే.

 

సినిమా భారీ విజయం సాధించిందం తో ఈరోజు కర్నూల్ సిటీ లో సర్కారు వారి పాట మూవీ టీం గ్రాండ్ గా విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు..అశేష జనవాహిని మధ్య జరిగిన ఈ విసయోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది..ఇక ఈ ఈవెంట్ లో మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా స్టేజి మీదకి వచ్చి డాన్స్ వేసాడు..ఇంత ఉత్సాహంగా ఆయన మునుపెన్నడూ లేదు అనే చెప్పాలి..మహేష్ బాబు తన సినిమా హిట్ అయితే ఫుల్ జోష్ లో ఉండడం..ఫ్లాప్ అయితే నిరాశ చెందడం మన అందరికి తెలిసిందే..ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే పలు సందర్భాలలో తెలిపాడు..ఈరోజు ఆయనలో ఉన్న ఉత్సాహం ని చూస్తూ ఉంటె సర్కారు వారి పాట సినిమా ఇచ్చిన కిక్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతున్న ఈ మూవీ ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి..భారీ వీకెండ్ తర్వాత సోమవారం కూడా ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంది..ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తూ ఉంటె ఫుల్ రన్ లో ఈ సినిమా కచ్చితంగా 110 కోట్ల రూపాయిల షేర్ ని అందుకుంటుంది అనే అంచనా తో ఉన్నారు దర్శక నిర్మాతలు.

ఇది ఇలా ఉండగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాకి సంబంధించి విడుదల చేస్తున్న కొన్ని ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు అభిమానుల మధ్య పెద్ద చిచ్చు పెట్టింది..పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా లో చేస్తున్న ట్రోలింగ్స్ దెబ్బకి నేరుగా మైత్రి మూవీ మేకర్స్ వారు దిగి వచ్చి వాళ్లకి కౌంటర్ ఇచేలా ట్వీట్స్ వెయ్యడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం..వాళ్ళు ఆలా ట్వీట్స్ వెయ్యడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఇంకా రెచ్చిపోయారు..వాళ్ళకి కౌంటర్ ఇచ్చేవిధంగా మహేష్ బాబు అభిమానులు కూడా నెగటివ్ ట్రెండ్ చేస్తూ ఒక్కరి మీద ఒక్కరు నాన్ స్టాప్ గా విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు..కానీ ఏది ఏమైనా ఇలా అసత్య పోస్టర్లు దింపి ఇరువురి హీరోల అభిమానుల మధ్య గొడవలు పెట్టడం ఏ మాత్రం సరికాదు అని, ఇక నుండీ అయినా ప్రొడక్షన్ టీం వారు కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి అని ట్రేడ్ వర్గాల సాగుతున్న చర్చ.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…