Home Entertainment స్టార్ హీరో పై సెన్సషనల్ కామెంట్స్ చేసిన అక్కినేని నాగార్జున

స్టార్ హీరో పై సెన్సషనల్ కామెంట్స్ చేసిన అక్కినేని నాగార్జున

0 second read
0
2
5,421

మన టాలీవుడ్ లో మాస్ , క్లాస్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క ఆడియన్స్ ని ఒక్క రేంజ్ లో అలరించిన హీరోలలో ఒక్కరు అక్కినేని నాగార్జున..ఆరు పదుల వయస్సు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికి ఎంతో యంగ్ గా కనిపిస్తూ నేటి తరం స్టార్ స్టార్ హీరోలతో పోటీ పడుతున్నారు నాగార్జున..తన ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీ లోకి వచ్చి తమకంటూ ఒక్క ప్రత్యేకమైన స్థానం ని ఏర్పరచుకొని దూసుకుపోతున్నప్పటికీ కూడా వారితో పోటీ పడే రేంజ్ సత్తా ఇంకా నాగార్జున లో ఉంది అనే చెప్పాలి..మధ్యలో కొన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు తగిలినప్పటికీ కూడా ఈ ఏడాది సంక్రాంతి కి విడుదల అయినా బంగార్రాజు సినిమా తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు నాగార్జున..ఈ సినిమా నాగార్జున తో పాటుగా ఆయన తనయుడు నాగచైతన్య కూడా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..చాలా కాలం నుండి సరైన హిట్టు కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానుల ఆకలి ని తీర్చింది ఈ సినిమా..ఈ సినిమా తర్వాత ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు అనే డైరెక్టర్ తో ఘోస్ట్ అనే సినిమా చేస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా గత కొంత కాలం నుండి నాగార్జున గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్త అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..తన తోటి హీరోలతో మరియు యంగ్ జనరేషన్ హీరోలతో ఎప్పుడు మంచి రాపో మైంటైన్ చేసే నాగార్జున చాలా కాలం నుండి ఒక్క హీరో ని మాత్రం దూరం పెట్టాడు అట..ఆ హీరో మరెవరో కాదు..తమిళ స్టార్ హీరో ధనుష్..ధనుష్ ఇప్పుడు ఇండియా లోనే మోస్ట్ క్రేజీ స్టార్ హీరోస్ లో ఒక్కరు అని చెప్పొచ్చు..ఇటీవలే ఆయన అసురన్ అనే సినిమాకి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు..ఇవన్నీ కాసేపు పక్కన పెడితే అప్పట్లో నాగార్జున ప్రధాన పాత్ర లో ధనుష్ హీరో గా తమిళ్ లో ఒక్క సినిమా ప్రారంభం అయ్యింది అట..50 శాతం కి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసారు..కానీ ఆ తర్వాత ఆ చిత్ర నిర్మాత తో ధనుష్ కి ఏర్పడిన కొన్ని విభేదాల కారణంగా సినిమా షూటింగ్ ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది..అడగగానే బిజీ షెడ్యూల్స్ లో కూడా డేట్స్ సర్దుబాటు చేసి ఇచ్చిన నాగార్జున కి షూటింగ్ ఆపేసిన విషయం కనీసం ధనుష్ కూడా చెప్పలేదు అట.

గౌరవం తో అడిగిన వెంటనే డేట్స్ ఇస్తే తిరిగి నాకు ఇచ్చే మర్యాద ఇదా అంటూ నాగార్జున అప్పట్లో బాగా ఫీల్ అయ్యాడట..వాస్తవానికి ఈ సినిమాలో ఆ ప్రధాన పాత్ర ని తొలుత సూపర్ స్టార్ రజినీకాంత్ తో వేయించాలి అని చూశాడట ధనుష్..కానీ రజిని కాల్ షీట్స్ దొరకకపోవడం తో నాగార్జున గారిని రిక్వెస్ట్ చేస్తే ధనుష్ మీద గౌరవం తో తానూ చేస్తున్న సినిమాని కూడా పక్కన పెట్టి ఒప్పుకున్నాడు నాగార్జున..అంత గౌరవం అభిమానం చూపిస్తే దానికి బదులుగా ఆ చిత్ర యూనిట్ ప్రవర్తించిన తీరు నాగార్జున కి పీకల దాకా కోపం వచ్చేలా చేసింది అట..ఆ సంఘటన జరిగిన తర్వాత నుండి ధనుష్ కి మరియు నాగార్జున కి మాటలే లేవు అట..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది..అప్పటి నుండి నాగార్జున కూడా తమిళ్ సినిమాల్లో నటించడం మానేసాడు అని, చాలా కాలం తర్వాత సూర్య తమ్ముడు కార్తీ తో ఊపిరి సినిమాలో నటించాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

అర్జున్ కళ్యాణ్ కి బుగ్గ కందిపొయ్యే రేంజ్ లో ముద్దు పెట్టేసిన వాసంతి..వైరల్ అవుతున్న వీడియో

బిగ్ బాస్ సీజన్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా బయటకి వెళ్లిన అ…