Home Movie News స్టార్ హీరోస్ నే మించిపోతున్న ఈ హీరోయిన్ల రెమ్యూనరేషన్లు

స్టార్ హీరోస్ నే మించిపోతున్న ఈ హీరోయిన్ల రెమ్యూనరేషన్లు

0 second read
0
0
1,997

సాధారణంగా మన సినిమాలలో హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉండదు.సినిమా స్టోరీ మొత్తం హీరో చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.హీరోయిన్లను కేవలం పాటలకి మాత్రమే పరిమితం చేస్తారు మన డైరెక్టర్లు.వీళ్ళ పారితోషికాలు కూడా కేవలం లక్షలలోనే ఉంటది.హీరోలది ఏకంగా కోట్లలో ఉంటాది.అయితే సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ని రూల్ చేస్తున్న కొంతమంది హీరోయిన్లు వారి పారితోషికాలు ఒక్కో సినిమాకి కోట్లలోనే ఉంటుంది.కొంతమంది హీరోయిన్స్ రెమ్యూనరేషన్లు అయితే ఏకంగా కొంతమంది స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ కంటే ఎక్కువ.వీళ్ళు ఒక్క ఏడాది చేతి నిండా సినిమాలు ఉంచుకొని దాదాపు ఒక్క స్టార్ హీరో ఏడాదికి ఒక్క సినిమాకి సంపాదించే సంపాదన వీళ్ళు నాలుగైదు సినిమాల ద్వారా సంపాదిస్తారు.అలాంటి హీరోయిన్స్ గురించి మరియు వారి పారితోషికాల గురించి ఇప్పుడు మనం ఈ సాధనం లో తెలుసుకోబోతున్నాము

ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు యావత్తు దక్షిణ భారత దేశం లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది రష్మిక అనే చెప్పొచ్చు.కుర్ర హీరోల నుండి స్టార్ హీరోల వరుకు ప్రతి ఒక్కరు ఈ అమ్మడు కాల్ షీట్స్ కోసం ఎగబడుతున్నారు.ఈమె లేని బడా హీరో సినిమా ఇటీవల కాలం లో లేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు.ఈమె డిమాండ్ ఆ స్థాయిలో ఉంది మరి.చలో సినిమాతో మన తెలుగు పరిశ్రమ కి పరిచయం అయినా ఈమె గీత గోవిందం సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది.వరుస ఆఫర్లతో కెరీర్ లో దూసుకుపోతున్న ఈమె ప్రస్తుత్తమ్ ఒక్క సినిమాకి కోటి రూపాయిల వరుకు పారితోషికం ని డిమాండ్ చేస్తోంది అట.ప్రస్తుతం మహేష్ బాబు తో సరినేలేరు నీకెవ్వరూ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె ఆ తర్వాత అల్లు అర్జున్ పుష్ప ,ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న ప్రాజెక్ట్ లో నటించబోతుంది.మరో రెండు బ్లాక్ బూస్టర్లు తగిలితే ఈమె రెండు కోట్ల రూపాయిలు పారితోషికం డిమాండ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు

ఇక టాలీవుడ్ లో రష్మిక స్థాయిలో డిమాండ్ ఉన్న మరో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే.ఈమె డిమాండ్ కూడా టాలీవుడ్ లో మాములుగా లేదు.ఒక్క లైలా కోసం సినిమా తో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ఆమె ,ఆ తర్వాత వరుణ్ తేజ్ మొదటి సినిమా లో హీరోయిన్ గా చేసింది.ఆ తర్వాత బాలీవుడ్ లో హ్రితిక్ రోషన్ హీరో గా తెరకెక్కిన మొహంజొదారో సినిమా లో హీరోయిన్ ఛాన్స్ కొట్టి కొంత కాలం బాలీవడ్ లో బిజీ అయ్యింది.మల్లి ఆమె హవా టాలీవుడ్ లో ఒక్క రేంజ్ లో మొదలయింది డీజే సినిమా తో.ఈ సినిమా తో ఆమె తెలుగు లైం లైట్ లోకి వచ్చి వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ఉంది.ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా నటించిన ఆలా వైకుంఠపురం లో చిత్రం ఎంతతి ఘానా విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సినిమా తర్వాత ఆమె తన తదుపరి చిత్రాలకు ఒక్కో సినిమాకి 2 కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తోంది.అంతే ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తే ఏకంగా 8 కోట్ల రూపాయిలు సంపాదిస్తోంది అన్నమాట.

 

కుర్ర హీరోయిన్లతో పాటు సీనియర్ హీరోయిన్లు కూడా ఇప్పటికి వరుస సినిమాలతో బిజీ గా ఉంటున్నారు.వారిలో ఒక్కరు కాజల్ అగర్వాల్.మూడు పదులు వయసు దాటినా ఇప్పటికి ఈ అమ్మడికి కుర్రకారులో ఫుల్ క్రేజ్ ఉంది.అందుకే ఈమెకు ఇప్పటికి కూడా స్టార్స్ సరసన ఆఫర్లు క్యూ కడుతున్నాయి.ఈమె ప్రస్తుతం సగటున ఒక్కో సినిమాకి రెండు కోట్లకు పైగానే పారితోషికం డిమాండ్ చేస్తోంది అట.పవన్ కళ్యాణ్ నుండి అల్లు అర్జున్ వరుకు అందరి స్టార్ హీరోల తో నటించిన ఈమె సీనియర్ హీరోలతో కూడా నటిస్తూ బిజీ గా గడుపుతుంది.ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్నా ఆచార్య సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.గతం లో ఈమె మెగా స్టార్ చిరంజీవి తో ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించిన సంగతి మన అందరికి తెలిసిందే.ఈ సినిమా ఎంతతి ఘానా విజయం సాధించిందో ప్రత్ర్యేకంగా చెప్పనక్కర్లేదు

ఇక టాలీవుడ్ లో ఇప్పటికి నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్న హీరోనే ఎవరైనా ఉన్నారు అంటే అది సమంత అనే చెప్పొచ్చు.ఒక్క పక్క స్టార్ హీరోల సరసన నటిస్తూనే నటన కి ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటిస్తుంది.అంతే కాకుండా ఇటీవల ఆమె అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అయ్యే ది ఫామిలీ మ్యాన్ సిరీస్ రెండవ సీజన్లో కూడా నటించడానికి ఒప్పుకుంది.ఈమె ప్రస్తుతం ఒక్కో సినిమాకి రెండు కోట్లా రూపాయలకు పైగానే పారితోషికం తీసుకొంటోంది అట.అంతే కాకుండా ఈమె త్వరలో తన భర్త అక్కినేని నాగ చైతన్య తో కలిసి ఒక్క ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంబించబోతున్నట్టు సమాచారం.దీనికి సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ఇక వీళ్ళందరి తో పాటు ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో దూసుకుపోతున్న నిధి అగర్వాల్ కి కూడా మంచి డిమాండ్ ఉంది.ఇస్మార్ట్ శంకర్ సినిమా తో కెరీర్ లో తొలిసారి భారీ విజయం అందుకున్న ఈ భామ ప్రస్తుతం ఒక్కో సినిమాకి 70 లక్షల రూపాయిల వరుకు డిమాండ్ చేస్తుంది అట.ఇంకో రెండు బ్లాక్ బస్టర్ హిట్లు పడితే ఈమె కూడా కోటి రూపాయిల వరుకు పారితోషికం ని డిమాండ్ చెయ్యడం లో ఎలాంటి సందేహం లేదు

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

స్టార్ డైరెక్టర్ లైంగిక వేధింపులకు గురైన వరలక్ష్మి శరత్ కుమార్..కంటతడి పెట్టిస్తున్న లేటెస్ట్ వీడియో

వరలక్ష్మి శరత్ కుమార్ అనే పేరు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకు అంటే చాల మంది కి ఈమె క్యారెక్టర…