
తెలుగు బుల్లితెర రాబొయ్యే ప్రతి యాంకర్ కి రోల్ మోడల్ గా మారిన సెన్సషనల్ యాంకర్ సుమ..ఈమెని మన చిన్నతనం నుండి ప్రతి ఈవెంట్ లో ప్రతి షో లో చూస్తూనే ఉన్నాము..మధ్యలో ఎంతమంది యాంకర్స్ వచ్చిన సుమ స్థానం మాత్రం చెక్కు చెదరకుండా అదే స్థాయిలో ఉన్నది..ఇప్పటికి ఆమె చేతినండ గేమ్ షోస్ మరియు రియాలిటీ షోస్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతూనే మరోపక్క ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కూడా ఈమె లేనిదే ఈవెంట్ చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది..ఇంత డిమాండ్ ఉన్నఈమె భారీ స్థాయి లో రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేస్తుంది అట..ప్రస్తుతం ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది..ఆమె భర్త రాజీవ్ కనకాల కూడా పెద్ద ఆర్టిస్ట్ అనే సంగతి మన అందరికి తెలిసిందే..ఇండస్ట్రీ లో ఆయన ఎన్నో ఏళ్ళ నుండి క్యారక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు..కానీ ఆయన సంపాదన కంటే సుమ సంపాదన ఎక్కువ ఉండడం విశేషం..ఇంతకీ సుమ ఒక్కో గేమ్ షో కి ఎంత తీసుకుంటుంది..?ఒక్కో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది..అసలు ఈమె నెల సంపాదన ఎంత..వంటి విషయాలు ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
చిన్న పెద్ద సినిమా అని తేడా లేకుండా సుమ లేని ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అసలు ఊహించుకోలేమి అనే చెప్పాలి..చిన్న స్థాయి సినిమాలకు రెండు లక్షల రూపాయిలు మరియు పెద్ద స్థాయి సినిమాలకి సుమారుగా 5 లక్షల రూపాయిలు సుమ పారితోషికంగా తీసుకుంటుంది అట..అంటే సాగుతున్న సుమ నెల 8 సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే ఆమెకి కేవలం ఈ ఈవెంట్స్ నుండే 40 లక్షల రూపాయిల సంపాదన ఉంటుంది అట..ఇవే కాకుండా ఆమె ఈటీవీ లో కాష్ అనే ప్రోగ్రాం , అలాగే మా టీవీ లో పలు ప్రోగ్రామ్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఒక్కో ఎపిసోడ్ కి గాను ఈమె మూడు లక్షల రూపాయిల పారితోషికం తీసుకుంటుంది అట..అంటే దాదాపుగా నెలకి ఈ షోస్ నుండి ఈమె 15 లక్షల రూపాయిల వరుకు సంపాదిస్తుంది అట..ఇవి కాకుండా సినిమా విడుదల సమయం లో హీరో హీరోయిన్స్ తో ఇంటర్వూస్ తీసుకోవడం వంటివి తరుచు చేస్తూనే ఉంటుంది సుమ..వీటి నుండి ఆమె కనీసం 5 లక్షల రూపాయిలు అందుకుంటుంది అట.
అలా నెలకి సుమ సంపాదన దాదాపుగా 70 లక్షల రూపాయిల వరుకు ఉంటుంది అట..ఒక్క యువ హీరో ఆరు నెలల పటు డేట్స్ ఇచ్చి సినిమా చేస్తేనే 2 నుండి మూడు కోట్ల రూపాయలకు మించి పారితోషికం రాదు..ఇక హీరోయిన్స్ సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్ళ గరిష్ట పారితోషికమే కోటి నుండి రెండు కోట్ల రూపాయిల వరుకు ఉంటుంది..అలాంటిది సుమ కేవలం ఒక్క ఏడాదిలోనే దాదాపుగా 7 నుండి 8 కోట్ల రూపాయిలు సంపాదిస్తుంది..ఇక రాజీవ్ కనకాల కూడా మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ కావడం తో ఈయన పారితోషికం కూడా గట్టిగానే ఉంటుంది..తానూ సంపాదించిన డబ్బులను అధిక శాతం రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పెట్టి మంచిగానే పోగు చేసాడు..అలా కేవలం రెండు మూడేళ్ళ వ్యవధిలోనే భార్య భర్తలు ఇద్దరు కోట్ల రూపాయిల ఆస్తులను కూడగట్టారు అట..ఇక సుమ ఇన్ని రోజులు కేవలం బుల్లితెర కి మాత్రమే పరిమితం అయినా సంగతి మన అందరికి తెలిసిందే..అడపాదడపా కొన్ని సినిమాలలో కనిపించినప్పటికీ ఎందుకో ఆర్టిస్టుగా ఆమెకి ఆశించిన స్థాయి గుర్తింపు రాలేదు..అయితే చాల తర్వాత ఆమె జయమ్మ పంచాయితీ అనే సినిమా ద్వారా టైటిల్ పాత్రలో మన ముందుకి వచ్చింది ..వరుసగా పెద్ద సినిమాల ప్రవాహం లో ఈ మూవీ కొట్టుకుపోయింది అనే చెప్పాలి..౩కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం..కనీసం కోటి రూపాయిల షేర్ ని కూడా దక్కించుకోలేకపోయింది..ఇక ఈ సినిమా ఫలితం వల్ల భవిష్యత్తులో సుమ సినిమాల్లో నటిస్తుందా లేదా అనేది ప్రశ్నర్ధకంగా మారింది.