
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా కూల్ & కంపోస్డ్ గా ఉండే హీరోలలో ఒకరు అక్కినేని నాగ చైతన్య..ఇతనంతే కేవలం అక్కినేని అభిమానులకు మాత్రమే కాదు..ఇతర హీరోల అభిమానులకు కూడా చాలా ఇష్టం..మంచి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిగా నాగ చైతన్య కి అలాంటి ఇమేజి ఉంది..తాను ఎంతగానో ప్రేమించిన సమంత తో ఏడాది క్రితం విడాకులు తీసుకున్నప్పుడు కూడా అందరూ సమంత నే తిట్టారు కానీ నాగ చైతన్య ని ఒక్కరు కూడా ఏమనలేదు..విడిపోయిన ఏడాది తర్వాత అతను వేరే అమ్మాయితో ప్రేమాయణం నడపడం పై మాత్రం కాస్త నెగటివిటీ ఏర్పడింది..అసలు సమంత తో విడాకులు జరగడానికి కారణం ఆ అమ్మాయి తో ఉన్న ఎఫైర్ కారణమా అనే సందేహం అందరిలో నెలకొంది ఇప్పుడు..పరిశీలించి చూస్తే సమంత మరియు నాగ చైతన్య లు విడాకులు అధికారికంగా ప్రకటించిన పక్క రోజే సమంత కి సంబంధించిన మేకప్ డిజైనర్ ‘స్లుట్..అనుకున్నది సాధించావు గా ప్రేమ జంటని విడదీసి’ అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు.
ఆ తర్వాత అతను నెగటివిటీ కారణంగా ఆ పోస్టు ని డిలీట్ చేసేసాడు..అతను పెట్టిన ఆ స్టోరీ ని ఆధారంగా తీసుకుంటే వీళ్లిద్దరు విడిపోవడానికి కారణం నాగ చైతన్య శోభిత దూళిపాళ్లతో ప్రేమాయణం నడపడం వల్లనేనా అనే సందేహం అందరిలో నెలకొంది..అంతే కాకుండా బాలీవుడ్ పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాం లో పాల్గొన్న సమంత నాగ చైతన్య పేరు తీస్తే చిరాకు పడింది..మళ్ళీ అతనితో స్నేహం చేస్తారా అని అడిగిన ప్రశ్న కి సమంత సమాధానం చెప్తూ ‘మేము కలిసినప్పుడు చుట్టుపక్కన పరిసరాల్లో పదునైన వస్తువులు లేకుండా చూసుకోవాలి..లేదంటే నా పాత భర్త ని చంపేస్తాను’ అని కామెంట్ చేసింది..అది సోషల్ మీడియా లో పెద్ద దుమారమే రేపింది..నాగ చైతన్య మీద సమంత కి అంత కోపం ఉండడానికి కారణం శోభిత తో నాగ చైతన్య నడిపిన ఎఫైర్ వల్లే అని విశ్లేషకులు చెప్తున్నా మాట.
ఇక నాగ చైతన్య మరియు శోభిత ప్రేమలో ఉన్నారు అనేదానికి మరో ఆధారం కూడా రీసెంట్ గా దొరికింది..వీళ్లిద్దరు కలిసి హాలిడే ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియా లో అప్లోడ్ చేసింది శోభిత..దీనితో వీళ్లిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనే రూమర్ కి మరింత ఇంధనం పోసినట్టు అయ్యింది..త్వరలోనే వీళ్ళు తమ పెళ్లి పై అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్టు సమాచారం..మరి దీనిపై సమంత రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి..అసలే మయోసిటిస్ వ్యాధితో బాధపడుతూ ఒంటరి పోరాటం చేస్తున్న సమంత కి ఇలాంటి వార్తలు మరింత ఒత్తిడి ని గురి చేసేలా ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సమంత తన జీవితం లో చోటు చేసుకున్న సంఘటనలను తల్చుకుంటూ కన్నీళ్లు కూడా పెట్టేసింది..విడాకులు తీసుకున్న సమయం లో సమంత ని వేలెత్తి చూపించినవారే నేడు ఆమెని మెచ్చుకుంటున్నారు.