
ఇండస్ట్రీలో అక్కినేని వంశానికి మంచి పేరు ఉంది. ఆనాడు అక్కినేని నాగేశ్వరరావు నుంచి ఈనాడు అఖిల్ వరకు ఆ వంశం నుంచి ఎందరో నటులు, నిర్మాతలు, టెక్నీషియన్‌లు ఇండస్ట్రీలో చలామణి అయ్యారు. అక్కినేని వంశం నుంచి నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చి తండ్రి మాదిరే హీరోగా, నిర్మాతగా నాగార్జున సక్సెస్ అయ్యాడు. స్టార్ హీరోగా మారి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. నాగార్జున అంటే ఇండస్ట్రీలో రొమాంటిక్ హీరోగానే పరిగణిస్తారు. ఇప్పుడు నాగ్ వయసు మీరినా అతడి వారసులు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. చైతూకు ఏ మాయ చేశావె మంచి బ్రేక్ ఇవ్వగా అఖిల్‌కు ఎట్టకేలకు గత ఏడాది మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా విజయాన్ని అందించింది. అయితే ప్రస్తుతం నిత్యం అక్కినేని పేరు మీడియాలో నానుతోంది. దానికి కారణంగా చైతూ, సమంత విడాకుల వ్యవహారం.
వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన నాటి నుంచి చైతూ, సమంత వ్యక్తిగత విషయాలపై మీడియా అతి శ్రద్ధ చూపుతూ వస్తోంది. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సమంత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తమ విడాకులు సామరస్యంగా జరగలేదంటూ సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా యాంకర్ భర్త నాగచైతన్య అని సంభోదించగా.. కాదు మాజీ భర్త అంటూ తనదైన శైలిలో సమంత మాట్లాడింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మరో న్యూస్ వైరల్ అవుతోంది. చైతూ విడాకులు తీసుకున్న తర్వాత వేరే అపార్టుమెంట్‌లో సింగిల్‌గా ఉంటున్నాడని.. గత అర్ధరాత్రి ఓ హీరోయిన్ అతడి అపార్టుమెంట్‌కు వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల సదరు హీరోయిన్‌తో నాగచైతన్య పెళ్లి అంటూ వార్తలు రావడంతో ఆమె స్పందించి తాము జస్ట్ ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇచ్చింది. కానీ ఇలా అర్ధరాత్రి అబ్బాయి ఒంటరిగా ఉన్న ఇంట్లో ఆమెకు ఏం పని అంటూ సమంత అభిమానులు ఇప్పుడు చైతూను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు.
నిజానికి అక్కినేని ఫ్యామిలీలో రెండు పెళ్లిళ్లు కొత్తేమీ కాదు. నాగేశ్వరరావు సంగతి పూర్తిగా తెలియకపోయినా నాగార్జున కూడా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన తొలుత హీరో వెంకటేష్ సోదరిని పెళ్లాడాడు. ఆ దంపతులకు చైతూ పుట్టాడు. అనంతరం విడాకులు తీసుకున్నారు. నిర్ణయం సినిమాలో నటించిన హీరోయిన్ అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి దంపతులకు అఖిల్ పుట్టాడు. అందరిలా చిన్నపుడు చైతూ నాన్న దగ్గర పెరగలేదు. తల్లి లక్ష్మి దగ్గరే ఉన్నాడు అటు అఖిల్‌కు నిశ్చితార్థం జరిగి రద్దయ్యింది. ఇప్పుడు మరో అమ్మాయిని అతడికి జోడీగా నాగ్ వెతికే పనిలో పడ్డాడు. మరోవైపు అక్కినేని సుమంత్ కూడా గతంలో తొలిప్రేమ హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీళ్లిద్దరి పెళ్లి కూడా పెటాకులు అయ్యింది. ప్రస్తుతానికి సుమంత్ సింగిల్‌గానే ఉంటున్నాడు. త్వరలో మరో పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. దీంతో అక్కినేని ఫ్యామిలీ అంటే ఇండస్ట్రీలో రెండు పెళ్లిళ్లు పక్కా అని.. చైతూ కూడా తాను దీనికి అతీతమేమీ కాదని నిరూపిస్తున్నాడు.