
గోవా భామ ఇలియానా గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాతో ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఇలియానా ఈ సినిమాతో మంచి విజయం అందుకుంది. వెంటనే సూపర్‌స్టార్ మహేష్‌బాబు సరసన పోకిరి సినిమాలో నటించింది. ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో ఇలియానా కెరీర్ ఒక్కసారిగా టాప్‌కు చేరుకుంది. వరుస సినిమాలతో కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. పోకిరి తర్వాత రాఖీ, మున్నా, ఆట, జల్సా, కిక్, జులాయి వంటి హిట్లను తన ఖాతాలో వేసుకుంది. సౌత్‌లో దాదాపుగా యంగ్ హీరోలందరి సరసన ఇలియానా నటించింది. అంతేకాకుండా దక్షిణాదిలో మొట్టమొదటి సారిగా కోటి రూపాయల పారితోషికం అందుకున్న హీరోయిన్‌గా ఇలియానా అప్పట్లో చరిత్ర సృష్టించింది.. అయితే సౌత్‌లో మిగిలిన హీరోయిన్స్‌తో పోలిస్తే ఇలియానాకు సక్సెస్ రేట్ తక్కువ అనే చెప్పాలి.
సక్సెస్ రేటు తక్కువగా ఉన్నా ఇలియానా అందచందాలను చూసి, ఆమె క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శక, నిర్మాతలు ఇలియానాకు అవకాశాలు ఇచ్చేవాళ్లు. కొన్ని సినిమాలు బక్కెట్ తన్నేసినా ఇలియానా పారితోషికం తగ్గించాలని ఏ నిర్మాత అడిగిన దాఖలాలు లేవు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఇలియానా టాలీవుడ్ నుంచి ఒక్కసారిగా కనుమరుగైంది. బాలీవుడ్‌లో ఆమె పాగా వేయడమే దీనికి కారణమని అందరూ భావించారు. కాస్త క్రేజ్ రాగానే ఆదరించిన టాలీవుడ్‌ను మర్చిపోయి బాలీవుడ్‌కు వెళ్ళిపోయింది అంటూ అప్పట్లో ఇలియానాపై కొంతమంది విరుచుకుపడ్డారు. కానీ ఆమె టాలీవుడ్‌కు దూరం కావడానికి బలమైన కారణాలు ఉన్నాయని తాజాగా ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. ఆ రోజుల్లో ఇలియానా ఒక ప్రముఖ స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపి డేటింగ్ చేసిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలో ఇలియారనా గర్భం దాల్చిందని.. కానీ సదరు స్టార్ హీరో పెళ్లికి ఒప్పుకోకపోవడంతోనే ఇలియానా టాలీవుడ్ వదిలి వెళ్లిపోయినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
సదరు స్టార్ హీరో ఇంట్లో ఇలియానాను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పడంతోనే ఈ తతంగం నడిచిందని తెలుస్తోంది. హీరో పరిస్థితి అర్థం చేసుకున్న ఇలియానా అబార్షన్ చేయించుకుని టాలీవుడ్‌కు శాశ్వతంగా దూరమై బాలీవుడ్‌లో స్థిరపడిందని టాక్ నడుస్తోంది. చాలా కాలం తర్వాత ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల ఒత్తిడి చెయ్యడంతో ఆయన కోరిక కాదనలేక రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా ద్వారా ఇలియానా రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఈ చిత్రం విడుదలైన తర్వాత మళ్లీ ఆమె తెలుగులో నటించలేదు. బాలీవుడ్‌లో మాత్రం ఇలియానా బర్ఫీ, పటా పోస్టర్ నిఖలా హీరో, మెయిన్ తెరా హీరో, రుస్తుం లాంటి సినిమాల్లో నటించి మంచి హిట్‌లు అందుకుంది. ఇలియానా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. కుర్రకారును రెచ్చగొట్టేలా స్టిల్స్ ఇస్తూ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేస్తుంటుంది. తెలుగులో మహేష్, పవన్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్స్‌తో ఇలియానా సినిమాలు చేసింది.